PAYTM LAUNCHED MOBILE APP FOR PAYTM PAYMENTS BANK SERVICE YOU CAN DOWNLOAD FROM GOOGLE PLAYSTORE AND APP STORE SS
Paytm App: పేటీఎం యూజర్ల కోసం మరో యాప్... ఫీచర్లు ఇవే
Paytm Credit Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంత? పేటీఎంలో ఫ్రీగా తెలుసుకోండి ఇలా...
(ప్రతీకాత్మక చిత్రం)
Paytm Payments Bank Mobile App | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు అందరూ తప్పనిసరిగా ఈ యాప్ ఇన్స్టాల్ చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ యాప్ లేకుండా కూడా పేటీఎం యాప్ ద్వారా ఎప్పట్లాగే పేమెంట్స్ బ్యాంక్ సేవలు పొందొచ్చు.
పేటీఎం నుంచి మరో యాప్ వచ్చేసింది. మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాడుతున్నట్టయితే ఈ కొత్త యాప్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే పేటీఎం, పేటీఎం మనీ, పేటీఎం మాల్ లాంటి యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యాప్ కూడా చేరిపోయింది. 2017లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వీస్ మొదలైంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ యాప్ రిలీజ్ చేసింది పేటీఎం. మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే... ఇక బ్యాంకింగ్ సేవలన్నీ ఈ యాప్ నుంచే అందుకోవచ్చు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, డెబిట్ కార్డ్ సేవలు, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం లాంటి ఫీచర్లు వాడుకోవచ్చు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యాప్‌ను ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు తమ ఫోన్ నెంబర్‌తో లాగిన్ కావచ్చు. కొత్తవాళ్లు మాత్రం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. యాప్‌లో కేవైసీ వెరిఫికేషన్ చేస్తోంది పేటీఎం. ఆ తర్వాత ఇంటి దగ్గర వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు యాప్‌లోనే 24×7 కస్టమర్ అసిస్టెంట్ సేవలు లభిస్తాయి. అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు అందరూ తప్పనిసరిగా ఈ యాప్ ఇన్స్టాల్ చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ యాప్ లేకుండా కూడా పేటీఎం యాప్ ద్వారా ఎప్పట్లాగే పేమెంట్స్ బ్యాంక్ సేవలు పొందొచ్చు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో 4.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వారిలో 20 లక్షల మందికి ఫిజికల్ డెబిట్ కార్డులున్నాయి. పేటీఎం డెబిట్ కార్డును షాపింగ్ కోసం ఎక్కడైనా స్వైప్ చేసి వాడుకోవచ్చు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. ఇప్పటివరకు పేటీఎం డెబిట్ కార్డ్ లేని వాళ్లు... యాప్ ద్వారా కార్డ్ కోసం రిక్వెస్ట్ చేయొచ్చు. ఫిజికల్ డెబిట్ కార్డులకు ఛార్జీలు ఎప్పట్లాగే ఉంటాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్లపై వార్షికంగా 4 శాతం వడ్డీ లభిస్తుంది. కస్టమర్లు రూ.1 లక్ష వరకు డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ రూ.1 లక్ష దాటితే ఫిక్స్డ్ డిపాజిట్‌గా కన్వర్ట్ అవుతుంది. 8 శాతం వడ్డీ లభిస్తుంది.
Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.