నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం... తప్పక చూడండి... మిస్సవ్వద్దు

కాలం చిత్రమైనది. చూస్తుండగానే కరిగిపోతూ ఉంటుంది. రోజులు అలా వెళ్లిపోతుంటాయి. కానీ.. ఒక్కోసారి అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. వాటిని మిస్సైతే మళ్లీ జరగవు. అలాంటిది ఒకటి ఇవాళ జరగబోతోంది.

news18-telugu
Updated: August 11, 2020, 8:55 AM IST
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం... తప్పక చూడండి... మిస్సవ్వద్దు
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం... తప్పక చూడండి... మిస్సవ్వద్దు
  • Share this:
ప్రపంచాన్ని పలకరించిన నియోవైజ్ (Neowise) తోకచుక్క... మన సోలార్ సిస్టమ్‌కి గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది. ఇక అది ఇప్పట్లో మళ్లీ రాదు. కాబట్టి ఇప్పుడు భూమిపై ఉన్న ఎవరూ దాన్ని మళ్లీ చూడలేరు. అలాగని మనం బాధపడాల్సిన పనిలేదు. మనల్ని పలకరించడానికి... పెర్సీడ్ (perseid meteor) ఉల్కాపాతం రాబోతోంది. ఈ సంవత్సరంలో ఈ ఉల్కాపాతమే అత్యంత కాంతివంతమైనది. లక్కేంటంటే... మన భారతీయులు కూడా దీన్ని చూసేందుకు ఈసారి అవకాశం ఉంది. జనరల్‌గా విదేశాల్లోనే ఉల్కాపాతాలు ఎక్కువగా కనిపిస్తాయి. మరి ఆ ఛాన్స్ మనకు దక్కుతున్నప్పుడు వదలకూడదు. కాకపోతే రెండు సమస్యలున్నాయి. చందమామ కాంతి, నైరుతీ రుతుపవనాల వల్ల ఏర్పడిన మేఘాలు. మీరు ఉన్న ప్రాంతంలో ఆకాశం నిర్మలంగా, మేఘాలు లేకుండా ఉంటే... మీరు ఈ ఉల్కల్ని చూడగలరు.


స్విఫ్ట్-టట్టిల్ (Swift-Tuttle) అనే తోకచుక్క నుంచి జారినవే ఈ పెర్సీడ్ ఉల్కలు. ఇదివరకూ గంటకు 60 తోకచుక్కలు కనిపించేవి. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గింది. గంటకు 16 నుంచి 20 దాకా కనిపిస్తున్నాయి. మీరు గమనిస్తే... ప్రతి 2 లేదా 3 నిమిషాలకు ఓ తోక చుక్క... నక్షత్రంలా మెరుస్తూ అలా వెళ్లిపోతూ ఉంటుంది.

ఇండియాలో పెర్సీడ్ తోకచుక్కల్ని ఇలా చూడవచ్చు :
మంగళవారం (ఆగస్ట్ 11న) రాత్రి ఈ తోకచుక్కలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. ఐతే... బుధవారం రాత్రి, గురువారం తెల్లవారు జాము వరకూ ఇవి ఆకాశంలో కనిపిస్తూనే ఉంటాయి. అర్థరాత్రి 2 తర్వాత నుంచి సూర్యోదయం వరకూ... ఈ తోకచుక్కలు ఇండియాలో ఎక్కువగా కనిపిస్తాయి.


తోకచుక్కల్ని చూసేందుకు మీరు ఉన్న ఏరియాలో చుట్టూ కాంతి, లైట్లు లేకుండా చూసుకోండి. అలాగే... పొల్యూషన్, దుమ్మూ లేని ప్రదేశం ఎంచుకోండి. మీకు ఆకాశం స్పష్టంగా కనిపించాలి. మిగతా నక్షత్రాలన్నీ కనిపిస్తూ ఉండాలి. అలాంటి చోట మీరు ఉండాలి. మీకు ఆకాశం బాగా కనిపిస్తూ ఉంటే... మీరు ఎలాంటి పరికరాలూ లేకుండా మామూలు కళ్లతోనే తోకచుక్కల్ని చూడగలరు. ఆకాశంలో ఎటువైపు చూసినా ఈ తోకచుక్కలు కనిపిస్తూనే ఉంటాయి. అందువల్ల మీరు వాటిని ఈజీగా కనిపెట్టగలరు. అవి అలా ఆగకుండా వేగంగా వెళ్లిపోతూ... సెకన్లలో మాయమవుతాయి. ఒకవేళ మీకు ఆకాశంలో మేఘాలు ఉంటే... ఫేస్‌బుక్‌లోని NASA మెటియర్ వాచ్ పేజీలో లైవ్‌లో వాటిని చూడొచ్చు.

ఇలాంటి దృశ్యాలు ఆకాశంలో ఎప్పుడు బడితే అప్పుడు రావు. అవి వచ్చినప్పుడే వాటిని మనం చూడాలి. అలా చూసే ప్రతీదీ మన జీవితంలో అరుదైన సందర్భంగా మిగిలిపోతుంది. అవి మనకు జ్ఞాపకాలుగా మారతాయి.
Published by: Krishna Kumar N
First published: August 11, 2020, 8:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading