Paytm: మీ ఫోన్‌లో పేటీఎం యాప్ ఉందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న కంపెనీ

Paytm | ఎవరో చెప్పారని మీరు ఎనీడెస్క్ లాంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ క్లోన్ చేయడం హ్యాక్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది.

news18-telugu
Updated: August 19, 2019, 6:02 PM IST
Paytm: మీ ఫోన్‌లో పేటీఎం యాప్ ఉందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న కంపెనీ
Paytm: మీ ఫోన్‌లో పేటీఎం యాప్ ఉందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న కంపెనీ
news18-telugu
Updated: August 19, 2019, 6:02 PM IST
పేటీఎం వాడుతున్నారా? అయితే జాగ్రత్త అని హెచ్చరిస్తోంది కంపెనీ. ముఖ్యంగా కేవైసీ అప్‌డేట్ సమయంలో అప్రమత్తంగా ఉండాలంటోంది. మీరు ఒకవేళ మొబైల్ వ్యాలెట్‌కు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసినట్టైతే ఏమరుపాటు అసలే వద్దు. కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా మీ అకౌంట్‌లో డబ్బులు మాయమవడం ఖాయం. ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ పేటీఎం కేవైసీ ప్రాసెస్ పూర్తి చేస్తామని, అకౌంట్‌లో సమస్యలు ఉన్నాయని చెబితే అస్సలు నమ్మొద్దు. ఇందుకోసం Any Desk, Quicks Port లాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేయమని అడిగితే అస్సలు ఒప్పుకోవద్దు. మీ ఫోన్‌లో ఇలాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసి నేరగాళ్లు సులువుగా డబ్బు కాజేస్తారు. Any Desk లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ డౌన్‌లోడ్ చేసి ఇతరులకు యాక్సెస్ ఇచ్చారంటే మీ స్మార్ట్‌ఫోన్‌ను వాళ్ల చేతికి ఇచ్చినట్టే. మీ వ్యాలెట్, బ్యాంక్ అకౌంట్ల నుంచి క్షణాల్లో డబ్బులు మాయం చేస్తారు సైబర్ నేరగాళ్లు.

Read this: UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటించండి

ఎవరో చెప్పారని మీరు ఎనీడెస్క్ లాంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్ క్లోన్ చేయడం హ్యాక్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. ఇటీవల ఎనీడెస్క్ లాంటి యాప్స్ యూజర్ల స్మార్ట్‌ఫోన్స్‌లో ఇన్‌స్టాల్ చేయించి మోసాలు చేస్తున్నారు నేరగాళ్లు. ఒక్క పేటీఎం మాత్రమే కాదు గూగుల్ పే, ఫోన్ పే లాంటి వ్యాలెట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ మోసాలపై స్పందించింది. రిమోట్ యాప్స్ విషయంలో కొన్ని గైడ్‌లైన్స్ రూపొందించింది. బ్యాంకులు, యూపీఐ ప్లాట్‌ఫామ్స్ కూడా యూజర్లను అప్రమత్తం చేస్తున్నాయి. ఎనీడెస్క్ లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ అస్సలు ఇన్‌స్టాల్ చేయొద్దని సూచిస్తున్నాయి.

First Smartphone: ప్రపంచంలోనే మొదటి స్మార్ట్‌‌ఫోన్... ఎలా ఉందో చూశారా?




ఇవి కూడా చదవండి:

World Photography Day: మీ సెల్ఫీలు, ఫోటోలు అద్భుతంగా రావాలా? ఈ స్మార్ట్‌ఫోన్లు ట్రై చేయొచ్చు
Loading...
Jio GigaFiber: జియో గిగాఫైబర్ కనెక్షన్‌తో టీవీ ఉచితం... రిజిస్టర్ చేసుకోండి ఇలా

Alert: ఈ 85 ఫోటో, గేమింగ్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా? జాగ్రత్త... యాప్స్ లిస్ట్ ఇదే
First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...