హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JioFiber: గుడ్ న్యూస్... జియోఫైబర్ ప్లాన్స్‌పై 30 రోజులు అదనంగా వేలిడిటీ

JioFiber: గుడ్ న్యూస్... జియోఫైబర్ ప్లాన్స్‌పై 30 రోజులు అదనంగా వేలిడిటీ

JioFiber: గుడ్ న్యూస్... జియోఫైబర్ ప్లాన్స్‌పై 30 రోజులు అదనంగా వేలిడిటీ
(ప్రతీకాత్మక చిత్రం)

JioFiber: గుడ్ న్యూస్... జియోఫైబర్ ప్లాన్స్‌పై 30 రోజులు అదనంగా వేలిడిటీ (ప్రతీకాత్మక చిత్రం)

JioFiber | జియోఫైబర్ లాంగ్‌టర్మ్ ప్లాన్స్‌పై 30 రోజులు అదనంగా వేలిడిటీ అందిస్తోంది. ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోండి.

  ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌పై అదనంగా 30 రోజుల వేలిడిటీ అందిస్తోంది. లాంగ్ టర్మ్ ప్లాన్స్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. లాంగ్ టర్మ్ ప్లాన్ తీసుకున్నవారు అదనంగా నెల రోజుల వేలిడిటీ పొందొచ్చు. రిలయెన్స్ జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ వేర్వేరుగా ఉన్నాయి. మంత్లీ, క్వార్టర్లీ, సెమీ-యాన్యువల్, యాన్యువల్ ప్లాన్స్‌ని అందిస్తోంది జియోఫైబర్. వీటిలో యాన్యువల్ ప్లాన్స్ తీసుకుంటే 30 రోజుల వేలిడిటీ అదనంగా పొందొచ్చు. అంటే 12 నెలలకు ప్లాన్ తీసుకుంటే అదనంగా మరో నెలరోజుల వేలిడిటీ వస్తుంది. అంటే 12 నెలలకు డబ్బులు చెల్లించి 13 నెలలపాటు జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఉపయోగించుకోవచ్చు. ఇక జియోఫైబర్ నుంచి ఫ్రీ ట్రయల్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరి ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి.

  JioFiber Rs 4,788 Annual Plan: జియోఫైబర్ రూ.4,788 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 30ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.

  Poco X3 Pro: రేపే పోకో ఎక్స్3 ప్రో సేల్... డిస్కౌంట్‌తో కొనండి ఇలా

  Budget Smartphones: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

  JioFiber Rs 8,388 Annual Plan: జియోఫైబర్ రూ.8,388 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.

  JioFiber Rs 11,988 Annual Plan: జియోఫైబర్ రూ.11,988 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్‌ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.

  JioFiber Rs 17,988 Annual Plan: జియోఫైబర్ రూ.17,988 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 300ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్‌ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.

  Jio Cricket plans: ఐపీఎల్ స్పెషల్... జియో అందిస్తున్న క్రికెట్ ప్లాన్స్ ఇవే

  Poco X3 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.10,999 ధరకే సొంతం చేసుకోండి... ఈ ఆఫర్ వారికి మాత్రమే

  JioFiber Rs 29,988 Annual Plan: జియోఫైబర్ రూ.29,988 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 500ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్‌ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.

  JioFiber Rs 47,988 Annual Plan: జియోఫైబర్ రూ.47,988 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 1జీబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్‌ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.

  JioFiber Rs 1,01,988 Annual Plan: జియోఫైబర్ రూ.1,01,988 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 1జీబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 6600జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్‌ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం.


  జియోఫైబర్‌లో 6 నెలలు అంటే 180 రోజుల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్స్ ఎంచుకుంటే 15 రోజులు అదనంగా వేలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.jio.com/fiber వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Internet, Jio, JioFiber, Reliance Jio

  ఉత్తమ కథలు