సూపర్ ఆఫర్: షావోమీ పోకో ఎఫ్1 పై రూ.5,000 డిస్కౌంట్

పోకో ఎఫ్1 6జీబీ+64జీబీ అసలు ధర రూ.21,999 కాగా రూ.2000 డిస్కౌంట్‌తో ఆఫర్ ధర రూ.19,999 ధర. 6జీబీ+128జీబీ ధర రూ.24,999 కాగా రూ.3000 డిస్కౌంట్‌తో ఆఫర్ ధర రూ.21,999. 8జీబీ+256జీబీ ధర రూ.30,999 కాగా రూ.5,000 డిస్కౌంట్‌తో ఆఫర్ ధర రూ.25,999. ఇక ఆర్మర్డ్ ఎడిషన్ 8జీబీ+256జీబీ ధర రూ.30,999 కాగా రూ.4,000 డిస్కౌంట్‌తో ఆఫర్ ధర రూ.26,999.

news18-telugu
Updated: December 4, 2018, 11:19 AM IST
సూపర్ ఆఫర్: షావోమీ పోకో ఎఫ్1 పై రూ.5,000 డిస్కౌంట్
  • Share this:
షావోమీ పోకో ఎఫ్1... భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఈ ఫోన్ సంచలనాలకు కేంద్రబిందువు. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లతో ప్రీమియం ఫోన్లను ఢీకొట్టిన ట్రాక్ రికార్డ్ పోకోఎఫ్ 1 మోడల్‌ది. తొలి సేల్‌లోనే కేవలం 5 నిమిషాల్లో రూ.200 కోట్ల విలువైన ఫోన్లను అమ్మి రికార్డులు సృష్టించింది షావోమీ. ఆ కంపెనీ నుంచి వచ్చిన కొత్త సిరీస్‌కు ఇప్పటికీ మంచి డిమాండే ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి రావడం స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కి పండగే.

డిసెంబర్ 6 నుంచి 8 వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌‌తో పాటు mi.comలో పోకో ఎఫ్1పై భారీ డిస్కౌంట్ లభించనుంది. పోకో ఎఫ్1 6జీబీ+64జీబీ అసలు ధర రూ.21,999 కాగా రూ.2000 డిస్కౌంట్‌తో ఆఫర్ ధర రూ.19,999 ధర. 6జీబీ+128జీబీ ధర రూ.24,999 కాగా రూ.3000 డిస్కౌంట్‌తో ఆఫర్ ధర రూ.21,999. 8జీబీ+256జీబీ ధర రూ.30,999 కాగా రూ.5,000 డిస్కౌంట్‌తో ఆఫర్ ధర రూ.25,999. ఇక ఆర్మర్డ్ ఎడిషన్ 8జీబీ+256జీబీ ధర రూ.30,999 కాగా రూ.4,000 డిస్కౌంట్‌తో ఆఫర్ ధర రూ.26,999.ఇవి కూడా చదవండి:

పేటీఎం వాడుతున్నారా? యాప్‌లో ఇక ఆ ఫీచర్ ఉండదు

వాట్సప్‌లో వెంటనే మార్చాల్సిన సెట్టింగ్స్ ఇవే...

5.99 అంగుళాల హెచ్‌డీ+ నాచ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845, అడ్రినో 630 జీపీయూ, లిక్విడ్ కూల్ టెక్నాలజీ లాంటి ప్రత్యేకతలు ఫోకో ఎఫ్‌1 స్మార్ట్‌ఫోన్‌కు ఉన్నాయి. ఈ ఫోన్‌కు త్వరలో ఆండ్రాయిడ్ పై అప్‌డేట్ రానుంది. ఆండ్రాయిడ్ క్యూ రిలీజ్ కాగానే ఆ అప్‌డేట్ కూడా వస్తుంది.

ఇవి కూడా చదవండి:

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్: స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే

ఈ యాప్‌తో ఎన్నికల మెసేజ్‌లు, కాల్స్‌ అడ్డుకోవచ్చు...

షావోమీ పోకోఫోన్ ఎఫ్1 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.99 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ, 2160×1080 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128జీబీ, 256 జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో 8.1, ఎంఐయూఐ 9
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: రూసో రెడ్, బ్లూ, బ్లాక్

ఇవి కూడా చదవండి:

రియల్‌మీ యూ1 లుక్ ఎలా ఉందో చూశారా?

కత్తిలాంటి లగ్జరీ కార్లు అంటే ఇవే...

 
First published: December 4, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు