ఓ సారి మీ పూర్తి పేరును లేదా మీ పిల్లల పేరును గూగుల్ సర్చ్‌లో కొట్టండి.. మీకు సంబంధించిన ఫోటోలు(Photos) ఏమీ రాకుంటే పర్వాలేదు. కానీ మీకు సంబంధించిన ఏదో ఒక ఫోటో కనిపిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా వచ్చే ఫోటోలను ఎవరైన దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కావున ఇలా ఫోటోలు రాకుండా చూసుకోవాలి. మీ ఫోటోలు ఇలా రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మీకు ఫోటోలు ఏదైనా జాబ్ పోర్టల్(Job portal)లో అప్లోడ్ చేసినప్పుడు, ఫేస్బుక్(Facebook), ఇన్స్టాగ్రామ్(Instagram)లో ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ ఫోటోలను తొలగించ వచ్చు.
పిల్లల ఫోటోలూ తొలగించొచ్చు..
ముందుగా గూగుల్ సెర్చ్‌లో వచ్చిన మీ ఫొటోపై క్లిక్ చేసి ఫీడ్‌బ్యాక్(Feedback)లో కారణం వెల్లడించి ఫొటోను తొలగించుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ అవకాశం కేవలం పెద్దలకు మాత్రమే ఈ అవకాశం ఉండేది ఇకపై పిల్లల ఫోటోలను పెరెంట్స్ తొలగించుకోవచ్చు. తాజాగా గూగుల్ 18 ఏళ్ల లోపు యూజర్ల ఫోటోలను పేరెంట్స్ తొలగించే అవకాశాన్ని ఇస్తోంది. ప్రస్తుతం చిన్నారులు కూడా సోషల్ మీడియా ఎక్కువగా వాడుతున్నారు. చాలా చోట్ల ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. దీంతో సర్చ్ ఇంజన్లో పేరు కొట్టగానే ఫోటోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ ఫోటోలను పలువురు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్(Google) ఈ నిర్ణయం తీసుకొంది. చిన్నారుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వారి జీవితాన్ని ఇబ్బందుల పాలు కాకుండా ఉండేందుకే ఫోటో ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ఫోటోను తొలగించే అవకాశం ఇస్తోంది. ఈ ఫీచర్(Feature) అతి త్వరలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు గూగల్ వెల్లడించింది. ఇక ఆలస్యం ఎందుకు మీ పిల్లల ఫోటోలు ఏమైనా ఉన్నాయేమో చూసి వాటిని తొలగించండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google search