హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Passwordless Sign-ins: పాస్‌వర్డ్‌ లేకుండానే వెబ్‌సైట్లు, యాప్‌లకు సైన్-ఇన్.. అదెలా అంటే..

Passwordless Sign-ins: పాస్‌వర్డ్‌ లేకుండానే వెబ్‌సైట్లు, యాప్‌లకు సైన్-ఇన్.. అదెలా అంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డివైజ్‌లు, ప్లాట్‌ఫామ్‌ల అంతటా యూజర్ల కోసం ఈజీ & సెక్యూర్ అథెంటికేషన్ ఆప్షన్స్ అనుమతించే “పాస్‌వర్డ్‌లెస్ (Passwordless)” సైన్-ఇన్ ప్రమాణాలకు తాజాగా యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు తమ మద్దతును ప్రకటించాయి. ఆ వివరాలు..

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్‌లను(Internet Websites) లేదా ఏదైనా యాప్‌ను యాక్సెస్(Access) చేయాలంటే సైన్-ఇన్ (Sign-In) చేయడం తప్పనిసరి. ఒకవేళ పాస్‌వర్డ్‌(Password) త్వరగా గుర్తుకు రాకపోతే సైన్-ఇన్(Sign In) చేయలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే త్వరలో ఈ సమస్య పూర్తిగా తొలగిపోనుందని తెలుస్తోంది. దీనర్థం సమీప భవిష్యత్తులో వెబ్‌సైట్‌లు(Website), యాప్‌లలో సైన్-ఇన్ చేయడానికి పాస్‌వర్డ్‌లు టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే యూజర్లు తమ అకౌంట్లకు(Users Accounts) సైన్-ఇన్ చేయడానికి ఫింగ‌ర్‌ప్రింట్ వెరిఫికేషన్(Verification) వంటివి వాడవచ్చు. డివైజ్‌లు, ప్లాట్‌ఫామ్‌ల అంతటా యూజర్ల కోసం ఈజీ & సెక్యూర్ అథెంటికేషన్ ఆప్షన్స్ అనుమతించే “పాస్‌వర్డ్‌లెస్ (Passwordless)” సైన్-ఇన్ ప్రమాణాలకు తాజాగా యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు తమ మద్దతును ప్రకటించాయి.

ఫిడో అలయన్స్ (Fast Identity Online (FIDO) Alliance), వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం (World Wide Web Consortium) సంస్థలు ఈ పాస్‌వర్డ్‌లెస్ సైన్-ఇన్ స్టాండర్డ్స్ రూపొందించాయి. మరి ఈ పాస్‌వర్డ్‌లెస్ సైన్-ఇన్ స్టాండర్డ్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Explained : PPF అకౌంట్ అంటే ఏంటి..? PPF అకౌంట్‌ను ఎందుకు ఓపెన్ చేయాలి..? దీని ప్రయోజనాలు ఏవి..?


పాస్‌వర్డ్‌లను మరింత సెక్యూర్, ఎన్‌క్రిప్టెడ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్‌లతో రీప్లేస్ చేయాలని ఫిడో అలయన్స్ కృషి చేస్తోంది. అంటే ఇకపై వెబ్‌సైట్‌లు, యాప్‌లు ఎండ్-టు-ఎండ్ పాస్‌వర్డ్‌లెస్ ఆప్షన్లను అందిస్తాయి. అప్పుడు పాస్‌వర్డ్‌కు బదులుగా యూజర్లు ఫింగ‌ర్‌ప్రింట్ వెరిఫికేషన్ (Fingerprint Verification), ఫేస్ అన్‌లాక్ (Face Unlock) లేదా డివైజ్ పిన్ (Device Pin) ద్వారా సైన్ ఇన్ చేయడం సాధ్యమవుతుంది. "ఈ కొత్త విధానం ఫిషింగ్ అటాక్స్ నుంచి రక్షిస్తుంది. పాస్‌వర్డ్‌లతో పోల్చినప్పుడు సైన్-ఇన్ మరింత సురక్షితంగా ఉంటుంది.

పాస్‌వర్డ్-ఓన్లీ స్టాండర్డ్ అనేది వెబ్‌లో అతిపెద్ద సెక్యూరిటీ సమస్యలలో ఒకటి. చాలా పాస్‌వర్డ్‌లను గుర్తు పెట్టుకోవడం యూజర్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల యూజర్లు అన్నిటికీ ఒకటే పాస్‌వర్డ్ ఉపయోగిస్తారు. ఈ ఒకటే పాస్‌వర్డ్ సైబర్ నేరగాళ్లకు దొరికితే వారు అన్ని ఖాతాలను ఈజీగా టేకోవర్‌లు చేసుకునే ప్రమాదముంది. అంతేకాదు ఐడెంటిటీ దొంగలించే ప్రమాదం లేకపోలేదు. యాపిల్ ప్రకారం, ఈ కొత్త సైన్ ఇన్ స్టాండర్డ్ వెబ్‌సైట్‌లు, యాప్‌లు... డివైజ్‌లు, ప్లాట్‌ఫామ్‌లలోని యూజర్లకు స్థిరమైన, సురక్షితమైన, సులభమైన పాస్‌వర్డ్‌లెస్ సైన్-ఇన్‌లను అందించడానికి అనుమతిస్తుంది. ఈ సపోర్ట్ డిఫరెంట్ సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వెబ్ బ్రౌజర్‌లతో క్రాస్-ప్లాట్‌ఫామ్‌గా ఉంటుంది. పాస్‌వర్డ్-ఫ్రీ లాగిన్స్ మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటాయని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఈ ఫీచర్‌ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించాయని.. ఇప్పుడు అవి తమ ప్లాట్‌ఫామ్‌లు, సేవలకు దానిని విస్తరించనున్నట్లు తెలుస్తోంది.

UK Vs Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. యూకేపై అణు దాడి చేయాలని వ్యాఖ్యానించిన రష్యన్ స్టేట్ మీడియా..


ఫిడో లాగిన్ ప్రాథమికంగా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను అన్ని డిజిటల్ అకౌంట్ కోసం వన్-స్టాప్ లాగిన్ టూల్ గా ఉపయోగించడానికి అనుమతిస్తుంది. అంటే సమీప భవిష్యత్తులో, మీరు మీ ఫోన్ 4/6-అంకెల పాస్‌కోడ్, ఫింగర్ ఐడీ లేదా ఫేస్ ఐడీని ఉపయోగించి మీ జీమెయిల్ లేదా Outlook అకౌంట్ కు సైన్ ఇన్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఇదే జరిగితే పాస్‌వర్డ్‌ల వాడే కాలం పూర్తిగా పోతుంది. ఫిడో లాగిన్‌లను పాస్‌వర్డ్-ఫ్రీగా, డివైజ్‌ల ద్వారా మరింత సెక్యూర్ చేయడానికి పబ్లిక్-కీ క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తోంది. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ సేవల కోసం పాస్‌వర్డ్-ఫ్రీ మెకానిజంను ఏకీకృతం చేయడానికి ఇప్పటికే తెరవెనుక పని చేయడం ప్రారంభించాయి. ఇది ఒకటి లేదా రెండేళ్లలో యూజర్లకు అందుబాటులోకి రావచ్చు.

First published:

Tags: 5g technology, Apple, Google, New technology, Password

ఉత్తమ కథలు