దిగ్గజ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు పోకో (Poco) భారతదేశం (India)లో సరికొత్త బడ్జెట్ ఫోన్స్ లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ కంపెనీ మరో రెండు సరికొత్త మొబైల్స్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పోకో ఎం5 (Poco M5), పోకో ఎం5ఎస్ (Poco M5s) మోడళ్లను సెప్టెంబర్ 5న సాయంత్రం 5:30 గంటలకు గ్లోబల్ రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ అప్‌కమింగ్ ఫోన్స్‌లో పోకో ఎం5 ఇండియన్ కొనుగోలుదారుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.
పోకో ఇండియా అధికారిక హ్యాండిల్ Poco M5 టీజర్‌ను షేర్ చేసింది. కానీ పోకో M5s గురించి మాత్రం ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. దాంతో పోకో M5s దేశంలో లాంచ్ కావడం లేదని తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి Poco M5 ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయింది కాబట్టి దాని ఫీచర్లు, ధర వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోకో సంస్థ ఈ రెండు అప్‌కమింగ్ మొబైల్స్‌ను సెప్టెంబర్ 5న ఆన్లైన్ లాంచ్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్ లైవ్‌ను పోకో ఇండియా యూట్యూబ్ (Poco India Youtube) ఛానెల్లో వీక్షించవచ్చు. కంపెనీ ఇటీవల ట్విట్టర్లో పోకో ఎం5 స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను టీజ్ చేస్తూ "G99" అనే పదాన్ని వాడింది.
దీన్నిబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G99 ప్రాసెసర్ సాయంతో పని చేయవచ్చని తెలుస్తోంది. Poco M5 లాంచ్ డేట్‌ని అఫీషియల్ కంపెనీ ప్రకటించింది కానీ దాని ఫీచర్లు, ధరను మాత్రం ఇప్పటివరకైతే వెల్లడించలేదు. సెప్టెంబర్ 5న లాంచ్ ఈవెంట్లో ఈ వివరాలన్నీ తెలిపే అవకాశం ఉంది. అంతకంటే ముందు Poco M5 ఇండియన్ వెర్షన్ ధర, స్పెసిఫికేషన్లను కొన్ని టెక్ రిపోర్ట్స్ లీక్ చేశాయి. వాటిపై ఇప్పుడో లుక్కేద్దాం.
* పోకో ఎం5 ఎక్స్పెక్టెడ్ ప్రైస్
లేటెస్ట్ నివేదిక ప్రకారం, ఇండియాలో Poco M5 స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్ ధర రూ.15,000 లోపు ఉండవచ్చు. ఈ మొబైల్ 4GB RAM+64GB... 4GB+128GB.. 6GB RAM+128GB అనే మూడు స్టోరేజ్ వేరియంట్లలో రావచ్చని అంచనా.
* పోకో ఎం5 ఎక్స్పెక్టెడ్ ఫీచర్లు
నివేదికల ప్రకారం, Poco M5 ఒక 4G మొబైల్ అని తెలుస్తోంది. అయితే కంపెనీ 5G సపోర్ట్‌తో Poco M5 వేరియంట్‌ను భవిష్యత్తులో విడుదల చేసే అవకాశం లేకపోలేదు. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12తో వస్తుందని టాక్. ఇందులోని 6.58-అంగుళాల LCD డిస్ప్లే ఫుల్ HD+ క్వాలిటీతో వీడియోలు ప్లే చేస్తుంది.
మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులోని హైలెట్ ఫీచర్లు అని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ చిక్-లెదర్ అని తెలుస్తోంది. ఈ కొత్త ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5 కనెక్టివిటీ అందించినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobiles, POCO, POCO India, Smart phones, Tech news