Passwords: ఈ పాస్‌వర్డ్స్ పెట్టుకుంటే ఈజీగా హ్యాక్ చేయొచ్చు... తేల్చి చెప్పిన మొజిల్లా ఫౌండేషన్

Passwords: ఈ పాస్‌వర్డ్స్ పెట్టుకుంటే ఈజీగా హ్యాక్ చేయొచ్చు... తేల్చి చెప్పిన మొజిల్లా ఫౌండేషన్ (ప్రతీకాత్మక చిత్రం)

Passwords | మీరు ఏదైనా అకౌంట్‌కు పాస్‌వర్డ్ క్రియేట్ చేశారా? పొరపాటున ఈ పాస్‌వర్డ్స్ (Password) వాడుతున్నారా? అయితే మీ అకౌంట్‌ను హ్యాకర్లు ఈజీగా హ్యాక్ చేస్తారు జాగ్రత్త. మరి ఎలాంటి పాస్‌వర్డ్స్ క్రియేట్ చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    ఆన్‌లైన్‌లో ప్రతీ అకౌంట్‌కు పాస్‌వర్డ్ పెట్టుకోవడం మామూలే. అయితే కొందరు అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్ (Password) పెట్టుకుంటారు. లేదా ఈజీగా గుర్తుండాలని సులువైన పాస్‌వర్డ్స్ పెట్టుకుంటారు. కొందరు మాత్రం తెలివిగా కఠినమైన పాస్‌వర్డ్స్ (strong password) సెట్ చేస్తుంటారు. అయితే తాము బాగా ఆలోచించి ఎవరూ గుర్తుపట్టలేని పాస్‌వర్డ్ పెట్టామని అనుకుంటారు కానీ... అంతకన్నా ఎక్కువ తెలివి ఉన్న హ్యాకర్లు సింపుల్‌గా పాస్‌వర్డ్ తెలుసుకొని అకౌంట్స్ హ్యాక్ చేస్తుంటారు. సూపర్‌హీరోల పేర్లను పాస్‌వర్డ్స్‌గా పెట్టుకుంటున్న అకౌంట్లు ఈజీగా హ్యాక్ అవుతున్నాయని మొజిల్లా ఫౌండేషన్ అధ్యయనంలో తేలింది. Haveibeenpwned.com వెబ్‌సైట్‌లోని డేటాను విశ్లేషిస్తే ఈ విషయం తెలిసింది. సూపర్‌హీరోల పేర్లతో ఉన్న పాస్‌వర్డ్స్‌ని హ్యాకర్లు ఈజీగా తెలుసుకోగలరని తేల్చింది.

    Realme GT Neo 2: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... తొలి సేల్‌లో రూ.7,000 డిస్కౌంట్

    పాస్‌వర్డ్స్‌గా పెట్టుకుంటున్న టాప్ 10 సూపర్ హీరోల పేర్లు చూస్తే Superman, Batman, Spider-Man, Wolverine, Iron Man, Wonder Woman, Daredevil, Thor, Black Widow, Black Panther పేర్లను పాస్‌వర్డ్స్‌గా పెట్టుకున్నారట. సూపర్ హీరోలు మాత్రమే కాదు... James Howlett/Logan, Clark Kent, Bruce Wayne, Peter Parker లాంటి పేర్లను కూడా పాస్‌వర్డ్స్‌గా పెట్టినవారి అకౌంట్స్ హ్యాక్ అయ్యాయని తేలింది. వీటిని ఈజీగా తెలుసుకొని అకౌంట్స్‌ని హ్యాక్ చేస్తున్నారు హ్యాకర్లు. అందుకే సూపర్ హీరోల పేర్లను పాస్‌వర్డ్స్‌గా పెట్టుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    WhatsApp: వాట్సప్ యూజర్లకు అలర్ట్... త్వరలో షాక్ ఇవ్వనున్న గూగుల్

    పాస్‌వర్డ్ మేనేజర్ అయిన నార్డ్‌పాస్ వార్షిక నివేదిక ప్రకారం 2020 లో ఎక్కువగా 123456 పాస్‌వర్డ్‌ని కామన్‌గా ఉపయోగించారట. ఈ పాస్‌వర్డ్ ఉన్న అకౌంట్స్ 2.3 కోట్ల సార్లు హ్యాక్ అయినట్టు తేలింది. ఆ తర్వాత 123456, 123456789 పాస్‌వర్డ్స్‌ ఉన్న అకౌంట్స్‌ని ఈజీగా హ్యాక్ చేశారు హ్యాకర్లు. నార్డ్‌పాస్ గుర్తించిన కామన్ పాస్‌వర్డ్స్‌లో 123456, 123456, 123456789, picture1, 111111, 1234, iloveyou, aaron431, password1, qqww1122 పాస్‌వర్డ్స్ ఉన్నాయి.

    Xiaomi 11 Lite 5G NE: రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.8299 ధరకే కొనండి ఇలా

    సులువుగా గుర్తుంటాయని 123456789, abcdefgh లాంటి సింపుల్ పాస్‌వర్డ్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇంత వీక్ పాస్‌వర్డ్ పెట్టుకుంటే మీ అకౌంట్ హ్యాక్ చేయడం హ్యాకర్లకు చాలా ఈజీ. పాస్‌వర్డ్స్ ఇతరులు గుర్తించలేనంత కఠినంగా ఉండాలి. సూపర్ హీరోల పేర్లు మాత్రమే కాదు... ఎవరూ పాస్‌వర్డ్స్‌గా తమ పేర్లను పెట్టుకోకూడదు. తమ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ లాంటి పాస్‌వర్డ్స్ పెట్టుకోవద్దు. పేర్లు, నెంబర్లు, క్యారెక్టర్లతో పాస్‌వర్డ్ క్రియేట్ చేయాలి. పాస్‌వర్డ్‌లో అప్పర్ కేస్, లోయర్ కేస్ తప్పనిసరిగా ఉండాలి.
    Published by:Santhosh Kumar S
    First published: