news18-telugu
Updated: December 2, 2020, 11:41 AM IST
Paytm: పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్... ఇక ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
(ప్రతీకాత్మక చిత్రం)
పేటీఎం ఉపయోగిస్తున్న వ్యాపారులకు శుభవార్త. పేటీఎం వ్యాలెట్ ద్వారా ఇకపై అన్లిమిటెడ్ పేమెంట్స్ స్వీకరించొచ్చు. ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 0 శాతం ఫీజుతో పేటీఎం వ్యాలెట్ ఉపయోగించుకోవచ్చని పేటీఎం ప్రకటించింది. అంతేకాదు యూపీఐ, రూపే కార్డ్స్ పేమెంట్స్‌కి కూడా ఫీజు తొలగించింది. పేటీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో 1.7 కోట్ల మంది వ్యాపారులకు మేలు జరుగుతుందని అంచనా. వీరంతా 0% ఫీజుతోనే డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. వారి బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా సెట్లిమెంట్ అవుతుంది. అంతేకాదు... దేశవ్యాప్తంగా వ్యాపారులు ఇక వేర్వేరు క్యూఆర్ కోడ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. పేటీఎం ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్ ప్రకటించింది. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ, ఇతర యూపీఐ యాప్‌లకు ఒకే క్యూఆర్ కోడ్ పనిచేస్తుంది.
Gold Price Today: ఈరోజు బంగారం రేట్ ఎంత? ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే తెలుస్తుందిJob Loss Insurance: ఉద్యోగం పోతే ఇన్స్యూరెన్స్... వారానికి రూ.1,00,000 వరకు బెనిఫిట్
చిరువ్యాపారులకు మేలు చేసేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటోంది పేటీఎం. కొద్ది రోజుల క్రితమే వ్యాపారులకు రుణాలను ప్రకటించింది. ఎలాంటి ష్యూరిటీ, పూచీకత్తు లేకుండా రూ.5,00,000 వరకు రుణాలు అందిస్తోంది. వడ్డీ రేటు కూడా తక్కువ. పేటీఎం బిజినెస్ యాప్‌లో 'మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్' ద్వారా ఈ రుణాలను అందిస్తోంది పేటీఎం. ప్రత్యేకంగా రూపొందించిన ఆల్గరిథమ్ వ్యాపారుల క్రెడిట్ హిస్టరీ, రోజువారీ ట్రాన్సాక్షన్స్ పరిశీలించి ప్రీ-క్వాలిఫైడ్ రుణాలను అందిస్తాయి. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష మందికి పైగా వ్యాపారులకు రూ.550 కోట్ల రుణాలను అందించింది పేటీఎం. 2021 మార్చి నాటికి రూ.1,000 కోట్ల రుణాలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఇచ్చేందుకు పేటీఎం సిద్ధంగా ఉంది.
EPFO Benefits: ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే ఈ 4 ప్రయోజనాలు మీకే
Indane Gas subsidy: ఇండేన్ గ్యాస్ సబ్సిడీ అకౌంట్లోకి రాకపోతే కంప్లైంట్ చేయండి ఇలా
చిరు వ్యాపారులకు ఇస్తున్న రుణాలు కాబట్టి రోజువారీగా ఈఎంఐ చెల్లించే అవకాశం కల్పిస్తోంది. వ్యాపారులు నెలకోసారి ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేకుండా రోజూ కొద్దికొద్ది మొత్తంలో ఈఎంఐ చెల్లించొచ్చు. వ్యాపారులు డిజిటల్ పేమెంట్స్ అంగీకరించేలా పేటీఎం ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల చిన్న, మధ్యతరహా వ్యాపారాలు, కిరాణా షాపులు, హోల్ సేల్ షాపులు, రీటైలర్లు డిజిటల్ పేమెంట్స్ స్వీకరిస్తున్నారు చేస్తున్నారు. ఒక్క పేటీఎం ప్లాట్ఫామ్లోనే 1.7 కోట్ల మంది వ్యాపారులు ఉన్నారు.
Published by:
Santhosh Kumar S
First published:
December 2, 2020, 11:41 AM IST