Home /News /technology /

PAYTM OFFERING UP TO RS 50 CASHBACK FOR ELECTRICITY BILL PAYMENTS VIA MOBILE APP SS

Paytm Cashback: పేటీఎం కొత్త ఆఫర్... కరెంట్ బిల్ కడితే క్యాష్‌బ్యాక్

Paytm Cashback: పేటీఎం కొత్త ఆఫర్... కరెంట్ బిల్ కడితే క్యాష్‌బ్యాక్
(ప్రతీకాత్మక చిత్రం)

Paytm Cashback: పేటీఎం కొత్త ఆఫర్... కరెంట్ బిల్ కడితే క్యాష్‌బ్యాక్ (ప్రతీకాత్మక చిత్రం)

Paytm Cashback | పేటీఎంలో కరెంట్ బిల్ చెల్లిస్తే క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ కొత్త ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

    పేటీఎం యూజర్లకు శుభవార్త. కరెంట్ బిల్ కట్టేవారికి క్యాష్‌బ్యాక్ ప్రకటించింది పేటీఎం. క్యాష్‌బ్యాక్ ఆఫర్స్‌తో యూజర్లను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది పేటీఎం. ఇటీవల గ్యాస్ సిలిండర్ బుక్ చేసేవారికి రూ.900 వరకు క్యాష్‌బ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా మూడు నెలలు రూ.2,700 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఎలక్ట్రిసిటీ బిల్స్ పైనా పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం ద్వారా మొదటిసారి కరెంట్ బిల్ చెల్లిస్తే రూ.50 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇప్పటికే కరెంట్ బిల్స్ చెల్లిస్తున్నవారికి రివార్డ్స్ కూడా లభిస్తాయి. అన్ని రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ బోర్డుల బిల్ పేమెంట్స్‌కు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది.

    ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-APSPDCL, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-APEPDCL, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-APCPDCL బోర్డుల కరెంట్ బిల్స్ పేటీఎంలో చెల్లించొచ్చు. ఇక తెలంగాణలోని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-TSSPDCL, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్-TSNPDCL, కోఆపరేటీవ్ ఎలక్ట్రిక్ సప్లస్ సొసేటీ లిమిటెడ్ సిరిసిల్ల బోర్డుల కరెంట్ బిల్స్ పేటీఎంలో చెల్లించొచ్చు.

    Facebook Indifi: ఫేస్‌బుక్ కొత్త సర్వీస్... 5 రోజుల్లో రూ.50 లక్షల వరకు లోన్

    PF Withdrawal Rule: ఈపీఎఫ్ కొత్త రూల్స్... ఒక్క రోజులో రూ.1,00,000 క్లెయిమ్ సెటిల్

    పేటీఎం యాప్ ద్వారా కేవలం ఒక నిమిషంలోపే కరెంట్ బిల్ చెల్లించొచ్చు. పేటీఎం యాప్ ఓపెన్ చేసిన తర్వాత రాష్ట్రం పేరు సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత సర్వీస్ ప్రొవైడర్ పేరు సెలెక్ట్ చేయాలి. కస్టమర్ బిల్ నెంబర్ ఎంటర్ చేస్తే చెల్లించాల్సిన బిల్లు వివరాలు వస్తాయి. ఓసారి వివరాలన్నీ సరిచూసుకొని పేమెంట్ చేయాలి. బిల్ పేమెంట్ చేయడానికి పేటీఎం యూపీఐ, పేటీఎం వ్యాలెట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ పూర్తైన తర్వాత రిసిప్ట్ జనరేట్ అవుతుంది.

    LIC Policy: రోజూ రూ.29 పొదుపు చేస్తే రూ.4,00,000 మీవే... మహిళల కోసం ఎల్ఐసీ స్పెషల్ పాలసీ

    IRCTC Contest: ట్రైన్ జర్నీ ఇష్టమా? అయితే రూ.1,00,000 గెలుచుకోండి ఇలా

    ఒకసారి పేటీఎంలో కరెంట్ బిల్ చెల్లిస్తే ఆ తర్వాత చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించిన ఇన్ యాప్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. కరెంట్ బిల్ చెల్లించడం మర్చిపోయేవారికి నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. పేటీఎంలో బబిల్ పేమెంట్స్‌పై 10,000 క్యాష్‌బ్యాక్ పాయింట్స్ లభిస్తాయి. డీల్స్, గిఫ్ట్ వోచర్స్ కూడా పొందొచ్చు. క్యాష్‌బ్యాక్ పాయింట్స్‌ని ప్రముఖ బ్రాండ్ల గిఫ్ట్ వోచర్లకు రీడీమ్ చేసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: ELectricity, Paytm

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు