Pixel Phones: పిక్సెల్‌ ఫోన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. ఆ మోడల్ పిక్సెల్ ఫోన్స్ ఇప్పట్లో భారత్‌కు రానట్లే..

గూగుల్ పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్

గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న.. అత్యాధునిక టెన్సర్‌ చిప్‌సెట్‌తో కూడిన Pixel 6 సిరీస్‌ ఫోన్లను గూగుల్‌ తాజాగా ఆవిష్కరించింది. సరికొత్త ఫీచర్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యంతో కూడిన గూగుల్‌ పిక్సెల్‌ 6, పిక్సెల్‌ 6 ఫోన్లను బెస్ట్‌ కెమెరా స్మార్ట్‌ ఫోన్‌లుగా భావిస్తున్నారు.

  • Share this:
గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న.. అత్యాధునిక టెన్సర్‌ చిప్‌సెట్‌తో కూడిన Pixel 6 సిరీస్‌ ఫోన్లను గూగుల్‌ తాజాగా ఆవిష్కరించింది. సరికొత్త ఫీచర్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యంతో కూడిన గూగుల్‌ పిక్సెల్‌ 6, పిక్సెల్‌ 6 ఫోన్లను బెస్ట్‌ కెమెరా స్మార్ట్‌ ఫోన్‌లుగా భావిస్తున్నారు. ఇంత వరకు ఇలాంటి డివైజ్‌ మార్కెట్లోకి రాలేదని గూగుల్‌ అంటోంది. ఈ విషయం విని చాలా పొంది ఉత్సాహపడి ఉంటారు.

కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. పిక్సెల్‌ 6, పిక్సెల్‌ 6 ప్రో ఇప్పట్లో భారత్‌కు రావడం లేదు. పిక్సెల్‌ సిరీస్‌ను ప్రారంభంలో కేవలం 8 ప్రాంతాల్లో మాత్రమే విడుదల చేస్తున్నామని గూగుల్‌ గతంలోనే ప్రకటించింది. ఆ జాబితాలో భారత్‌ లేదు. అక్టోబర్‌ 28న ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్‌, తైవాన్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, అమెరికాలో ఆక్టోబర్‌ 28 నుంచి పిక్సెల్‌ సిరీస్‌ అందుబాటులో ఉండనున్నాయి.

ఇది కూడా చదవండి: Realme: రియల్​మీ నుంచి కొత్తగా రెండు మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్లు లాంచ్​.. ధర, ఫీచర్ల వివరాలివే!

ఇండియా, చైనా, మిడిల్‌ ఈస్ట్, యూరోపియన్‌ దేశాల్లో ఇప్పట్లో ఈ ఫోన్ లభించదు. గత సంవత్సరం పిక్సెల్‌ 5 సిరీస్‌ను 9 దేశాల్లో గూగుల్‌ విడుదల చేసింది. తాజాగా ఇప్పుడు 8 దేశాలని చెప్పి ఐర్లాండ్‌ను జాబితా నుంచి తొలగించింది. పిక్సెల్‌ 3, పిక్సెల్‌ 4, పిక్సెల్‌ 5 ఫోన్లను కూడా గూగుల్‌ ఇండియాకు తీసుకురాలేదు. కానీ పిక్సెల్‌ సిరీస్‌ లో ఒకింత తక్కువ గ్రేడ్‌ కలిగిన ‘a’ సిరీస్‌ ఫోన్లను మాత్రమే ఇండియాలో విడుదల చేస్తూనే ఉంది.

ఫాల్‌ లాంచ్‌ ఈవెంట్‌లో భాగంగా గత రాత్రి గూగుల్‌ ఆవిష్కరించిన పిక్సెల్‌ 6, పిక్సెల్‌ 6 ప్రో ఫోన్లలో సంస్థ సొంతంగా అభివృద్ధిపరిచిన టెన్సర్‌ చిప్‌ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్‌ అనుభూతిని మరింత పెంచుతుంది. అంతే కాదు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోసం ప్రత్యేకంగా ఈ టెన్సర్‌ చిప్‌ను డిజైన్‌ చేశారు. గూగుల్‌ పిక్సెల్‌ 6 ధర అమెరికాలో $ 599 (సుమారు రూ.45,000), పిక్సెల్‌ 6 ప్రో ధర $899 (సుమారు రూ.67,500). పిక్సెల్‌ 6, పిక్సెల్‌ 6 ప్రో ఫోన్లను కొంత ఆలస్యంగానైనా ఇండియాకు గూగుల్‌ తీసుకురావచ్చు.
Published by:Sambasiva Reddy
First published: