Contactless Dining: రెస్టారెంట్‌కు వెళ్తే పేటీఎంలో ఫుడ్ ఆర్డర్ చేయాలి... ఎలాగంటే

Paytm | కరోనా వైరస్ లాక్‌డౌన్ తర్వాత మీరు హోటల్‌కు వెళ్తే ఆర్డర్ చేసే పద్ధతి ఇంతకుముందులాగా ఉండదు. ఏం కావాలన్నా మీ ఫోన్‌లోనే ఆర్డర్ చేయాలి.

news18-telugu
Updated: April 28, 2020, 3:31 PM IST
Contactless Dining: రెస్టారెంట్‌కు వెళ్తే పేటీఎంలో ఫుడ్ ఆర్డర్ చేయాలి... ఎలాగంటే
Contactless Dining: రెస్టారెంట్‌కు వెళ్తే పేటీఎంలో ఫుడ్ ఆర్డర్ చేయాలి... ఎలాగంటే
  • Share this:
కాంటాక్ట్‌లెస్ డైనింగ్... కోవిడ్ 19 తర్వాతి ప్రపంచంలో మనం ఎక్కువగా వినబోయే మాట ఇదే. గతంలో మీరు రెస్టారెంట్‌కు వెళ్తే ఎలా ఆర్డర్ చేసేవాళ్లు? వెయిటర్‌ని పిలిచి, మెనూ కార్డ్ తీసుకొని నచ్చిన ఐటెమ్స్ ఆర్డర్ చేసేవాళ్లు కదా? భవిష్యత్తులో ఆర్డర్ చేసే పద్ధతి మారే అవకాశముంది. రెస్టారెంట్లు కాంటాక్ట్‌లెస్ డైనింగ్ విధానాన్ని ప్రవేశపెట్టొచ్చు. మనుషుల మధ్య ఇంటరాక్షన్ తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి సోషల్ డిస్టెన్సింగ్ ప్రధాన అస్త్రం. కాబట్టి 'కాంటాక్ట్‌లెస్ ఇన్-స్టోర్ ఆర్డరింగ్' సోషల్ డిస్టెన్సింగ్‌కు ఉపయోగపడుతుంది. మీకు ఏం కావాలన్నా ఫోన్‌లోనే ఆర్డర్ చేయాలి. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం ఇప్పటికే రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్స్ కోసం 'కాంటాక్ట్‌లెస్ ఇన్-స్టోర్ ఆర్డరింగ్' విధానాన్ని ప్రయోగాత్మకంగా రూపొందించింది. 'కాంటాక్ట్‌లెస్ ఇన్-స్టోర్ ఆర్డరింగ్' ఎలా పనిచేస్తుందో వివరించింది.

ప్రతీ హోటల్‌కు ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. కస్టమర్ వెళ్లి కూర్చున్న తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ ఫోన్‌లో మెనూ కనిపిస్తుంది. మీరు మీ ఫోన్‌లోనే ఏం కావాలో ఆర్డర్ చేయాలి. ఆ తర్వాత ఆర్డర్ మీ టేబుల్ దగ్గరకు తీసుకొస్తారు. పేమెంట్ కూడా ఆన్‌లైన్‌లోనే చేయొచ్చు. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్స్ అన్నీ సపోర్ట్ చేస్తాయి. 'కాంటాక్ట్‌లెస్ ఇన్-స్టోర్ ఆర్డరింగ్' విధానం వల్ల వెయిటర్‌తో, కౌంటర్ దగ్గర క్యాషియర్‌తో ఇంటరాక్షన్ ఉండదు. మొదటి విడతలో లక్ష రెస్టారెంట్లలో 'కాంటాక్ట్‌లెస్ ఇన్-స్టోర్ ఆర్డరింగ్' అమలు చేయాలని భావిస్తోంది పేటీఎం. అంతేకాదు... కస్టమర్ల డైనింగ్ హిస్టరీని బట్టి ఆఫర్స్ కూడా అందిస్తామంటోంది.

ఇవి కూడా చదవండి:

మీ అకౌంట్‌లోకి రూ.1,500 వచ్చాయా? చెక్ చేయండి ఇలా

Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి మీకు బెస్ట్ ప్లాన్స్ ఇవే

WhatsApp: వాట్సప్ ఫార్వర్డ్ మెసేజెస్ 70% తగ్గాయి... ఎందుకంటే
First published: April 28, 2020, 3:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading