Home /News /technology /

PIXEL 6 SERIES LAUNCH OFFICIAL GOOGLE CONFIRMS PIXEL 6 PIXEL 6 PRO EVENT ON OCTOBER 19 MK GH

Pixel 6 Series: అక్టోబర్ 19న పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో లాంచ్.. స్పెషల్‌ ఈవెంట్‌లో విడుదల చేయనున్న గూగుల్ 

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

అక్టోబర్ 19న నిర్వహించనున్న వర్చువల్ ఈవెంట్‌లో పిక్సెల్ 6 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేస్తామని గూగుల్ ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 19న రాత్రి 10:30 సమయంలో ఈ వర్చువల్ లైవ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది.

పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా చాలామంది మొబైల్ ప్రియులను ఆకట్టుకుంది గూగుల్. ఇప్పటివరకు విడుదలైన ఐదు సిరీస్‌ల పిక్సెల్ ఫోన్లు అన్నీ మంచి ప్రజాదరణ పొందాయి. ఈ క్రమంలో గూగుల్ నుంచి త్వరలోనే విడుదల కాబోతున్న పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ సొంతంగా చేసిన టెన్సర్ చిప్‌సెట్‌ను ఉపయోగించింది. ఈ సిరీస్ ఫోన్ల విడుదల ఎప్పుడెప్పుడా అని మొబైల్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వారికి తీపి కబురు అందించింది గూగుల్. అక్టోబర్ 19న నిర్వహించనున్న వర్చువల్ ఈవెంట్‌లో పిక్సెల్ 6 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేస్తామని గూగుల్ ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 19న రాత్రి 10:30 సమయంలో ఈ వర్చువల్ లైవ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది.

"అక్టోబర్ 19న మీకు సరికొత్త గూగుల్ ఫోన్‌లైన పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రోలను అధికారికంగా పరిచయం చేయబోతున్నాం. గూగుల్ తొలి కస్టమ్ మొబైల్ చిప్ అయిన టెన్సర్ చిప్‌సెట్‌తో ఈ ఫోన్లు వేగంగా, స్మార్ట్ గా పనిచేస్తూ సెక్యూర్ గా ఉంటాయి. మీ అవసరాలకు కరెక్ట్ గా సరిపోతాయి" అని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్థ లాంచ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది కానీ.. స్మార్ట్‌ఫోన్ల ఫీచర్ల గురించి కొంచెం కూడా హింట్ ఇవ్వలేదు.

నిజానికి గూగుల్ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రోలను అధికారికంగా ఆగస్టులోనే ప్రకటించింది. ఈ సందర్భంగా పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్‌లు టెన్సర్ చిప్‌సెట్‌తో వస్తాయని స్పష్టం చేసింది. ఈ చిప్‌సెట్‌ పిక్సెల్ కెమెరా, AI సామర్థ్యాలను మరింత ఆప్టిమైజ్ చేయడానికి సహాయపడుతుందని గూగుల్ తెలిపింది. ప్రస్తుతానికైతే గూగుల్ పిక్సెల్ 6కి సంబంధించి చిప్‌సెట్‌, మెటీరియల్ యు యూఐ(Material You Ui) గురించి తప్ప మరే ఇతర విషయాలు వెల్లడించలేదు. పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ప్రత్యేకతలు అధికారికంగా పూర్తిస్థాయిలో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

కొన్ని టెక్ నివేదికలు గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లకు సంబంధించిన ఫీచర్ల గురించి తెలియజేస్తున్నాయి. పిక్సెల్ 6 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 50 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ జిఎన్ 1 ప్రైమరీ కెమెరాతో వస్తుందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అలాగే 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్‌ఎక్స్ 386 అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 48-మెగాపిక్సెల్ సోనీ IMX586 4X జూమ్ టెలిఫొటో కెమెరాను ఇందులో అందించారని సమాచారం.

ఇక పిక్సెల్ 6 అదే ప్రైమరీ, అల్ట్రా-వైడ్ కెమెరాతో వస్తుంది. కానీ ఇందులో 4X జూమ్ టెలిఫొటో కెమెరా ఉండదు. పిక్సెల్ 6 ప్రోలో 12 మెగాపిక్సెల్ సోనీ IMX633 ఫ్రంట్ కెమెరా.. పిక్సెల్ 6లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. పిక్సెల్ 6 ప్రో ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్‌తో.. పిక్సెల్ 6 వనిల్లా డ్యుయల్ బ్యాక్ కెమెరా సెటప్‌తో మార్కెట్లోకి రానున్నాయని సమాచారం.
Published by:Krishna Adithya
First published:

Tags: Smartwatch

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు