రిలయెన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్. జియో నెంబర్‌కు రీఛార్జ్ చేసి రివార్డ్స్, క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. 2021 ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు క్యాష్‌బ్యాక్, రివార్డ్ ఆఫర్స్‌ని ప్రకటించింది రిలయెన్స్ జియో. ప్రస్తుత జియో యూజర్లు మాత్రమే కాదు, కొత్త యూజర్లు కూడా ఈ ఆఫర్స్ పొందొచ్చు. క్యాష్‌బ్యాక్‌తో పాటు మరెన్నో ఆఫర్స్ ఉన్నాయి. పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్, ఫ్రీఛార్జ్, మొబీక్విక్ నుంచి అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. మరి మీకు ఉపయోగపడే ఆఫర్స్ గురించి తెలుసుకొని ఈసారి రీఛార్జ్ చేసినప్పుడు ఆ ఆఫర్స్‌ని ఉపయోగించండి. క్యాష్‌బ్యాక్, రివార్డ్స్ పొందండి.
Paytm: కొత్త జియో యూజర్లు పేటీఎం ద్వారా రీఛార్జ్ చేస్తే రూ.75 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో పాటు రూ.250 కన్నా ఎక్కువ క్రెడిట్ లభిస్తుంది. ఇక ప్రస్తుత జియో యూజర్లు పేటీఎం ద్వారా రీఛార్జ్ చేస్తే 1500 పేటీఎం ఫస్ట్ పాయింట్స్ వస్తాయి. దీంతో పాటు రూ.250 కన్నా ఎక్కువ క్రెడిట్ లభిస్తుంది. మొదటి నుంచి ఆరో రీఛార్జ్ వరకే ఇది వర్తిస్తుంది.
Price Hike: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... రెండు మోడళ్ల ధరలు పెంచిన షావోమీ
UMANG App: పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలా? ఉమాంగ్ యాప్‌లో అప్లై చేయండి
PhonePe: ఫోన్‌పే ద్వారా కొత్త జియో యూజర్లు రీఛార్జ్ చేస్తే రూ.600 వరకు రివార్డ్స్ లభిస్తాయి. ఇక ప్రస్తుత జియో యూజర్లు రీఛార్జ్ చేస్తే రూ.400 రివార్డ్స్ లభిస్తాయి. యూపీఐ ద్వారా జరిపే పేమెంట్స్‌కి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Amazon: అమెజాన్ ద్వారా కొత్త జియో యూజర్లు రీఛార్జ్ చేస్తే రూ.50 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ప్రస్తుత యూజర్లు రీఛార్జ్ చేస్తే రూ.125 వరకు అమెజాన్ పే డైలీ రివార్డ్స్ పొందొచ్చు.
Smartphone: స్మార్ట్‌ఫోన్ పోయిందా? వెంటనే ఇలా చేయడం మర్చిపోవద్దు
Freecharge: ఫ్రీఛార్జ్ ద్వారా జియో కొత్త యూజర్లు, పాత యూజర్లు రీఛార్జ్ చేస్తే రూ.1000 వరకు రివార్డ్స్ పొందొచ్చు. ప్రతీ రీఛార్జ్‌పై ఈ ఆఫర్ ఉంది. ఫ్రీఛార్జ్ యాప్ ద్వారా జరిపే లావాదేవీలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో కొత్త యూజర్ రూ.199 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేస్తే రూ.40 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇందుకోసం JION40 కోడ్ ఉపయోగించాలి. ప్రస్తుత జియో యూజర్ రూ.149 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేస్తే రూ.30 వరకు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. JION30 కోడ్ ఉపయోగించాలి. యాప్, వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Mobikwik: మొబీక్విక్ ద్వారా జియో కొత్త యూజర్ రీఛార్జ్ చేస్తే రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. NJIOCB కోడ్ ఉపయోగించాలి. కనీసం రూ.30 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇక ప్రస్తుత జియో యూజర్ రీఛార్జ్ చేస్తే రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. JIOCB కోడ్ ఉపయోగించాలి. మొబీక్విక్ యాప్‌పై ఒక యూజర్‌కు ఒకేసారి ఈ ఆఫర్ వర్తిస్తుంది. మైజియో, Jio.com వెబ్‌సైట్లలో మొబీక్విక్ యూపీఐ లావాదేవీలపై జియో కొత్త యూజర్లకు, పాత యూజర్లకు రూ.50 వరకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కొత్త యూజర్ రూ.399 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేస్తే రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Reliance Jio