హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Paytm Offer: ఉచితంగానే ఐఫోన్ 14, వన్‌ప్లస్ట్ 10టీ స్మార్ట్‌ఫోన్ పొందండి.. 2 రోజులే ఆఫర్!

Paytm Offer: ఉచితంగానే ఐఫోన్ 14, వన్‌ప్లస్ట్ 10టీ స్మార్ట్‌ఫోన్ పొందండి.. 2 రోజులే ఆఫర్!

Paytm Offer: ఉచితంగానే ఐఫోన్ 14, వన్‌ప్లస్ట్ 10టీ స్మార్ట్‌ఫోన్ పొందండి.. 2 రోజులే ఆఫర్!

Paytm Offer: ఉచితంగానే ఐఫోన్ 14, వన్‌ప్లస్ట్ 10టీ స్మార్ట్‌ఫోన్ పొందండి.. 2 రోజులే ఆఫర్!

Paytm News | మీరు ఉచితంగానే ఐఫోన్ 14 గెలుచుకునే అవకాశం అందుబాటులో ఉంది. ఇంకా వన్‌ప్లస్ 10టీ ఫోన్ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

iPhone 14 | ఐఫోన్ 14, వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ వంటి వాటిని ఉచితంగా పొందొచ్చు. ఎలా అని అనుకుంటన్నారా? అయితే మీరు ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇండియన్ మల్టీ నేషనల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ పేటీఎం అదిరే ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఉచితంగానే ఐఫోన్ 14 (iPhone), వన్‌ప్లస్ (Oneplus) స్మార్ట్‌ఫోన్ వంటి వాటిని గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్ పరమిత కాలం వరకే ఉంటుంది. మార్చి 15 వరకు ఆఫర్ ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది.

పేటీఎం ప్రకారం చూస్తే.. రెఫర్ అండ్ విన్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విజేతలుగా నిలిచిన వారికి ఐఫోన్ 14, వన్‌ప్లస్ 10టీ, జేబీఎల్ లైవ్ వంటి తరతర వాటిని ఉచితంగా పొందొచ్చు. మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్ యూపీఐ ద్వారా తొలిసారి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే.. అప్పుడు ఈ బహుమతులు పొందొచ్చు. మీరు రెఫర్ చేసే ఫ్రెండ్స్ ఆధారాం మీకు వచ్చే బహుమతి కూడా ఆధారపడి ఉంటుంది.

సమాచారం అందిస్తే రూ.20 లక్షలు.. ఒక్క దెబ్బతో లక్షాధికారులు అయిపోండి!

అంటే మీరు 11 మందికి పైగా పేటీఎంను రెఫర్ చేస్తే.. ఐఫోన్ 14 గెలుచుకోవచ్చు. కేవలం ఒక్కరికీ మాత్రమే ఈ ఐఫోన్ లభిస్తుంది. 11 మందికి పైగా రెఫర్ చేసిన వారికి ఐఫోన్ 14 గెలుచుకునే అవకాశం ఉంటుంది. అదే 5 నుంచి 10 మందికి రెఫర్ చేస్తే.. అప్పుడు వారికి వన్‌ప్లస్ 10 టీ స్మార్ట్‌ఫోన్ గెలుచుకునే ఛాన్స్ లభిస్తుంది. ఈ వన్‌ప్లస్ 10 టీ స్మార్ట్‌ఫోన్‌ను ముగ్గురికి అందజేస్తారు. అంటే 5 నుంచి 10 మందిని రెఫర్ చేసిన వారిలో ముగ్గురికి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ లబించే ఛాన్స్ ఉంటుంది.

నెలకు రూ.500 కట్టండి.. రూ.2,50,000 పొందండి.. బ్యాంక్, పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్

ఇక 1 నుంచి నలుగురికి రెఫర్ చేస్తే.. వారికి జేబీఎల్ లైవ్ హెడ్‌ ఫోన్స్ లభిస్తాయి. పది మందికి ఈ అవకాశం ఉంటుంది. అంటే 1 - 4 మందిని రెఫర్ చేసిన వారిలో 10 మందికి జేబీఎల్ హెడ్‌ఫోన్స్ లభిస్తాయి. ఈ బహుమతులు కాకుండా కచ్చితమైన రెఫరల్ క్యాష్‌బ్యాక్ కూడా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. మీరు మీ రెఫరల్ లింక్‌ను మీ స్నేహితులకు షేర్ చేయాలి. మీరు షేర్ చేసిన లింక్‌ను మీ ఫ్రెండ్ ఓపెన్ చేసి ఫస్ట్ యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే.. అప్పుడు మీకు, మీ ఫ్రెండ్‌కు ఇద్దరికీ క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలని భావిస్తే.. పేటీఎం యాప్‌లోకి వెళ్లి రెఫర్ అండ్ విన్ సెక్షన్‌లోకి వెళ్లి రెఫర్ నౌ ద్వారా ఈ పోటీలో పాల్గొనవచ్చు.

First published:

Tags: Apple iphone, Iphone, Iphone 14, Oneplus, Paytm

ఉత్తమ కథలు