Number Neighbour: మీ ఫోన్‌నెంబర్‌కు ముందు నెంబర్ ఎవరిదో తెలుసా ?

బైమిస్టేక్‌గా ఒక నెంబర్‌ మారి కాల్ చేయడం చాలామంది చేస్తుంటాం. కానీ మన నెంబర్‌కు ముందు, లేదా వెనకాల నెంబర్ ఎవరిదో అన్న ఉత్సాహం చాలా తక్కువ మంది మాత్రమే చేస్తుంటారు.

news18-telugu
Updated: August 6, 2019, 8:32 AM IST
Number Neighbour: మీ ఫోన్‌నెంబర్‌కు ముందు నెంబర్ ఎవరిదో తెలుసా ?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 6, 2019, 8:32 AM IST
సోషల్ మీడియలో రోజుకో ట్రెండ్ సెట్ చేస్తున్నారు నెటిజన్లు. ఐస్ బకెట్ ఛాలెంజ్, బాటిల్ క్యాప్ ఛాలెంజ్, ఫిటినెస్ ఛాలెంజ్‌ అంటూ అనేక ఛాలెంజ్‌లు సోషల్ మీడియా వేదికగానే ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు మరో తాజా సవాల్ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. అదేంటంటే... మీరెప్పుడైనా మీ ఫోన్‌ నంబర్‌కు ఒక అంకె ముందు లేదా వెనుక నంబర్‌ ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా..?ఇప్పుడు ఇదే ట్రెండ్ సోషల్ మీడియాలో నడుస్తోంది.


బైమిస్టేక్‌గా ఒక నెంబర్‌ మారి కాల్ చేయడం చాలామంది చేస్తుంటాం. కానీ మన నెంబర్‌కు ముందు, లేదా వెనకాల నెంబర్ ఎవరిదో అన్న ఉత్సాహం చాలా తక్కువ మంది మాత్రమే చేస్తుంటారు. ఇలా కొందరు ఇప్పటికే చేసి ఉండొచ్చు.. మరికొందరు ప్రయత్నం చేద్దామని అనుకుని ఎందుకులే అని వదిలేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడీ కొత్త  ట్రెండ్ నెటిజన్లను ఓ ఊపు ఊపేస్తోంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ‘నంబర్‌ నైబర్‌’ అనే ఓ కొత్త ట్రెండ్‌ మొదలైంది. ‘నైబర్ నంబర్’ పేరుతో ట్రెండ్ అవుతున్న ఈ చాలెంజ్‌లో భాగంగా మన ఫోన్ నంబరుకు ముందు, లేదంటే వెనకున్న నంబరు ఎవరిదో తెలుసుకోవాలి.

తమ ఫోన్‌ నంబర్‌లోని చివరి అంకెని ఒకటి అటూ లేదా ఇటు మార్చి అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయడమే ‘నంబర్ నైబర్’ అన్నమాట. నెటిజన్లు ప్రస్తుతం ఈ కొత్త సవాల్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నెటిజన్లు తమ నైబర్ నంబర్లకు మెసేజ్‌ చేసి వారి నుంచి వచ్చిన రిప్లైలను ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారు.






Loading...




First published: August 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...