ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ స్కీమ్‌కు (PM Kisan Scheme) సంబంధించిన 11వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేశారు. షిమ్లాలో జరిగిన గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేశారు. 10 కోట్లకు పైగా రైతుల అకౌంట్లలోకి రూ.21,000 కోట్లు జమ చేశారు. రైతులు తమకు డబ్బులు వచ్చాయో లేదో పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ లో చెక్ చేయొచ్చు. ఎలాగో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. కానీ... ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసేవారు ఎక్కువగా ఉండటంతో కొన్ని సార్లు పీఎం కిసాన్ వెబ్‌సైట్ ఓపెన్ కావట్లేదు. వెబ్‌సైట్ ఓపెన్ కాకపోయినా రైతులు తమకు డబ్బులు వచ్చాయో లేదో చెక్ చేయడానికి మరో మార్గం ఉంది.
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్ కూడా ఉంది. రైతులు ఈ యాప్‌లో కూడా తమకు డబ్బులు వచ్చాయో లేదో సులువుగా తెలుసుకోవచ్చు. మరి పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో డబ్బులు ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్... జూన్‌లో బ్యాంకులు ఈ రోజుల్లో తెరుచుకోవు
Step 1- పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో లబ్ధిదారుల జాబితా చెక్ చేయడానికి ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి PMKISAN GoI డౌన్‌లోడ్ చేయాలి.
Step 2- National Informatics Centre రూపొందించిన యాప్ మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలి.
Step 3- యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో Beneficiary Status పైన క్లిక్ చేయాలి.
Step 4- ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆప్షన్స్‌లో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి.
Step 5- ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత Get Data పైన క్లిక్ చేయాలి.
Step 6- రైతుల అకౌంట్‌లో డబ్బులు జమ అయ్యాయో లేదో స్టేటస్ తెలుస్తుంది.
New Rules: సామాన్యుల జేబులకు చిల్లు... రేపటి నుంచి అమలులోకి వచ్చే 7 కొత్త రూల్స్ ఇవే
PMKISAN GoI యాప్ విషయానికి వస్తే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్-NIC ఈ యాప్‌ను తయారు చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. పీఎం కిసాన్ లబ్ధిదారులు 10 కోట్లకు పైనే ఉన్నా ఈ యాప్ డౌన్‌లోడ్స్ కేవలం 50 లక్షలకు పైనే ఉంది. ఈ యాప్‌లో లబ్ధిదారుల జాబితా కూడా సెర్చ్ చేయొచ్చు. దీంతో పాటు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవచ్చు. రైతులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరును సరిచేసుకోవాలన్నా ఈ యాప్‌లో సాధ్యమే. పీఎం కిసాన్ స్కీమ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi, PM KISAN, Pm kisan application, PM Kisan Scheme, Pm modi, Pradhan Mantri Kisan Samman Nidhi