• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • PHONEPE HAS LAUNCHED A NEW WALLET AUTO TOP UP FEATURE HERE FULL DETAILS NS GH

PhonePe: ఫోన్ పే వినియోగదారులకు గుడ్ న్యూస్.. సరికొత్తగా ఆటో టాప్ అప్ ఫీచర్.. ఇలా ఉపయోగించండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ డిజిటల్ పేమెంట్​ సంస్థ​ ఫోన్‌పే కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. తాజాగా, ఫోన్​పే ‘వాలెట్ ఆటో టాప్​అప్’ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఆ ఫీచర్ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

  • Share this:
ప్రముఖ డిజిటల్ పేమెంట్​ ప్లాట్​ఫామ్​ ఫోన్‌పే కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ గూగుల్​పేకు గట్టిపోటీనిస్తోంది. తాజాగా, ఫోన్​పే ‘వాలెట్ ఆటో టాప్​అప్’ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. యూపిఐ విధానాన్ని అనుసరించి ఈ కొత్త ఫీచర్​ను రోలవుట్​ చేస్తోంది. ఈ ఫీచర్​ ద్వారా కస్టమర్లు తమ ఫోన్‌పే వాలెట్​ను సులభంగా రీఛార్జ్​ చేసుకోవచ్చు. ఫోన్​పే వాలెట్​లో అమౌంట్​ లేనట్లైతే.. ఆటోమేటిక్​గా బ్యాలెన్స్​ లోడ్​ అవుతుంది. తద్వారా, ఫోన్‌పే కస్టమర్లు ప్రతిసారీ వారి వాలెట్​ను మాన్యువల్​గా లోడ్​ చేసే ఇబ్బందులు తీరనున్నాయి. ఈ ఆటో టాప్-అప్ ఆప్షన్ కస్టమర్ల సమయాన్ని ఆదా చేస్తుంది. సుదీర్ఘమైన ప్రాసెల్​ లేకుండా సింపుల్​గా వాలెట్​ లోడ్​ చేస్తుంది. అంతేకాదు, ఇది హై ట్రాన్సాక్షన్​ సక్సెస్​ రేటు (99.99 శాతం) కలిగి ఉంటుంది. కాగా, యూపిఐ ఈ–మ్యాన్​​డేట్ సెటప్​ చేసిన తర్వాత, కస్టమర్లు తమ వాలెట్​ను లోడ్ చేయాలనుకున్న లేదా చెల్లింపులు చేయాలనుకున్న ప్రతిసారీ యూపిఐ పిన్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఓటిపి కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. వాలెట్​ బ్యాలెన్స్​ జీరోకు పడిపోయినప్పుడు ఆటోమేటిక్​గా రీఛార్జ్​ చేస్తుంది.
Father's Day 2021: ఫాదర్స్ డే రోజు మీ నాన్నకు ఏ గిఫ్ట్ ఇవ్వాలో అని ఆలోచిస్తున్నారా? అయితే.. వీటిని పరిశీలించండి

డిజిటల్​ పేమెంట్​లో ముందడుగు..
ఈ–మ్యాన్​డేట్​ యూపిఐ ఫీచర్​ డిజిటల్​ పేమెంట్ సిస్టమ్​లో చాలా పెద్ద ముందడుగు అని ఫోన్‌పే పేర్కొంది. ఇది డిజిటల్​ పేమెంట్ సిస్టమ్​ను మరింతగా ప్రోత్సహిస్తుందని, డిజిటల్​ పేమెంట్​ వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. పెద్ద సంఖ్యలో కస్టమర్లను చేరుకోగలదని తెలిపింది. అంతేకాదు, ఈ ఆటోపేమెంట్​ ఫెయిల్యూర్​ అయ్యే అవకాశాలు చాలా తక్కువ, మిగతా మాన్యువల్​ పేమెంట్లతో పోలిస్తే ఇవి 99.99 శాతం సక్సెస్​ రేటు కలిగి ఉంటాయని తెలిపింది. ఈ ఫీచర్​ను రోలవుట్​ చేయడం కూడా చాలా సులభం. ముందుగా మీ ఫోన్‌పే యాప్​ హోమ్‌పేజీలోని వాలెట్ సెక్షన్​లోకి వెళ్లండి.

దానిలో 'టాప్-అప్' ఐకాన్​పై క్లిక్​ చేయండి. అప్పుడు, మీరు వాలెట్‌కు జోడించాల్సిన మొత్తం ఎంటర్​ చేసి టాప్​టాప్​ ప్రారంభించండి. ఉదాహరణకు మీ ఆటో టాప్-అప్ వాలెట్​లో రూ .1,000 నుండి 5,000 రూపాయల వరకు లోడ్ చేయాలనుకుంటే.. మీ అమౌంట్​ను ఎంటర్​ చేసి 'టాప్-' పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ కింద ఉండే ఆటో టాప్-అప్ వాలెట్ ఆప్షన్​ను అప్ & సెట్ చేయాలి. యుపిఐ పిన్ ఎంటర్ చేసి.. మీ బ్యాంక్ అకౌంట్​ను ధృవీకరించాలి.ఆ తరువాత, మీ ఫోన్‌పే వాలెట్ వెంటనే రీఛార్జ్ అవుతుంది. ఈ అమౌంట్​ను మీ మొబైల్​ రీఛార్జ్​, కరెంట్​ బిల్​, డిష్​ రీచార్జ్​, ఇన్సూరెన్స్​ రెన్యువల్​ వంటి​ ఇతర చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published: