ఐఫోన్ కొంటే డబ్బున్నోళ్లేనా?

మీ దగ్గర ఐఫోన్ ఉందా? అయితే మీరు డబ్బున్నోళ్లే. అవును... ఎవరి దగ్గరైతే ఐఫోన్ ఉంటుందో వారిని సమాజం ధనవంతులుగా భావిస్తున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.

news18-telugu
Updated: July 11, 2018, 5:09 PM IST
ఐఫోన్ కొంటే డబ్బున్నోళ్లేనా?
(image: News18.com)
  • Share this:
యాపిల్ ఐ ఫోన్... అదో స్టేటస్ సింబల్. ఖరీదెక్కువైనా సరే జేబులో ఐఫోన్ ఉండాల్సిందే అన్నది చాలామంది పాలసీ. అయితే ఐఫోన్ కొనేవాళ్లు ఆర్థికంగా స్థితిమంతులుగా భావిస్తున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. మీరు బాగా సంపాదిస్తారనడానికి జేబులో ఉండే ఐఫోన్ సూచిస్తుందని ఆ స్టడీ సారాంశం. ఎందుకంటే అంత డబ్బులేనివారు ఐఫోన్ జోలికి రారన్న అభిప్రాయం ఉంది. అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు.

సంపాదన స్థాయిని జీవనశైలి ఎలా ప్రతిబింబిస్తుందో తెలుసుకునేందుకు నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్‌తో కలిసి యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఈ అధ్యయనం చేసింది. జేబులో ఐఫోన్ ఉన్నవారి ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుందని చాలామంది భావిస్తుంటారని తేలింది. అయితే ఈరోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ల ధరలు కూడా తక్కువేమీ లేవు. ఒప్పో ఫైండ్ ఎక్స్ ధర రూ.80 వేలపైనే ఉంటుందని అంచనా. హువాయ్ పీ20 ప్రో ధర కూడా దాదాపు అంతే ఉంటుంది. కానీ ఎవరిదగ్గరైనా యాపిల్ ఫోన్ ఉంటే చాలు... వాళ్లు బాగా సంపాదించేవారని అనుకుంటున్నారు. అలాగని ఐఫోన్ ఎక్స్ ఉంటేనే అని కాదు... యాపిల్ ఫోన్ ఏదైనా అలాగే భావిస్తున్నారు.

ఇన్నేళ్ల డేటా పరిశీలిస్తే ఒక్క యాపిల్ ఐఫోన్ తప్ప మరే బ్రాండ్‌ ఫోన్‌ ద్వారా ఆదాయాన్ని అంచనా వేసేవారు కాదని అధ్యయనంలో తేల్చారు. అయితే అమెరికాలో మాత్రమే శాంపిల్స్ తీసుకొని ఈ అద్యయనం చేశారు. అయితే బడ్జెట్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించే ఇండియాలో మాత్రం యాపిల్ ఫోన్లు ఉన్నవాళ్లు బాగా డబ్బున్నోళ్లే అన్న అభిప్రాయం మామూలే.

First published: July 11, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు