భారతదేశపు ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం తన సొంత మినీ యాప్ స్టోర్‌ను ప్రారంభించి గూగుల్‌కు షాకిచ్చింది. గాంబ్లింగ్ పాలసీలకు విరుద్ధంగా పేటీఎం పనిచేస్తుందని ఆరోపిస్తూ గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో పేటీఎం తానే స్వయంగా ఈ మినీ ప్లేస్టోర్‌ను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకుంది. కాగా ఈ మినీ యాప్ స్టోర్‌తో ప్రత్యేకంగా ఆయా యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వాటిని పేటీఎం యాప్ నుంచే డైరెక్ట్‌గా యాక్సెస్ చేయవచ్చు. దీంతో యూజర్ ఫోన్లో స్పేస్ ఆదా అవుతుంది. అంతేకాక దీనితో యాజర్ల డేటా మరియు బ్యాటరీ ఆదా అవుతుంది."‘గూగుల్ ప్లేస్టోర్‌కు ప్రత్యామ్నాయంగా ఈ భారతీయ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చాం. భారత్‌కు చెందిన ప్రతి యాప్ డెవలపర్‌కి అవకాశం కల్పించడంలో భాగంగానే ఈ మినీ పేటీఎం యాప్ స్టోర్‌ను ప్రారంభించాం" అని పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లకు ప్రత్యామ్నాయంగా భారతీయ కంపెనీలకు, యూజర్లకు దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు.
Android Apps: అలర్ట్... ఈ 34 యాప్స్‌లో జోకర్ మాల్వేర్... వెంటనే డిలిట్ చేయండి
Flipkart Sale: రూ.70,000 స్మార్ట్‌ఫోన్ ఆఫర్లో రూ.20,000 మాత్రమే... ఇలాంటి బంపరాఫర్ మళ్లీ రాకపోవచ్చు
అంతేకాక తక్కువ ఖర్చుతో HTML, జావా స్క్రిప్ట్ ఆధారంగా డెవలప్ చేసిన యాప్స్‌కి కూడా తమ ప్లేస్టోర్‌లో చోటు దక్కుతుందని పేటీఎం స్పష్టం చేసింది. పేటీఎం యాప్ స్టోర్‌కు భారతీయ కంపెనీల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే డెకాథ్లాన్, ఓలా, రాపిడో, నెట్‌మెడ్స్, 1 ఎంజి, డొమినోస్ పిజ్జా, ఫ్రెష్‌మెను, నోబ్రోకర్ వంటి 300లకు పైగా యాప్స్ తమ మినీ యాప్ స్టోర్‌లో చేరినట్లు పేటీఎం తెలిపింది. కాగా పేటీఎంలో కొత్తగా చేరే మినీ యాప్‌ల నుండి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయట్లేదని పేటీఎం పేర్కొంది. ఈ మినీ యాపస్లో వినియోగదారులకు పేటీఎం వాలెట్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ మరియు కార్డు చెల్లింపుల ఆప్షన్ ఇస్తుంది.
Flipkart Big Billion Days Sale: అక్టోబర్ 16 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్... ఆఫర్స్ ఇవే
Smartphone Price Hike: పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు... ఎప్పట్నుంచి అంటే
అంతేకాకుండా ఈ మినీ యాప్స్ కస్టమ్-మేడ్ మొబైల్ వెబ్సైట్లా పనిచేస్తాయి. ఇవి వినియోగదారులకు యాప్ వంటి అనుభవాన్నే ఇస్తాయి. కాగా డిజిటల్ పేమెంట్ సేవల్లో పేటీఎంకు గట్టిపోటీనిస్తున్న ఫోన్‌పే తన ఇన్-యాప్ ప్లాట్‌ఫామ్‌ను 2018 జూన్‌లోనే ప్రారంభించింది, తరువాత దీనిని గత ఏడాది అక్టోబర్‌లో ఫోన్‌పే స్విచ్‌కు రీబ్రాండ్ చేశారు. ఈ మినీ యాప్ స్టోర్‌ను పేటీఎం యాప్ మెయిన్ సెక్షన్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. దీని కోసం పేటీఎం యాప్ మధ్యలో ఉండే హోమ్ స్క్రీన్ సెక్షన్‌కి వెళ్లాలి. ఆ తర్వాత షో మోర్ ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ మినీ యాప్ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిలో షాపింగ్, ఫుడ్ డెలివరీ, హెల్త్‌కేర్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్, న్యూస్ అండ్ కంటెంట్, లైవ్ టివి వంటి మరెన్నో సేవలు అందుబాటులో ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Mobile App, Paytm, Playstore