PlayGo Dura: ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ గాడ్జెట్స్‌కు డిమాండ్ కనిపిస్తోంది. స్మార్ట్‌వాచెస్ ఎక్కువగా సేల్ అవుతున్న దేశంగా ఇండియా నిలిచింది. అదే విధంగా వివిధ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా స్మార్ట్ గాడ్జెట్స్ తయారీ సంస్థ ప్లే ఇండియన్ మార్కెట్లోకి ప్లేగో(PlayGo) సిరీస్‌లో PlayGo Dura పేరుతో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ తీసుకొచ్చింది. ఈ ఇయర్‌బడ్స్ 10 గంటలు ఛార్జ్ చేస్తే 30 గంటల ప్లేటైమ్ అందిస్తాయి. యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ సపోర్ట్, టచ్ కంట్రోల్ వంటి ఫీచర్స్‌తో వస్తున్నాయి. ఈ ప్రొడక్ట్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
* PlayGo Dura టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్స్
PlayGo Dura TWS ఇయర్‌బడ్స్ కంపెనీకి చెందిన ఎన్హాన్స్డ్ బాస్ ఎక్స్ట్రా లౌడ్(EBEL) డ్రైవర్స్‌తో వస్తాయి. దీంతో ఇవి HD సౌండ్ క్వాలిటీని అందిస్తాయని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా ఈ ఇయర్‌బడ్స్ క్వాలిటీ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్(ENC) టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయి.
ప్లేగో డురా ఇయర్ బడ్స్ కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. ఐదు గంటల ప్లేటైమ్‌ను అందిస్తాయి. కనెక్టివిటీ కోసం.. ఈ TWS ఇయర్‌బడ్స్ USB టైప్-C ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. అంతే కాకుండా నేచురల్ టచ్ కంట్రోల్స్ కూడా PlayGo Dura టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌లో ఉంటాయి. ప్లేగో డురా ఇయర్ బడ్స్ ఇండియన్ మార్కెట్లోకి రూ.1499 స్టార్టింగ్ ప్రైస్‌తో లాంచ్ అయ్యాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సైట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. బ్ల్యాక్, వైట్ కలర్ ఆప్షన్లో లభిస్తున్నాయి.
* ఈ ఏడాది ప్రారంభంలో మూడు ప్రొడక్ట్స్
ప్లే కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో మూడు కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వైర్లెస్ స్పీకర్ ‘ప్లేగో ముజా’, TWS ఇయర్ బడ్స్ ‘ప్లేగో బడ్స్లైట్’, వైర్లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ ‘ప్లేగో ఫ్లాంట్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
* నెలాఖరులో అందుబాటులోకి ఎవాల్వ్ 2
మరోపక్క జాబ్రా కంపెనీ కూడా ఇటీవల ఎవాల్వ్ 2 పేరుతో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ డివైజ్‌ను హైబ్రిడ్ అండ్ రిమోట్ వర్కింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. Evolve సిరీస్‌లో ఈ ఇయర్ బడ్స్ లెటెస్ట్ ఎడిషన్. జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్రముఖ వర్చువల్ మీటింగ్ ప్లాట్‌ఫారమ్స్ కోసం ఎవాల్వ్ 2 ఇయర్‌బడ్స్ సర్టిఫైడ్ అయ్యాయని కంపెనీ పేర్కొంది. అంతరాయం కలిగించే బ్యాక్ గ్రౌండ్ నాయిస్ తగ్గించడానికి, స్పష్టమైన కాల్‌లను ఎనేబుల్ చేయడానికి ఈ డివైజ్‌లో లెటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది క్లాసిక్ బ్లాక్ కలర్లో లభించనుంది. Jabra Evolve 2 ఇయర్‌బడ్స్ ధర రూ.39,122గా కంపెనీ నిర్ణయించింది. ఈ TWS ఇయర్‌బడ్స్ ఈ నెల చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earbuds, Technology