Home /News /technology /

PHILIPS PH1 ANNOUNCED SMARTPHONE WITH UNISOC CHIPSET AND 4700 MAH BATTERY PRICE STARTS FROM 6000 RUPEES ONLY NS GH

Philips PH1: ఫిలిప్స్​ పీహెచ్1 స్మార్ట్​ఫోన్​ లాంఛ్​.. రూ. 6 వేల ధరలోనే అదిరిపోయే ఫీచర్లు.. వివరాలివే

ఫిలిప్స్​ పీహెచ్1 స్మార్ట్​ఫోన్​ లాంఛ్​.. కేవలం రూ. 6 వేల ధరలోనే అదిరిపోయే ఫీచర్లు

ఫిలిప్స్​ పీహెచ్1 స్మార్ట్​ఫోన్​ లాంఛ్​.. కేవలం రూ. 6 వేల ధరలోనే అదిరిపోయే ఫీచర్లు

ఫిలిప్స్​ తన మార్కెట్​ను మరింత విస్తరించేందుకు స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోకి అడుగుపెట్టింది. ఫిలిప్స్​ పీహెచ్ 1 (Philips PH1) పేరుతో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్(Smartphone) ​ను చైనా మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. సరసమైన ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందించింది.

ఇంకా చదవండి ...
ప్రముఖ స్మార్ట్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫిలిప్స్ (Philips)​ బ్రాండ్​కు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్రాండ్​ నుంచి విడుదలైన స్మార్ట్​టీవీలు, స్మార్ట్​బల్బ్​లు, ట్రిమ్మర్​లు, వాషింగ్​ మెషిన్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లకు మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంటుంది. తాజాగా ఫిలిప్స్​ తన మార్కెట్​ను మరింత విస్తరించేందుకు స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోకి అడుగుపెట్టింది. ఫిలిప్స్​ పీహెచ్ 1 (Philips PH1) పేరుతో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ను చైనా మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. సరసమైన ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందించింది.

ఫిలిప్స్​ పీహెచ్​ 1 ధర
ఫిలిప్స్ పీహెచ్​1 స్మార్ట్​ఫోన్​ మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని​ 4 జీబీ ర్యామ్​, 32 జీబీ స్టోరేజ్ ప్రారంభ వేరియంట్​ ధర కేవలం CNY 500 ($78) (దాదాపు రూ. 6,000) నుంచి ప్రారంభమవుతుంది. ఇక, 4 జీబీ ర్యామ్​/128 జీబీ స్టోరేజ్​ గల ట్రిమ్ వేరియంట్​ CNY 770 ($120) (దాదాపు రూ. 9,140) వద్ద నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు వేరియంట్లు బ్లాక్​, బ్లూ, రెడ్ కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.
iQOO Neo5s: ఐక్యూ నియో 5 సిరీస్​ నుంచి ఒకేసారి రెండు స్మార్ట్​ఫోన్లు లాంఛ్​.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..

ఫిలిప్స్​ పీహెచ్​1 స్పెసిఫికేషన్లు
ఫిలిప్స్​​ పీహెచ్​ 1 స్మార్ట్​ఫోన్​ 6.5- అంగుళాల హచ్​డీ ప్లస్​ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన1440 x 720 పిక్సెల్స్ హెచ్​డీ ప్లస్​ రిజల్యూషన్‌ని అందిస్తుంది. ఇది చాలా స్లిమ్ బెజెల్‌, 93% స్క్రీన్- టు- బాడీ రేషియోని కలిగి ఉంటుంది. ఫిలిప్స్ ఇటీవల ప్రారంభించిన ఫిలిప్స్ పీహెచ్​2 వలె దీనిలో కూడా 12nm యూనిసోక్​ టైగర్ టీ310 చిప్‌సెట్‌ను అందించింది. ఈ స్మార్ట్​ఫోన్​ 4 జీబీ ర్యామ్​, 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్​ ఆప్షన్లలో లభిస్తుంది. 4,700 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్​ మాత్రం ఉండదు.
Flipkart Big Saving Days Sale 2021: ఫ్లిప్‌కార్ట్ లో బంపరాఫర్.. కేవలం రూ.2,549కే Samsung F42 5G స్మార్ట్ ఫోన్

ఈ స్మార్ట్​ఫోన్​ 4G VoLTEతో కూడిన డ్యూయల్ సిమ్ కనెక్టివిటీకి మద్దతిస్తుంది. ఇది ఆండ్రాయిడ్​ ఎఎస్​పై నడుస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. ఫిలిప్స్​ పీహెచ్​1 స్మార్ట్​ఫోన్ 1 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, వెనుకవైపు వాటర్‌డ్రాప్ నాచ్‌తో కూడిన 13 ఎంపీ మెయిన్ షూటర్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ హెల్పర్‌ కెమెరాలను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 165.5 x 76.5 x 9.5 మి.మీ. కొలతలతో కేవలం 194 గ్రాముల బరువు ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G Smartphone, China, Smart phone

తదుపరి వార్తలు