హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Akash Ambani: 5G సేవలపై ప్రధాని మోదీకి ఆకాష్ అంబానీ డెమో.. విశేషాలివే!

Akash Ambani: 5G సేవలపై ప్రధాని మోదీకి ఆకాష్ అంబానీ డెమో.. విశేషాలివే!

5G సేవలపై ప్రధాని మోదీకి ఆకాష్ అంబానీ డెమో.. విశేషాలివే!

5G సేవలపై ప్రధాని మోదీకి ఆకాష్ అంబానీ డెమో.. విశేషాలివే!

రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) మరియు రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ (Akash Ambani) 5G సేవల డెమోను ప్రధానికి అందించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Delhi | Mumbai

  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈరోజు దేశంలో 5జీ సేవలను ప్రారంభింభించిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని 13 నగరాల్లో నేటి నుంచి 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 5G సేవను (5G Services) ప్రారంభించే ముందు, PM మోడీ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) 6వ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) మరియు రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ (Akash Ambani) 5G సేవల డెమోను ప్రధానికి అందించారు. రిలయన్స్ జియో మహారాష్ట్ర, గుజరాత్ మరియు ఒడిశాలోని మూడు వేర్వేరు ప్రాంతాల విద్యార్థులతో ముంబై స్కూల్ టీచర్‌ను కనెక్ట్ చేశారు. 5G ఉపాధ్యాయులను విద్యార్థులకు ఎలా దగ్గర చేస్తుందో వివరించారు. 5G వారి మధ్య భౌతిక దూరాన్ని తొలగిస్తుందని మరియు దీని ద్వారా విద్యా రంగాన్ని మెరుగుపరచవచ్చని డెమో ద్వారా ప్రదర్శించారు.

  ఇదిలా ఉంటే.. డిసెంబర్ 2023 నాటికి దేశంలోని ప్రతీ టౌన్, తాలూక, తహసిల్ లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ప్రకటించారు. అత్యధిక క్వాలిటీ, తక్కువ ధరకే వర్ల్డ్ క్లాస్ 5జీ సేవలు (5G Services) అందిస్తామన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ భారతదేశంలో 5G ఇంటర్నెట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయాన మాట్లాడుతూ.. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఇప్పుడు ఆసియా మొబైల్ కాంగ్రెస్, గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్‌గా మారాలని ఆకాంక్షించారు.

  5G Revolution: 5Gతో వ్యవసాయ రంగంలో విప్లవం.. టెక్నాలజీతో అన్నదాతకు మేలు.. ఎలా అంటే?

  ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 6వ ఎడిషన్‌ను నిర్వహించినందుకు టెలికాం మంత్రిత్వ శాఖ మరియు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 5జీ సేవ‌ల‌ను ప్రారంభించ‌డం ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌న్నారు. టెలికాం రంగంలో నాయ‌క‌త్వ పాత్ర‌ను పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ వెల్లడించారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: 5G, 5g technology, Akash Ambani, Mukesh Ambani, Narendra modi