Paytm: త్వరలో పేటీఎం నుంచి వార్తలు, వీడియోలు

Paytm | వీడియోలు, వార్తలు, లైవ్ టీవీ లాంటి కొత్త ఫీచర్లు అందించడం ద్వారా యాప్‌పై యూజర్ ఎంగేజ్‌మెంట్ పెంచుకోవాలని చూస్తోంది పేటీఎం.

news18-telugu
Updated: August 15, 2019, 3:53 PM IST
Paytm: త్వరలో పేటీఎం నుంచి వార్తలు, వీడియోలు
Paytm: త్వరలో పేటీఎం నుంచి వార్తలు, వీడియోలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 15, 2019, 3:53 PM IST
రీఛార్జ్, బిల్ పేమెంట్స్, షాపింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో యూజర్లకు సేవలు అందిస్తున్న పేటీఎం... త్వరలో వినోదాన్ని కూడా పంచనుంది. సెప్టెంబర్ నుంచి లైవ్ టెలివిజన్, షార్ట్ వీడియోస్, న్యూస్, కంటెంట్ అందించనుంది. యూజర్ల సంఖ్యను 25 కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో ఈ ప్రణాళికలు రూపొందిస్తోంది పేటీఎం. ఇప్పటికే పేటీఎం ఇన్‌బాక్స్‌లో 2.7 కోట్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. "వినూత్నమైన కంటెంట్ అందించడం ద్వారా మరో 6-7 కోట్ల మంది కొత్త యూజర్లు చేరతారని భావిస్తున్నాం. దాంతో పాటు స్మార్ట్‌ఫోన్లల్లో పేటీఎం యాప్ ఇన్‌బిల్ట్‌గా ఇచ్చేందుకు ఒప్పో, వివో, షావోమీ లాంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. 55-60% మంది మొదటిసారి స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నవాళ్లే మా లక్ష్యం" అని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబోట్ తెలిపారు.

ఇప్పటికే పేటీఎం రీఛార్జ్, బిల్ పేమెంట్, మూవీ టికెట్స్, స్కూల్ ఫీజ్, ఇన్స్యూరెన్స్ పేమెంట్స్ లాంటి సేవల్ని అందిస్తోంది. 1.30 లక్షల ఆఫ్‌లైన్ రీటైల్ ఔట్‌లెట్స్‌లో పేమెంట్స్ స్వీకరిస్తోంది పేటీఎం. త్వరలో వీడియోలు, వార్తలు, లైవ్ టీవీ లాంటి కొత్త ఫీచర్లు అందించడం ద్వారా యాప్‌పై యూజర్ ఎంగేజ్‌మెంట్ పెంచుకోవాలని చూస్తోంది పేటీఎం. అంతేకాదు... స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో కొన్ని ఒప్పందాలు చేసుకోబోతోంది. వీటితో పాటు మున్సిపల్ ట్యాక్స్, ట్రాఫిక్ ఫైన్స్ లాంటి పేమెంట్స్‌ని పేటీఎం ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోబోతోంది.

Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్... లుక్స్ అదుర్స్




ఇవి కూడా చదవండి:

Tata Sky: టాటా స్కై ఫ్లెక్సీ ప్లాన్‌తో క్యాష్‌బ్యాక్ ఆఫర్

IT Jobs: ఇండియాలో ఎక్కువ జీతం వచ్చే 5 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలివే

Free ATM Transactions: ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ
First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...