మీ స్మార్ట్‌ఫోన్‌లో పబ్‌జీ గేమ్ ఉందా? రెగ్యులర్‌గా పబ్‌జీ గేమ్ ఆడుతుంటారా? మీకు ఓ గుడ్ న్యూస్. పబ్‌జీ ప్లేయర్ల కోసం పేటీఎం అనేక ఆఫర్లు తీసుకొచ్చింది. ఇన్ యాప్ పర్చేసెస్ కోసం మీరు పేటీఎంలో గూగుల్ ప్లే రీఛార్జ్ కోడ్ కొంటే మంచి ఆఫర్లు లభిస్తాయి. పబ్‌జీలో యూసీ కొనుగోలు కోసం పేటీఎం నుంచి చెల్లింపులు చేస్తే డిస్కౌంట్ ధరలు లభిస్తాయి. ఈ ఆఫర్ పబ్‌జీ మొబైల్‌లో ఇన్-గేమ్ ఐటమ్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. 2019 జనవరి 15 నుంచి 2019 మార్చి 10 వరకు పేటీఎంలో గూగుల్ ప్లే రీఛార్జ్ కోడ్ కొనుగోలు చేసినవాళ్లు ఈ ఆఫర్ పొందొచ్చు. 2019 ఏప్రిల్ 9 వరకు ఒక యూజర్ 3 సార్లు మాత్రమే కోడ్ కొనుగోలు చేయొచ్చు.
Read This: మూడేళ్లలో ఈ 9 జాబ్స్‌కు ఫుల్ డిమాండ్... చేయాల్సిన కోర్సులివే
యూజర్లు పొందే ఆఫర్లు ఇవే...
పబ్‌జీలో రూ.100 నుంచి రూ.299 కొనుగోలు చేసినవారికి రూ.220 విలువైన మాస్క్ ఉచితం.
పబ్‌జీలో రూ.300 నుంచి రూ.999 కొనుగోలు చేసినవారికి రూ.440 విలువైన టీషర్ట్ ఉచితం.
పబ్‌జీలో రూ.1000 నుంచి రూ.1500 కొనుగోలు చేసినవారికి రూ.720 విలువైన కుర్తా పైజామా ఉచితం.
పబ్‌జీలో రూ.1,501 నుంచి రూ.5000 కొనుగోలు చేసినవారికి రూ.1,300 విలువైన కుర్తా పైజామా, రగ్డ్ ప్యాక్ ఉచితం.
ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను పేటీఎం వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
Photos: మహాత్మాగాంధీ వర్ధంతి... మీరు చూడని జాతిపిత అరుదైన 100 చిత్రాలు ఇవే...
ఇవి కూడా చదవండి:
Facebook Tips: మీ ఫేస్‌బుక్‌లో చేయకూడని 9 అంశాలివే...
Will you marry me?: వాయిస్ అసిస్టెంట్‌కు యూజర్ల ప్రశ్నలు... గూగుల్ ఫన్నీ రిప్లై
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Paytm, PUBG, Smartphone