App Innovation Challenge | మోదీ మేడిన్ ఇండియా యాప్స్ ఛాలెంజ్..

ఇటీవల 59 చైనా యాప్స్ బ్యాన్ చేసిన భారత్.. ఇప్పుడు మేడిన్ ఇండియా యాప్స్ రూపకల్పనకు సిద్ధమైంది.

news18-telugu
Updated: July 4, 2020, 6:04 PM IST
App Innovation Challenge | మోదీ మేడిన్ ఇండియా యాప్స్ ఛాలెంజ్..
App Innovation challenge
  • Share this:
మీలో కొత్త కొత్త ఐడియాలు ఉన్నాయా? వరల్డ్ క్లాస్ మేడిన్ ఇండియా యాప్స్ తయారు చేసే సత్తా ఉందా? అయితే, మీకో అవకాశం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. డిజిటల్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా మేడిన్ ఇండియా వరల్డ్ క్లాస్ యాప్స్ తయారు చేయగల ఔత్సాహికుల కోసం ఓ పోటీ నిర్వహిస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ, అటల్ ఇన్నొవేషన్ మిషన్ సంయుక్తంగా ఈ యాప్ ఇన్నొవేషన్ చాలెంజ్ నిర్వహించనున్నాయి. ఇందులో గెలిచిన వారికి బహుమతులతోపాటు పేరు ప్రఖ్యాతులు కూడా దక్కనున్నాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. ‘ప్రస్తుతం యాప్స్ తయారు చేసే ఔత్సాహికులు చాలా మంది ఉన్నారు. టెక్, స్టార్టప్స్‌లో వరల్డ్ క్లాస్ మేడిన్ ఇండియా యాప్స్ తయారు చేయగల సత్తా ఉంది. వారి ఐడియాలు, ఉత్పత్తులకు ప్రోతాహం కల్పించేందుకు ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నొవేషన్ ఛాలెంజ్ నిర్వహిస్తోంది.’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. యాప్స్ విభాగంలో మీకు అనుభవం, టాలెంట్, ఆసక్తి,, కొత్త కొత్త ఐడియాలు సృష్టించగల ఉత్సాహం, ప్లాన్ ఉన్నవారు ఇందులో పాల్గొనవచ్చని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.



భారత్‌లో వైబ్రంట్, స్టార్టప్ ఎకో సిస్టమ్ ఉందని, అది ఇండియాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘మన యువత ఎన్నో రంగాల్లో ప్రతిభ చూపుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశం ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తోంది. ఇలాంటి సమయంలో ఇదో మంచి అవకాశం. కొత్త యాప్స్, ఐడియాలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా మారుతుంది.’ అని ప్రధాని మోదీ అన్నారు.


ఒక బృందం ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్న మంచి సోషల్ మీడియా యాప్స్, ఈ లెర్నింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, గేమింగ్, బిజినెస్, వినోదం, ఆఫీస్ పనులకు వినియోగించే యాప్స్‌ ఉంటే వాటికి ప్రభుత్వం మెంటార్‌గా ఉంటూ సహకారం అందిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం నెల రోజుల్లో పూర్తి కానుంది. మరో బృందం కొత్త కొత్త యాప్స్ రూపొందించేందుకు సహకారం అందిస్తుంది.

ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నొవేషన్ ఛాలెంజ్ మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇటీవల 59 చైనీస్ యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది. అందులో టిక్ టాక్, హెలో, యూసీ బ్రౌజర్, కామ్ స్కానర్ వంటివి కూడా ఉన్నాయి. భారత సమాచారం ఈ యాప్స్ ద్వారా చైనాకు చేరుతుందనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల తర్వాత ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని డిజిటల్ స్ట్రైక్ గా అభివర్ణించారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. వీటిపై బ్యాన్ ఎత్తివేస్తారా? అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో మేడిన్ ఇండియా యాప్స్ కోసం కేంద్రం ముందుకు వచ్చింది.

 
Published by: Ashok Kumar Bonepalli
First published: July 4, 2020, 6:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading