ప్రధాన మంత్రి కిసాన్ సమ్మానా నిధి యోజన స్కీమ్‌లో ఉన్న రైతులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 9.5 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్లు పీఎం కిసాన్ డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేసిన సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ పథకంలో ఎనిమిదో ఇన్‌స్టాల్‌మెంట్ ఇది. https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో లబ్దిదారుల జాబితా చెక్ చేసుకోవచ్చన్న సంగతి అందరికీ తెలిసిందే. లబ్ధిదారుల లిస్ట్ చెక్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ వెబ్‌సైట్‌తో పాటు ఇకపై రైతులు మొబైల్ యాప్ ద్వారా కూడా లబ్ధిదారుల జాబితా చెక్ చేయొచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మొబైల్ యాప్ రూపొందించింది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్-NIC పీఎం కిసాన్ మొబైల్ యాప్‌ను తయారు చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లో పీఎం కిసాన్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ సైజ్ 20ఎంబీ ఉంటుంది. ఇప్పటికే 50 లక్షలకు పైగా డౌన్‌లోడ్స్ చేయడం విశేషం. రైతులు ఈ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇదే యాప్‌లో లబ్ధిదారుల జాబితా కూడా సెర్చ్ చేయొచ్చు.
Motorola Rugged Mobile: ఈ స్మార్ట్‌ఫోన్‌ను నీళ్లల్లో నానబెట్టి, సబ్బుతో కడిగేయొచ్చు
Bank Account: ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? జూలై 1 నుంచి కొత్త రూల్స్
All the farmer beneficiaries under #PMKISAN scheme can now check their status digitally through the PM-KISAN mobile app too. The scheme released over 20,000 crore to over 9.5 crore farmers through its 8th installment.
To know more, visit https://t.co/MyKWUEmbvm pic.twitter.com/0HivkMaYse
— Digital India (@_DigitalIndia) June 20, 2021
పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో పీఎం కిసాన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ఈ యాప్‌లోనే రైతులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. తమ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన స్టేటస్ తెలుసుకోవచ్చు. తమకు రావాల్సిన పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్స్ వివరాలు కూడా ఉంటాయి. ఇక ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరును సరిచేసుకోవాలన్నా యాప్ ద్వారా సాధ్యం అవుతుంది. పీఎం కిసాన్ స్కీమ్‌కు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు.
ATM Withdrawal Rules: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ 4 రూల్స్ గుర్తుంచుకోండి
SBI New Charges: జూలై 1 నుంచి ఎస్‌బీఐ కస్టమర్లకు కొత్త ఛార్జీలు
ప్రస్తుతం పీఎం కిసాన్ స్కీమ్‌కు సంబంధించి 8వ ఇన్‌స్టాల్‌మెంట్ రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు పీఎం కిసాన్ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.6,000 మూడు వాయిదాల్లో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. అంటే ప్రతీ నాలుగు నెలలకు ఓసారి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmer, PM KISAN, Pm kisan application, PM Kisan Maan Dhan Yojana, PM Kisan Scheme, Pradhan Mantri Kisan Maandhan Yojana, Pradhan Mantri Kisan Samman Nidhi