హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Philips: ఫిలిప్స్ నుంచి టీడబ్ల్యూఎస్​ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్లు​, పార్టీ స్పీకర్లు లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..

Philips: ఫిలిప్స్ నుంచి టీడబ్ల్యూఎస్​ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్లు​, పార్టీ స్పీకర్లు లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..

3. ఈ ఇయర్‌బడ్స్​ బ్లూటూత్ వి 5కి మద్దతిస్తాయి. ఆడియో ఫ్రీ పాడ్స్​లో కాల్స్​ యాక్సెప్ట్​ లేదా రిజెక్ట్, వాల్యూమ్‌,​ మ్యూజిక్ ట్రాక్‌లను కంట్రోల్​ చేయడానికి వీటిలో టచ్ కంట్రోల్స్​ను అందించింది. ఇక. బౌల్ట్ ఆడియో ఫ్రీపాడ్స్ ప్రోను ఒక్కసొరి ఛార్జ్​ చేస్తే 8 గంటల బ్యాటరీ బ్యాకప్​ అందిస్తుంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

3. ఈ ఇయర్‌బడ్స్​ బ్లూటూత్ వి 5కి మద్దతిస్తాయి. ఆడియో ఫ్రీ పాడ్స్​లో కాల్స్​ యాక్సెప్ట్​ లేదా రిజెక్ట్, వాల్యూమ్‌,​ మ్యూజిక్ ట్రాక్‌లను కంట్రోల్​ చేయడానికి వీటిలో టచ్ కంట్రోల్స్​ను అందించింది. ఇక. బౌల్ట్ ఆడియో ఫ్రీపాడ్స్ ప్రోను ఒక్కసొరి ఛార్జ్​ చేస్తే 8 గంటల బ్యాటరీ బ్యాకప్​ అందిస్తుంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​ ఫిలిప్స్ రిపబ్లిక్ డే(Republic Day) సందర్భంగా ఒకేసారి మూడు కొత్త స్మార్ట్ ఉత్పత్తులను(Smart Products) లాంచ్​ చేసింది. కంపెనీ కొత్త TWS ఇయర్‌బడ్స్​, హెడ్‌ఫోన్లు, పార్టీ స్పీకర్లను ఆవిష్కరించింది.

ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​ ఫిలిప్స్ రిపబ్లిక్ డే(Republic Day) సందర్భంగా ఒకేసారి మూడు కొత్త స్మార్ట్ ఉత్పత్తులను(Smart Products) లాంచ్​ చేసింది. కంపెనీ కొత్త TWS ఇయర్‌బడ్స్​, హెడ్‌ఫోన్లు, పార్టీ స్పీకర్లను ఆవిష్కరించింది. ఈ కొత్త స్మార్ట్​ ఉత్పత్తుల లాంచింగ్​పై TPV టెక్నాలజీ(Technology) ఇండియా కంట్రీ హెడ్ శైలేష్ ప్రభు మాట్లాడుతూ, “గత రెండు సంవత్సరాలుగా భారత మార్కెట్​లో ఆడియో ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. అందుకే, భారతీయ వినియోగదారుల అన్ని అవసరాలను తీర్చే విధంగా ఫిలిప్స్ ఆడియో శ్రేణి ఉత్పత్తులను డిజైన్​ చేశాం. ఈ ఉత్పత్తులు గరిష్టంగా 35 గంటల పాటు ప్లేటైమ్, నాయిస్ ఐసోలేషన్, IP55 వాటర్/డస్ట్ ప్రొటెక్షన్‌ను అందిస్తాయి. మీరు పని చేస్తున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు ఈ కొత్త హెడ్‌ఫోన్లు మంచి ఎంటర్​టైన్​మెంట్ అందిస్తాయి.” అని చెప్పారు.

ఫిలిప్స్​ టీడబ్ల్యూఎస్​ ఇయర్​బడ్స్​​ ధర విషయానికొస్తే, ఫిలిప్స్ TWS TAT2206BK మోడల్​​ రూ.3,499 వద్ద, ఫిలిప్స్​ TWS TAT2236BK రూ. 3,399 వద్ద అందుబాటులో ఉంటాయి. ఇక, ఫిలిప్స్ TAA4216BK స్పోర్ట్స్ హెడ్‌ఫోన్ల అసలు ధర రూ. 8,999 వద్ద ఉండగా.. వీటిని రూ. 4,699 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక, ఫిలిప్స్​ TAX5206 పార్టీ స్పీకర్ అసలు ధర​ రూ.21,990 వద్ద ఉండగా.. దీన్ని రూ. 17,990 వద్ద కొనుగోలు చేయవచ్చు. మరోవైపు, ఫిలిప్స్​ TAX3206 పార్టీ స్పీకర్ అసలు ధర​ రూ.15,990 వద్ద ఉండగా.. దీన్ని రూ. 11,690 వద్ద కొనుగోలు చేయవచ్చు.

Porn Scam: పోర్న్ చూసేవారికి అలర్ట్... ఈ మెసేజ్ నమ్మారంటే స్కామ్‌లో బుక్కైపోతారు జాగ్రత్త

ఫిలిప్స్ టీడబ్ల్యూఎస్​ ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్లు..

ఫిలిప్స్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్​ను ఒక్కసారి ఫుల్​ ఛార్జ్ చేస్తే 18 గంటల ప్లేటైమ్‌ను అందిస్తాయి. USB ఛార్జింగ్ కేస్‌తో 15 నిమిషాల అదనపు ఛార్జ్​ చేస్తే మరో గంట అదనపు బ్యాటరీ బ్యాకప్​ ఇస్తుంది.

ఫిలిప్స్ హెడ్‌ఫోన్​ స్పెసిఫికేషన్లు..

ఫిలిప్స్ హెడ్‌ఫోన్లు 35 గంటల ప్లే బ్యాక్​ టైమ్‌తో వస్తాయి. ఈ హెడ్​ఫోన్లను పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. మరో రెండు గంటలు అదనంగా ప్లే టైమ్‌ని అందించడానికి, మీరు అదనంగా 15 నిమిషాలు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ హెడ్‌ఫోన్లు 3.5mm జాక్‌తో వస్తాయి. ఈ స్పోర్ట్స్ హెడ్‌ఫోన్లను నేరుగా స్మార్ట్​ఫోన్​ లేదా మ్యూజిక్ ప్లేయర్‌లకు కనెక్ట్ చేసుకొని మ్యూజిక్​ను ఆస్వాదించవచ్చు.

ఫిలిప్స్ పార్టీ స్పీకర్ల స్పెసిఫికేషన్లు..

ఫిలిప్స్ పార్టీ స్పీకర్లను ఒక్కసారి ఫుల్​ ఛార్జ్ చేస్తే 14 గంటల ప్లేటైమ్‌ను అందిస్తాయి. ఈ పార్టీ స్పీకర్లు నుంచి పాటకు అనుగుణంగా లైట్ల కలర్​ మారుతుంది. అది ఇంట్లో పార్టీకి సరైన మూడ్‌ని సెట్ చేస్తుంది. ఈ స్పీకర్ ట్రాలీ డిజైన్‌ను కలిగి ఉంది.

First published:

Tags: Head phones, Technology

ఉత్తమ కథలు