Home /News /technology /

PHONES UNDER RS 40K LOOKING FOR THE BEST PHONE AT RS 40000 CHECK OUT THESE MODELS HERE GH VB

Phones Under Rs.40K: రూ.40వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ మోడళ్లను చెక్ చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియాలో ప్రీమియం ఫోన్ల సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ ప్రాసెసర్‌లతో ఇవి లాంచ్ అవుతున్నాయి. 5G కనెక్టివిటీ, హై రిఫ్రెష్ రేట్, AMOLED డిస్‌ప్లే, అద్భుతమైన కెమెరాలతో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నాయి. ప్రస్తుతం రూ.40 వేల లోపు లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ఏవో చూద్దాం.

ఇంకా చదవండి ...
ఇండియాలో ప్రీమియం ఫోన్ల సేల్స్(Premium Phones Sale) క్రమంగా పెరుగుతున్నాయి. ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ ప్రాసెసర్‌లతో ఇవి లాంచ్ అవుతున్నాయి. 5G కనెక్టివిటీ, హై రిఫ్రెష్ రేట్, AMOLED డిస్‌ప్లే, అద్భుతమైన కెమెరాలతో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నాయి. ప్రస్తుతం రూ.40 వేల లోపు లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ఏవో చూద్దాం.

iQOO 9 SE 5G
ఐక్యూ 9 SE 5G ఫోన్ క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌తో పనిచేస్తుంది. ఈ బడ్జెట్‌లో 12 GB RAM, 256 GB స్టోరేజ్‌తో టాప్ వేరియంట్‌ను పొందవచ్చు. 6.62-అంగుళాల HDR10+ కంప్లైంట్ ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్‌, 1300 నిట్స్ బ్రైట్‌నెస్ వంటివి ఈ ఫోన్ ప్రత్యేకతలు. OISతో కూడిన 48MP ప్రైమరీ రియర్ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 16MP ఫ్రంట్ కెమెరా, 4500 mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జర్, ఫన్‌టచ్ OS 12 బేస్ట్ ఆండ్రాయిడ్ 12 వంటివి అదనపు ఆకర్షణ.

Realme GT 2/ Realme GT నియో 3
రియల్‌మీ GT 2 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 6.62-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. అయితే కొత్త రియల్‌మీ GT Neo 3 మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్‌తో రన్ అవుతుంది. ఇది 6.7-అంగుళాల AMOLED స్క్రీన్‌తో వస్తుంది. రెండు స్క్రీన్‌లు HDR10+ కంప్లైంట్, 120 Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తాయి. ఈ బడ్జెట్‌లో రెండు ఫోన్‌లలో 8 GB RAM వేరియంట్‌ ఫోన్లు ఉన్నాయి. GT 2 128 GB స్టోరేజ్, GT Neo 3తో 128 GB, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లతో లభిస్తుంది. రెండు ఫోన్లలో OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ రెండు ఫోన్‌లలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది.

* OnePlus 9
ఈ ఫోన్ 8 GB RAM, 128 GB UFS 3.1 స్టోరేజ్ వేరియంట్‌ ఇప్పుడు చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్ సాయంతో పనిచేస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, HDR10+ 6.55-అంగుళాల ఫుల్ HD+ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ బాడీతో వస్తుంది. 48MP ప్రైమరీ కెమెరా, ఆటో-ఫోకస్‌తో కూడిన 50MP అల్ట్రావైడ్ కెమెరా ఈ ఫోన్ స్పెషాలిటీ. స్క్రీన్ పైభాగంలో ఉన్న చిన్న పంచ్-హోల్‌లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీని 4500 mAh బ్యాటరీ 65W పాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Zodiac Signs: బ్యాడ్‌ లక్ అంటే వీరిదే.. చేజేతులారా రిలేషన్‌ను నాశనం చేసుకునే రాశులు ఇవే..  


Motorola Edge 20 Pro
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌తో పనిచేస్తుంది. 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 6.7-అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు HDR10+ సపోర్ట్‌తో రానుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ ఫీచర్ ఉంటుంది. 108MP ప్రైమరీ కెమెరా, 5X ఆప్టికల్ జూమ్‌ను అందించే OIS 16MP అల్ట్రా-వైడ్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా దీని ప్రత్యేకతలు. 32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. దీని 4500 mAh బ్యాటరీ 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy S20 FE 5G
ఈ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల సూపర్ AMOLED HDR10+ కంప్లైంట్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్టైలిష్ హ్యాండ్‌సెట్ IP68 రేటెడ్ ఇన్‌గ్రెస్ ప్రొటెక్షన్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌తో పనిచేస్తుంది. 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌లో లభిస్తుంది. డ్యూయల్-పిక్సెల్ PDAF, OISతో కూడిన 12MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది 4500 mAh బ్యాటరీతో లభిస్తుంది. సాధారణ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: IQoo, New technology, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు