Photo Lab: ప్లేస్టోర్‌ను షేక్ చేస్తున్న ఫోటో ల్యాబ్ యాప్...ఫీచర్లు ఇవే...

ఫోటో ఎడిటింగ్ యాప్ Photo Lab దేశంలో బాగా ట్రెండింగ్ గా మారింది. సామాన్య ప్రజల నుండి ప్రముఖుల వరకు ఈ యాప్ వాడుతున్నారు. అయితే ఈ యాప్ చాలా కాలంగా Android, iOS ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తోంది. కానీ ఇప్పుడే దేశంలో ఈ యాప్ బాగా ప్రాచుర్యం పొందింది.

news18-telugu
Updated: June 28, 2020, 7:10 PM IST
Photo Lab: ప్లేస్టోర్‌ను షేక్ చేస్తున్న ఫోటో ల్యాబ్ యాప్...ఫీచర్లు ఇవే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఫోటో ఎడిటింగ్ యాప్ Photo Lab దేశంలో బాగా ట్రెండింగ్ గా మారింది. సామాన్య ప్రజల నుండి ప్రముఖుల వరకు ఈ యాప్ వాడుతున్నారు. అయితే ఈ యాప్ చాలా కాలంగా Android, iOS ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తోంది. కానీ ఇప్పుడే దేశంలో ఈ యాప్ బాగా ప్రాచుర్యం పొందింది. ఫోటో ఎడిటింగ్ యాప్ Photo Lab ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ప్లేలో మరియు ఆపిల్ వినియోగదారుల కోసం యాపిల్ స్టోర్లో అందుబాటులో ఉంది. గూగుల్ ప్లేలోని సమాచారం ప్రకారం ఈ యాప్ ను లైన్‌రాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ డెవలపర్ అనే సంస్థ తయారు చేసింది. ఈ యాప్ 10 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేశారు. ఈ యాప్ 21 లక్ష   ల రివ్యూలతో 4.4 స్టార్ రేటింగ్‌ను సాధించింది.

PhotoLab అనేది ఫోటో ఎడిటింగ్ యాప్. ఈ యాప్ ఇతర ఫోటో ఎడిటింగ్ యాప్స్ మాదిరిగానే ఫిల్టర్లు, ఇతర ఎడిటింగ్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో 900 కంటే ఎక్కువ ఫిల్టర్లు ఉన్నాయి. కార్టూన్ లుక్ ఫిల్టర్ చాలా ఫేమస్ అయ్యింది. సాధారణ ఫోటోలను సైతం ఇందులో ఫిల్టర్ల సహాయంతో ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వొచ్చు.

ఈ యాప్‌ను నడుపుతున్న రెండు కంపెనీలు విక్‌మాన్ మరియు లైన్‌రాక్ ఇన్వెస్ట్‌మెంట్. వీటిని Pho.to వెబ్‌సైట్ అంటారు. ఈ రంగంలో కంపెనీకి దాదాపు 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఆండ్రాయిడ్‌లోని ఫోటో ల్యాబ్ డిసెంబర్ 2010 లో ప్రారంభించారు. అయితే ఇటీవలి డేటా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా PhotoLab గత నెలలో 4 మిలియన్ల సార్లు డౌన్‌లోడ్లను నమోదు చేసింది. అదే సమయంలో, iOS లోని ఫోటో ల్యాబ్ జూన్ 2011 న ప్రారంభించారు. ఈ యాప్ IOSలో గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 3 లక్షలకు పైగా డౌన్‌లోడ్లు నమోదు చేసింది.

కార్టూన్ లుక్ ఫోటో కోసం ఇలా చేయండి...

  • ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుండి PhotoLab డౌన్‌లోడ్ చేసుకోండి

  • దీని తరువాత PhotoLab యాప్ తెరవండి.
  • AI కార్టూన్ టాబ్ పై క్లిక్ చేయాలి.

  • తరువాత, యాప్ గ్యాలరీ తెరవడానికి పర్మిషన్ కోరుతుంది.

  • తరువాత, మీరు పోర్ట్రెయిట్ చేయాలనుకుంటున్న ఫోటో ఎంపిక చేసుకోవాలి.

  • ఆ తర్వాత ఫిల్టర్ అప్లై చేయాలి.

  • మీకు కావాల్సిన కార్టున్ లుక్ ఫోటో ప్రత్యక్షం అవుతుంది...

First published: June 28, 2020, 7:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading