కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్‌ఫోన్ల సందడి మొదలైంది. బేసిక్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ (Budget Smartphone) కొనాలనుకునేవారికి పోకో ఇండియా నుంచి రూ.7,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. పోకో సీ50 (Poco C50) మోడల్‌ను పరిచయం చేసింది. పోకో సీ సిరీస్‌లో వచ్చిన మరో స్మార్ట్‌ఫోన్ ఇది. ఇందులో 5,000mAh బ్యాటరీ, మీడియాటెక్ హీలియో ఏ22 లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మారాలనుకునేవారు, సెకండరీ మొబైల్ వాడాలనుకునేవారు, తక్కువ బడ్జెట్‌లో మొబైల్ కావాలనుకునేవారు ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిశీలించవచ్చు. పోకో సీ50 ధర, ఫీచర్స్, ప్రత్యేకతలు తెలుసుకోండి.
పోకో సీ50 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,499 కాగా, 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,299. జనవరి 10న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. రాయల్ బ్లూ, కంట్రీ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద బేస్ వేరియంట్‌ను రూ.6,249 ధరకే సొంతం చేసుకోవచ్చు.
UPI limit: యూపీఐ ట్రాన్సాక్షన్స్‌పై లిమిట్... గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం , అమెజాన్ పే వివరాలివే
Did someone order a phone with, -6.52" HD+ Display -5000mAh Battery -8MP Dual AI Camera -Fingerprint Sensor 'cuz the POCO C50 is here to #SlayAllDay. Introductory price ₹????,????????????*. To all the hustlers out there, 1st sale on 10th Jan @ 12PM - https://t.co/aatGvVNWSY ???? pic.twitter.com/rfcNY3iXoV
— POCO India (@IndiaPOCO) January 3, 2023
పోకో సీ50 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. లెదర్ లాంటి టెక్స్‌చర్‌తో బ్యాక్ ప్యానెల్ ఉంటుంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్‌తో ఇండియాలో టెక్నో స్పార్క్ గో 2022, లావా బ్లేజ్, టెక్నా పాప్ 5 ప్రో, ఇన్ఫీనిక్స్ హాట్ 12ఐ లాంటి మోడల్స్ ఉన్నాయి.
LIC WhatsApp Services: ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఇక ఈ సేవలన్నీ వాట్సప్‌లోనే పొందొచ్చు
పోకో సీ50 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 8మెగాపిక్సెల్ ఏఐ ప్రైమరీ కెమెరాతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డుతో 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. పోకో సీ50 స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, వైఫై, బ్లూటూత్ 5.0 లాంటి ఆప్షన్స్ ఉన్నాయి.
పోకో సీ సిరీస్‌లో ఇప్పటికే పోకో సీ31 మోడల్ ఉంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. పోకో సీ31 ప్రారంభ ధర రూ.8,499.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile News, POCO, POCO India, Smartphone