Home /News /technology /

PLANNING TO BUY A LAPTOP WITH LATEST WINDOWS 11 OS CHECK HERE FOR LIST OF COMPATIBLE LAPTOPS SS GH

Windows 11 Laptop: విండోస్ 11 ల్యాప్‌టాప్ కావాలా? ఈ మోడల్స్ సెలెక్ట్ చేసుకోండి

Windows 11 Laptop: విండోస్ 11 ల్యాప్‌టాప్ కావాలా? ఈ మోడల్స్ సెలెక్ట్ చేసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Windows 11 Laptop: విండోస్ 11 ల్యాప్‌టాప్ కావాలా? ఈ మోడల్స్ సెలెక్ట్ చేసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Windows 11 Laptop | విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ కొనాలనుకుంటున్నారా? మరి ఏది సెలెక్ట్ చేయాలో తెలుసుకోండి.

విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను మైక్రోసాఫ్ట్ పరిచయం చేసిన సంగతి తేలిసిందే. ప్రతిసారి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ విడుదలైనప్పుడు వచ్చినట్లే ఈ ఓఎస్ ఏయే ల్యాప్ టాప్స్ లో పనిచేస్తుంది.. అందులో ఏఏ ఇబ్బందులుంటాయి అన్న చర్చ ప్రారంభమైపోయింది. అందుకే ల్యాప్ టాప్స్, డెస్క్ టాప్స్ తయారీ సంస్థలైన హెచ్ పీ, ఏసుస్, డెల్ లాంటి సంస్థలు తమ మోడల్స్ లో ఏవి విండోస్ 11 కి అప్ గ్రేడ్ అయినా పనిచేస్తాయో.. ఏవి పనికిరావో వెల్లడించాయి. ప్రస్తుతం తాము తయారుచేసి అమ్ముతోన్న ల్యాప్ టాప్స్ లో చాలా వరకు విండోస్ 11 కి అనుగుణంగానే ఉన్నాయని హెచ్ పీ, డెల్ సంస్థలు వెల్లడించాయి. ఏసుస్ తమ ల్యాప్ టాప్స్ లో విండోస్ 11కి అనుగుణంగా ఉన్న మోడల్స్ వివరాలను ప్రకటించింది.

ఏసుస్ ల్యాప్ టాప్స్ లో విండోస్ 11 అప్ డేట్ పొందే వాటి వివరాలు


ఏసుస్ ప్రో ఆర్ట్ స్టుడియో బుక్ వన్, ద ప్రొ ఆర్ట్ స్టూడియో బుక్ ప్రో ఎక్స్, ప్రో ఆర్ట్ స్టూడియో బుక్ ప్రో 15, ప్రో ఆర్ట్ స్టూడియో బుక్ ప్రో 17, ఏసుస్ జెన్ బుక్ ప్రో డ్యుయో 15 OLED, జెన్ బుక్ ప్రో డ్యుయో, జెన్ బుక్ ప్రో 14, జెన్ బుక్ ప్రో 15, జెన్ బుక్ 3 డీలక్స్, జెన్ బుక్ ఎస్, జెన్ బుక్ ఎస్ 13, జెన్ బుక్ ఫ్లిప్ ఎస్, జెన్ బుక్ ఫ్లిప్ 13, జెన్ బుక్ ఫ్లిప్ 14, జెన్ బుక్ ఫ్లిప్ 15, జెన్ బుక్ ఫ్లిప్ 15 OLED, జెన్ బుక్ UX310, జెన్ బుక్ UX311, జెన్ బుక్ 13 OLED, జెన్ బుక్13, జెన్ బుక్ UX410, జెన్ బుక్ 14, జెన్ బుక్ 14 అల్ట్రా లైట్, జెన్ బుక్ డ్యుయో, జెన్ బుక్ డ్యుయో 14, జెన్ బుక్ 15, వివో బుక్ ప్రో 15, వివో బుక్ ఎస్ 13, వివో బుక్ ఎస్ 14, వివో బుక్ ఎస్ 15, వివో బుక్ ఫ్లిప్ 12, వివో బుక్ ఫ్లిప్ 14, వివో బుక్ ఫ్లిప్ 15, వివో బుక్ 14, ఏసుస్ వివో బుక్ 15.

Jio New Plan: జియో నుంచి కొత్త ప్లాన్... రోజూ 3జీబీ డేటా

Samsung Galaxy M32: కాసేపట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సాంసంగ్ గెలాక్సీ ఎం32 సేల్

హెచ్ పీ సంస్థ ప్రస్తుతం షిప్పింగ్ లో ఉన్న తమ ప్రతి మోడల్ విండోస్ 11 కి అనుగుణంగానే ఉంటుందని.. తమ ప్రతి పీసీ, ల్యాప్ టాప్, వర్క్ స్టేషన్ లలో వాటిని పొందవచ్చని చెప్పింది. అంతే కాదు.. ఇకపై తాము పంపే ప్రతి వస్తువుపై విండోస్ 11 కంపాటబిలిటీ గురించి బ్యాడ్జ్ ముద్రించి పంపుతామని కూడా వెల్లడించింది. హెచ్ పీ సెక్టార్, హెచ్ పీ ఎన్వీ, హెచ్ పీ పెవిలియన్ ల్యాప్ టాప్ ల రకాలన్నింటిలోనూ ఈ కొత్త ఓఎస్ పొందవచ్చట. వీటితో పాటు హెచ్ పీ ఒమెన్, హెచ్ పీ విక్టస్ రేంజ్ కూడా విండోస్ 11 కంపాటబుల్ అని ప్రకటించింది ఆ సంస్థ. హెచ్ పీ ఎలైట్, హెచ్ పీ ప్రొ పోర్ట్ ఫోలియోస్, హెచ్ పీ ఎలైట్ డ్రాగన్ ఫ్లై జీ2 రకాలు కూడా విండోస్ 11 అప్ డేట్ ని పొందుతాయట.

ఇక డెల్ విషయానికొస్తే ఈ సంస్థ కూడా ఏయే రకాల ల్యాప్ టాప్, పీసీలు విండోస్ 11 కి కంపాటబుల్ గా ఉంటాయన్న విషయాన్ని ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన ల్యాప్ టాప్ లు అన్నీ విండోస్ 11 ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ల్యాప్ టాప్ లు కొనాలనుకునే వ్యక్తులు డెల్ స్టోర్ల నుంచి వాటిని తప్పక కొనవచ్చు. డెల్. కామ్ లో ఉన్న అన్ని రకాల ల్యాప్ టాప్ లు విండోస్ 11 సిస్టమ్ కి కావాల్సిన అర్హతలతోనే విడుదలయ్యాయి. అప్ గ్రేడ్ చేసుకోవడానికి అవి సిద్ధంగా ఉంటాయి అని వెల్లడించింది ఈ సంస్థ.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Laptop, Windows 11, Work From Home

తదుపరి వార్తలు