హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Phones Under Rs 20K: గెలాక్సీ M33 5G నుంచి మోటో G52 వరకు.. రూ.20 వేలలోపు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

Phones Under Rs 20K: గెలాక్సీ M33 5G నుంచి మోటో G52 వరకు.. రూ.20 వేలలోపు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Realme, Xiaomi, Samsung, Motorola, Poco వంటి బ్రాండ్‌లు రూ.20,000 లోపు కొత్త ఫోన్‌లను ఆవిష్కరించాయి. మే నెలలో రూ.20,000 లేదా అంతకంటే తక్కువ ఖర్చులో ఫోన్‌లు కొనుగోలు చేయాలనుకొంటుంటే వీటిని పరిశీలించండి.

గత కొన్ని వారాలుగా భారతదేశం(India) స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి(Smartphone Market) చాలా ఫోన్‌లు అడుగుపెట్టాయి. ఇందులో వేర్వేరు ధరలకు సంబంధించిన ఫోన్‌లు ఉన్నాయి. ప్రతి కస్టమర్‌కు(Customers) తగిన బడ్జెట్‌లో ఫోన్‌లు(Budget Phones) అందుబాటులో ఉన్నాయి. Realme, Xiaomi, Samsung, Motorola, Poco వంటి బ్రాండ్‌లు రూ.20,000 లోపు కొత్త ఫోన్‌లను ఆవిష్కరించాయి. మే నెలలో రూ.20,000 లేదా అంతకంటే తక్కువ ఖర్చులో ఫోన్‌లు కొనుగోలు చేయాలనుకొంటుంటే వీటిని పరిశీలించండి.

* Samsung Galaxy M33 5G

Samsungకు చెందిన M33 5G వెనుక భాగంలో నాలుగు కెమెరాల సెటప్‌ ఉంటుంది. ఇది మొత్తం మ్యాట్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ 6.6 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, పైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇది Exynos 1280 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, రెండు 2-మెగాపిక్సెల్ కెమెరాలను కలిగి ఉంది. Galaxy M33 5Gలో సెల్ఫీలు తీసుకొనేందుకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 6000mAh బ్యాటరీతో వస్తుంది. Samsung Galaxy M33 5G బేస్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. గ్రీన్, బ్లూ, బ్రౌన్ కలర్‌లలో లభిస్తుంది.

Vivo Discount Offer: మూడు పాపులర్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన వివో

* Motorola Moto G52

రూ.15,000ల కంటే తక్కువ ధరకు లభించే తాజా ఫోన్‌లలో Motorolaకు చెందిన Moto G52 ఒకటి. ఆండ్రాయిడ్ 12పై పని చేస్తుంది. ఇది 6.6 అంగుళాల AMOLED 90Hz డిస్‌ప్లే, Qualcomm Snapdragon 480 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 4G ఫోన్. Motorola G52 వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ మెయిన్‌ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇది 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. Motorola Moto G52 బేస్ వేరియంట్ రూ.14,499కు లభిస్తుంది. ఇది చార్‌కోల్ గ్రే, పింగాణీ వైట్ రంగులలో వస్తుంది.

* Poco M4 Pro

5Gని ఉపయోగించని, హార్డ్‌వేర్, ఫీచర్ల సాలిడ్ మిక్స్‌ని అందించే మరొక ఫోన్ Poco M4 Pro. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే, పైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఆక్టా-కోర్ MediaTek Helio G96 ప్రాసెసర్‌తో వస్తుంది. వెనుకవైపు ఉన్న కెమెరాలలో 64-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. Android 11-ఆధారిత MIUI 13పై పని చేస్తుంది. Poco M4 Proకి 5000mAh బ్యాటరీ వస్తుంది. ఇండియాలో దీని ధర రూ.14,999గా ఉంది.

* Oppo K10

Oppo ఇటీవల భారతదేశంలో K10 ఫోన్‌ను లాంచ్‌ చేసింది. Oppo K10 FullHD రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల 90Hz డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అంటే ఇది 4G ఫోన్. ఇది పాత ఆండ్రాయిడ్ 11పై రన్‌ అవుతుంది. వెనుకవైపు 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, రెండు 2-మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి, సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. Oppo K10 రివర్స్ ఛార్జింగ్ , USB PDకి సపోర్ట్‌ చేసే 5000mAh బ్యాటరీతో వస్తుంది. Oppo K10 రూ.14,990కు అందుబాటులో ఉంది. బ్లాక్‌, బ్లూ కలర్‌లలో లభిస్తుంది.

First published:

Tags: 5G Smartphone, 5g technology, Mobile phones, Samsung, Technology

ఉత్తమ కథలు