టెక్నాలజీ

  • Associate Partner
  • diwali-2020
  • diwali-2020
  • diwali-2020

Paytm Mall: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ల్యాప్‌టాప్‌లపై పేటీఎం మాల్‌‌లో భారీ డిస్కౌంట్స్

Paytm Mall Maha Shopping Festival | ఫెస్టివల్ సీజన్ సందర్భంగా పేటీఎం మాల్ మహా షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భారీ ఆఫర్స్ ఉన్నాయి.

news18-telugu
Updated: October 30, 2020, 6:51 PM IST
Paytm Mall: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ల్యాప్‌టాప్‌లపై పేటీఎం మాల్‌‌లో భారీ డిస్కౌంట్స్
Paytm Mall: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ల్యాప్‌టాప్‌లపై పేటీఎం మాల్‌‌లో భారీ డిస్కౌంట్స్ (image: Paytm Mall)
  • Share this:
దీపావళి సందర్భంగా పేటీఎం మాల్ ఫెస్టివల్ సేల్స్ ఆఫర్లను ప్రకటించింది. వర్క్ ఫ్రమ్‌ హోమ్ చేసేవారికి ల్యాప్‌టాప్‌లు అప్‌గ్రేడ్ చేసుకునేందుకు మంచి ఆఫర్లను ఆ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో కొత్త ల్యాప్‌టాప్‌కు అప్‌గ్రేడ్ అయ్యే ఆఫర్లు ఉన్నాయి. కొత్తగా విడుదల చేసిన కొన్ని హై ఎండ్ కంప్యూటర్లతో సహా ఇతర ల్యాప్‌టాప్‌లపై కూడా పేటీఎం మాల్ డిస్కౌంట్లను అందిస్తోంది. దీంతో పాటు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై రూ.5 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది.

ఆఫర్లు ఇవే...పేటీఎం మాల్‌లో అత్యధికంగా అమ్ముడైన ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దీనికి అదనంగా రూ .5 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లు ఫాస్టర్ CPU, GPU, లేటెస్ట్ SSD బేస్డ్ సొల్యూషన్స్‌ వంటి ఫీచర్లను అందిస్తున్నాయి.క్యాట్రిడ్జ్‌లు, ప్రింటర్లు, మానిటర్లు వంటి మరెన్నో కంప్యూటర్ యాక్సెసరీలపై భారీ డిసౌంట్‌ లభిస్తుంది. వీటిలో కొన్ని ఉత్పత్తులు కేవలం రూ.199కే అందుబాటులో ఉన్నాయి. కొత్త ప్రొజెక్టర్‌లపై MRP ధరల్లో 50 శాతం వరకు తగ్గింపు ఉంది. టాప్‌ బ్రాండ్లకు చెందిన ఈ ప్రొజెక్టర్లు 4కె నేటివ్ రిజల్యూషన్‌ను అందిస్తాయి. వీటిల్లో సినిమాలు, టీవీ షోలను చూసేటప్పుడు సరికొత్త అనుభూతిని పొందవచ్చు.

Realme C15: రియల్‌మీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్... కొత్త ఫీచర్స్‌తో మళ్లీ రిలీజైన రియల్‌మీ సీ15

Flipkart Big Diwali sale: మీ పాత ఫోన్ ఇస్తే సగం ధరకే iPhone SE కొనొచ్చు ఇలా

ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్‌లపై పేటీఎం మాల్ ఆఫర్లను ప్రకటించింది. ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ ఉండే ల్యాప్‌టాప్‌లపై MRPలో 25 శాతం వరకు తగ్గింపు ఉంది. ఎలాంటి సమస్యలూ లేకుండా రోజువారీ పనులు చేసుకోవడానికి ఈ ల్యాప్‌టాప్‌లు ఉపయోగపడతాయి. కాస్త తక్కువ ధరలో శక్తిమంతమైన ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ప్రత్యేక ఆఫర్ ఉంది. ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో పనిచేసే ఇలాంటి ల్యాప్‌టాప్లపై పేటీఎం మాల్ 35శాతం తగ్గింపు అందిస్తోంది. మల్టీ టాస్కింగ్‌ కోసం వీటిని ఎంచుకోవడం ఉత్తమం.

దీపావళి ఫెస్టివల్ సేల్‌లో కోర్ ఐ7 ప్రాసెసర్‌తో పనిచేసే హై ఎండ్ ల్యాప్‌టాప్లపై పేటీఎం మాల్‌ 30 శాతం తగ్గింపు ఇస్తోంది. AMD రైజెన్ ప్రాసెసర్‌లతో పనిచేసే ల్యాప్‌టాప్‌లను పేటీఎం మాల్లో 20 శాతం తగ్గింపుతో పొందవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: October 30, 2020, 6:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading