Home /News /technology /

PARTICIPATE IN AUGUST 12 AMAZON QUIZ WITH THESE ANSWERS AND GET A CHANCE TO SAMSUNG GALAXY NOTE 10 SS

Amazon Quiz: ఈ 5 ప్రశ్నలకు సమాధానాలు చెప్తే సాంసంగ్ గెలాక్సీ నోట్ 10 గెలుచుకునే ఛాన్స్

Amazon Quiz: ఈ 5 ప్రశ్నలకు సమాధానాలు చెప్తే సాంసంగ్ గెలాక్సీ నోట్ 10 గెలుచుకునే ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Amazon Quiz: ఈ 5 ప్రశ్నలకు సమాధానాలు చెప్తే సాంసంగ్ గెలాక్సీ నోట్ 10 గెలుచుకునే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

August 12 Amazon Quiz | అమెజాన్ క్విజ్‌లో సాంసంగ్ గెలాక్సీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ గెలుచుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

    ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రతీ రోజూ వేర్వేరు క్విజ్ కాంపిటీషన్స్‌తో యూజర్లకు ప్రైజుల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ క్విజ్ పోటీలో సరైన సమాధానాలు చెప్పినవారు సాంసంగ్ గెలాక్సీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ గెలుచుకోవచ్చు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ క్విజ్ ఉంటుంది. 5 ప్రశ్నలు ఉంటాయి. వాటికి సరైన సమాధనాలు చెప్తే ప్రైజ్ గెలుచుకోవచ్చు. రోజూ వేర్వేరు ప్రైజుల్ని ప్రకటిస్తుంది అమెజాన్. ఇవాళ సాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్రకటించింది. యూజర్లు 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి ఈ ఫోన్ గెలుచుకునే అవకాశాలు పెంచుకోవచ్చు. ఇవాళ అడిగిన 5 ప్రశ్నల్లో మొదటి రెండు ప్రశ్నలు తెలంగాణకు సంబంధించినవి ఉండటం విశేషం. మరి ఆ ప్రశ్నలతో పాటు సమాధానాలు కూడా తెలుసుకొని మీ లక్ ట్రై చేయండి.

    Smartphone: కొత్త ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    WhatsApp Banking: మీ వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవల్ని పొందండి ఇలా...

    Question 1: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూతురు బషీరున్నీసా బేగం భారతదేశంలో ఏ రాచరిక కుటుంబానికి చెందినవారు?
    Answer: హైదరాబాద్ నిజాం నవాబులు

    Question 2: కరోనా వైరస్ పేషెంట్ల కోసం హితం (HITAM) పేరుతో యాప్ లాంఛ్ చేసిన రాష్ట్రం ఏది?
    Answer: తెలంగాణ

    Question 3: ఇటీవల విస్డెన్ ట్రోఫీలో స్టువార్ట్ బ్రాడ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్న మరో ప్లేయర్ ఎవరు?
    Answer: రోస్టన్ ఛేస్

    Question 4: ఇండియాకు వచ్చిన రాఫెల్ జెట్స్ ఏ దేశానికి చెందినవి?
    Answer: ఫ్రాన్స్

    Question 5: వాతావరణ మార్పు అంశంపై యూఎన్ సెక్రెటరీ జనరల్ యూత్ అడ్వైజరీ గ్రూప్‌లో చేరిన భారతీయ యువతి ఎవరు?
    Answer: అర్చనా సోరెంగ్

    WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... మరో కొత్త ఫీచర్

    Smartphone: ఆగస్టులో రూ.10,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    ఈ ఐదు ప్రశ్నలకు ఈ సరైన సమాధానాలు చెప్పి ప్రైజ్ గెలుచుకోవడానికి మీరూ రేస్‌లో నిలవొచ్చు. మీరూ ఈ క్విజ్‌లో పాల్గొనాలంటే అమెజాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. లాగిన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ పైన అమెజాన్ క్విజ్ బ్యానర్ పైన క్లిక్ చేయాలి. లేదా టాప్ లెఫ్ట్‌లో త్రీ లైన్స్ క్లిక్ చేస్తే ఫన్ జోన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఫన్ జోన్ క్లిక్ చేస్తే క్విజ్ బ్యానర్ కనిపిస్తుంది. ఐదు ప్రశ్నలుంటాయి. ప్రతీ ప్రశ్నకు నాలుగు సమాధానాలు ఉంటాయి. అందులో ఒకటి మాత్రమే సరైన సమాధానం. అన్నీ సరైన సమాధానాలు చెప్తే లక్కీ డ్రాకు ఎంపికవుతారు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Amazon, AMAZON INDIA, AMAZON PAY, Amazon prime, Samsung, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు