• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • POCO C3 LAUNCHED IN INDIA WITH MEDIATEK HELIO G35 PROCESSOR AND 5000MAH BATTERY KNOW PRICE AND SPECS SS

Poco C3: అతితక్కువ ధరకే 4GB + 64GB స్మార్ట్‌ఫోన్... పోకో సీ3 రిలీజ్

Poco C3: అతితక్కువ ధరకే 4GB + 64GB స్మార్ట్‌ఫోన్... పోకో సీ3 రిలీజ్

Poco C3: అతితక్కువ ధరకే 4GB + 64GB స్మార్ట్‌ఫోన్... పోకో సీ3 రిలీజ్ (image: Poco India)

Poco C3 | రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి మార్కెట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు పోకో సీ3 స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే బడ్జెట్‌లో రానుంది.

  • Share this:
    షావోమీ సబ్‌ బ్రాండ్ అయిన పోకో ఇండియా భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి పోకో సీ3 మోడల్‌ను రిలీజ్ చేసింది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.8,999 ధరకే కొనొచ్చు. 3జీబీ+32జీబీ వేరియంట్‌లో కూడా ఈ ఫోన్ రిలీజైంది. ట్రిపుల్ రియర్ కెమెరా, హెచ్‌డీ+ డిస్‌ప్లే, 5000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఏడాది జూన్‌లో మలేషియా మార్కెట్‌లో రెడ్‌మీ 9సీ పేరుతో రిలీజైంది. అదే స్మార్ట్‌ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పోకో సీ3 పేరుతో ఇండియాలో రిలీజ్ చేసింది కంపెనీ. ప్రారంభ ధర రూ.7,499. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 సందర్భంగా అక్టోబర్ 16న పోకో సీ3 సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే పోకో సీ3 స్మార్ట్‌ఫోన్‌కు ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తే ఫోన్ ఇంకా తక్కువ ధరకే కొనొచ్చు. ప్రస్తుతం ప్రకటించిన ధరలు ఇంట్రడక్టరీ ఆఫర్ అని చెబుతోంది పోకో ఇండియా. అంటే ఈ ధరలు త్వరలో పెరిగే అవకాశముంది. రాబోయేది దసరా, దీపావళి పండుగ సీజన్ కావడంతో సేల్స్ ఉంటాయి. ఈ సేల్ తర్వాత ధర పెరగొచ్చు.

    Flipkart Big Billion Days: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.30,000 వరకు డిస్కౌంట్... ఫోన్ ధరలో 70 శాతం చెల్లిస్తే చాలు

    Mi 10T: ఇండియాలో ఎంఐ 10టీ స్మార్ట్‌ఫోన్ల రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే


    పోకో సీ3 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.53 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే
    ర్యామ్: 3జీబీ, 4జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35
    రియర్ కెమెరా: 13+2+2 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ + ఎస్‌డీ కార్డ్ సపోర్ట్
    కలర్స్: ఆర్కిటిక్ బ్లూ, లైమ్ గ్రీన్, మ్యాటీ బ్లాక్
    ధర:
    3జీబీ+32జీబీ- రూ.7,499
    4జీబీ+64జీబీ- రూ.8,999

    Flipkart Sale: రూ.70,000 స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లో రూ.20,000 మాత్రమే... ఇలాంటి బంపరాఫర్ మళ్లీ రాకపోవచ్చు

    Flipkart Big Billion Days: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

    ఇక ఇటీవల పోకో ఇండియా పోకో ఎక్స్3 మోడల్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీటితో పాటు పోకో ఎం2, పోకో ఎం2 ప్రో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పోకో ఎం2 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.2,000 డిస్కౌంట్ ప్రకటించారు.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు