Paytm First | పేటీఎం ఫస్ట్ కస్టమర్లు పేటీఎంతో పాటు పార్ట్నర్డ్ బ్రాండ్స్ నుంచి ప్రత్యేకమైన బెనిఫిట్స్ పొందొచ్చు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ సర్వీసులు ఉన్నాయి. వాటికి పోటీగా పేటీఎం ఇప్పుడు 'పేటీఎం ఫస్ట్' తీసుకొచ్చింది.
పేటీఎం నుంచి Paytm First పేరుతో లాయల్టీ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే జొమాటో, ఎరోస్ నౌ, సోనీ లైవ్, వ్యూ ప్రీమియం, ఊబెర్ లాంటి కంపెనీల పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ కవర్ అవుతాయి. కస్టమర్లను చేజార్చుకోకుండా, తిరిగి తమ దగ్గరే కొనేలా చేయడమే 'పేటీఎం ఫస్ట్' లక్ష్యం. 'పేటీఎం ఫస్ట్' సబ్స్క్రిప్షన్ ధర రూ.750. ప్రారంభ ఆఫర్ కింద రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. పేటీఎం ఫస్ట్ కస్టమర్లు పేటీఎంతో పాటు పార్ట్నర్డ్ బ్రాండ్స్ నుంచి ప్రత్యేకమైన బెనిఫిట్స్ పొందొచ్చు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ సర్వీసులు ఉన్నాయి. వాటికి పోటీగా పేటీఎం ఇప్పుడు 'పేటీఎం ఫస్ట్' తీసుకొచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పేటీఎం ఫస్ట్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌లో ఆన్-డిమాండ్ ఎంటర్టైన్మెంట్, టీవీ, లైవ్ క్రికెట్, మ్యూజిక్, షాపింగ్, మూవీస్, ఫుడ్ ఇలా అనేక లాభాలుంటాయి. సబ్స్క్రైబర్లకు 24x7 కస్టమర్ సపోర్ట్, పేటీఎం మాల్లో ప్రియార్టీ షాపింగ్, రూ.12,000 కన్నా ఎక్కువ విలువైన ఆఫర్లు, అదనంగా రూ.1.500 క్యాష్‌బ్యాక్, సినిమా టికెట్లపై ప్రతీ నెల రూ.100 చొప్పున క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. ఒక్క పేటీఎం మాత్రమే కాకుండా యాన్యువల్ సోనీ లైవ్ సబ్స్క్రిప్షన్, జొమాటో గోల్డ్ మెంబర్షిప్, యాన్యువల్ గానా మెంబర్షిప్, వ్యూ ప్రీమియం, ఎరోస్ నౌ యాన్యువల్ మెంబర్షిప్ బెనిఫిట్స్ లభిస్తాయి. దాంతో పాటు రూ.6,000 విలువైన ఊబెర్, రూ.2,400 విలువైన ఊబెర్ ఈట్స్ బెనిఫిట్స్ లభిస్తాయి.
Photos: రెడ్మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.