షావోమీ సబ్‌బ్రాండ్ అయిన పోకో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రెడ్మీ కే30 ప్రో స్మార్ట్‌ఫోన్ రీబ్రాండెడ్ మోడల్‌గా పోకో ఎఫ్2 ప్రో స్మార్ట్‌ఫోన్ యూరప్ మార్కెట్లో పరిచయమైంది. పోకో ఎఫ్2 ప్రో గురించి కొంతకాలంగా లీక్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్ అఫీషియల్‌గా లాంచైంది. పోకో ఎఫ్2 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ అమొలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, డ్యూయెల్ మోడ్ 5జీ, వైఫై 6 సపోర్ట్, ఎన్ఎఫ్సీ, టైప్ సీ పోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్ త్వరలో ఇండియాకు వచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.