హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

PC, Tablet Shipments: వచ్చే రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా తగ్గనున్న పీసీ, ట్యాబ్లెట్ షిప్‌మెంట్లు.. ఎందుకంటే..

PC, Tablet Shipments: వచ్చే రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా తగ్గనున్న పీసీ, ట్యాబ్లెట్ షిప్‌మెంట్లు.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2022లో పీసీలు, ట్యాబ్లెట్‌ల గ్లోబెల్ షిప్‌మెంట్లు (Global Shipments) చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఇదే ట్రెండ్ ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని మార్కెట్ రీసెర్చర్ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) విడుదల చేసిన తాజా రిపోర్టు తెలిపింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

కరోనా (Corona) కాలంలో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతరులు ఇంటి నుంచే వర్క్స్ చేసుకున్నారు. ఈ సమయంలో చాలామంది వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆన్‌లైన్ క్లాసుల కోసం పీసీలు (Personal Computers), ట్యాబ్లెట్ల (Tablets)పై ఎక్కువగా ఆధారపడ్డారు. దాంతో 2020-21 సంవత్సరాల్లో వాటి సేల్స్ ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. అయితే కొన్ని నెలల క్రితం నుంచే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడంతో అందరూ మళ్లీ ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లడం మొదలు పెట్టారు. దాంతో గత రెండేళ్లతో పోలిస్తే కన్జ్యూమర్, ఎడ్యుకేషనల్ పీసీలకు డిమాండ్ తగ్గి సేల్స్ ప్రపంచవ్యాప్తంగా పతనమయ్యాయి. ఓ తాజా రిపోర్ట్ ప్రకారం, 2022లో పీసీలు, ట్యాబ్లెట్‌ల గ్లోబెల్ షిప్‌మెంట్లు (Global Shipments) చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఇదే ట్రెండ్ ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని మార్కెట్ రీసెర్చర్ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) విడుదల చేసిన తాజా రిపోర్టు తెలిపింది.

హెచ్‌పీ, హెచ్‌పీక్యూ, డెల్, యాపిల్ , లెనోవో వంటి పీసీ తయారీ కంపెనీలు కరోనా కాలంలో పెరిగిన డిమాండ్‌తో అధిక సంఖ్యలో పీసీలను విక్రయించి లాభపడ్డాయి. అయితే గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం పెరగడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీన పడటం, ఆన్‌లైన్ వర్కింగ్ తగ్గడం వల్ల గత రెండేళ్లుగా భారీగా నమోదైన కొనుగోళ్లు ఈ ఏడాది, వచ్చే ఏడాది తగ్గనున్నట్లు IDC రిపోర్టు తెలిపింది. ఈ ఏడాది పీసీ షిప్‌మెంట్లు 12.8% తగ్గనుండగా.. టాబ్లెట్ షిప్‌మెంట్లు 6.8% తగ్గుతాయి. 2024లో షిప్‌మెంట్లు మళ్లీ వృద్ధిని నమోదు చేయడానికి ముందు ఈ రెండు షిప్‌మెంట్లు 2023లో మరో 2.6% క్షీణతను నమోదు చేస్తాయని నివేదిక పేర్కొంది.

Budget Tablets: పిల్లల కోసం ట్యాబ్ కొనాలనుకుంటున్నారా..? ఈ టాప్-5 బడ్జెట్ ట్యాబ్లెట్లపై ఓ లుక్కేయండి

రిపోర్టులో ముఖ్యాంశాలు

సాంప్రదాయ పీసీల గ్లోబల్ షిప్‌మెంట్లు 2022లో 305.3 మిలియన్ యూనిట్లకు పడిపోనుండగా.. ట్యాబ్లెట్ల షిప్‌మెంట్లు 156.8 మిలియన్లకు తగ్గుతాయని లేటెస్ట్ IDC నివేదిక వెల్లడించింది. గత రిపోర్ట్ ప్రకారం పీసీ తయారీ కంపెనీలు 2021లో 341 మిలియన్ పీసీలను షిప్పింగ్ చేసాయి. అంటే గతేడాదితో పోలిస్తే దాదాపు 35 మిలియన్ల పీసీ షిప్‌మెంట్లు ఈ ఏడాది తగ్గనున్నాయని తెలుస్తోంది.

డిమాండ్‌పై ప్రభావం ఉంటుందా?

పీసీలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. విండోస్ 10కి సపోర్ట్ మరికొద్ది సంవత్సరాల్లో ఆగిపోనుంది. వ్యాపార సంస్థలు, కంపెనీలు హార్డ్‌వేర్ రిఫ్రెష్‌ చేయడం వల్ల కూడా వీటికి నిత్యం డిమాండ్ ఉంటూనే ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలిక డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. ఎడ్యుకేషనల్ డిప్లాయ్‌మెంట్లు, హైబ్రిడ్ వర్క్ వంటి కారణాల వల్ల కూడా పీసీల డిమాండ్ పాజిటివ్ గానే ఉంటుంది.

కొనుగోలుదారుల సెంటిమెంట్ బాగా దెబ్బతినడంతో వచ్చే ఆరు త్రైమాసికాలలో మార్కెట్‌లో ఎక్కువ క్షీణత కనిపించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కరోనా తగ్గుదల వల్ల ఎడ్యుకేషనల్ పీసీలకు డిమాండ్ తగ్గినా కూడా కరోనా ముందునాటి కంటే ఎక్కువగానే షిప్‌మెంట్లు జరిగే అవకాశముందన్నారు. స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎంటర్‌ప్రైజ్ డిమాండ్ కూడా తగ్గుతుందని దీనివల్ల 2023లో సేల్స్ అంతగా పెరగవని అన్నారు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Computers, Tablet

ఉత్తమ కథలు