మీ పిల్లలు ఫోన్‌లో ఏం చూస్తున్నారు? 'ఫ్యామిలీ లింక్' యాప్‌తో తెలుసుకోవచ్చు

పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు కూడా 'ఫ్యామిలీ లింక్' యాప్‌ ఉపయోగపడుతుంది. పిల్లలు ఉన్న లొకేషన్‌ని ట్రాక్ చేయొచ్చు. వీటితో పాటు అనేక ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ పిల్లల చేతిలో ఉన్నా... కంట్రోల్ చేసేది మాత్రం తల్లిదండ్రులే.

news18-telugu
Updated: December 25, 2018, 12:23 PM IST
మీ పిల్లలు ఫోన్‌లో ఏం చూస్తున్నారు? 'ఫ్యామిలీ లింక్' యాప్‌తో తెలుసుకోవచ్చు
మీ పిల్లలు ఫోన్‌లో ఏం చేస్తున్నారు? 'ఫ్యామిలీ లింక్' యాప్‌తో తెలుసుకోవచ్చు
  • Share this:
స్మార్ట్‌ఫోన్ కనిపిస్తే చాలు అస్సలు వదలరు పిల్లలు. మొదట్లో పిల్లల్ని నవ్వించడానికో, బుజ్జగించడానికో తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ అలవాటు చేస్తారు. ఆ తర్వాత పిల్లలకు స్మార్ట్‌ఫోన్ వ్యసనంగా మారిపోతుంది. ఇక వాళ్ల ఏడుపు భరించలేక ఫోన్ పిల్లల చేతికి ఇచ్చేసి తల్లిదండ్రులు తమ పనుల్లో మునిగిపోతారు. చిన్న వయస్సులోనే స్మార్ట్‌ఫోన్ కొనిచ్చేస్తారు. మరి పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోరు. అయితే పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ఓ యాప్ వచ్చింది. గూగుల్ రిలీజ్ చేసిన 'ఫ్యామిలీ లింక్' యాప్ తల్లిదండ్రులకు బాగా ఉపయోగపడుతుంది. మరి ఆ యాప్ ఎలా వాడాలో తెలుసుకోండి.మీ పిల్లలు ఫోన్‌లో ఏం చేస్తున్నారు? 'ఫ్యామిలీ లింక్' యాప్‌తో తెలుసుకోవచ్చు | Parents can control children's smartphone usage with 'Google Family Link' App

ఫ్యామిలీ లింక్... గూగుల్ రిలీజ్ చేసిన యాప్ ఇది. వాస్తవానికి 2017లోనే అమెరికాలో ఈ యాప్ రిలీజ్ చేసింది గూగుల్. ఇటీవలే ఇండియాలో లాంఛ్ చేసింది. పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువగా ఏం చూస్తున్నారు? ఎలాంటి యాప్స్ ఎక్కువగా వాడుతున్నారు? అన్న వివరాలు పూర్తిగా తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా పిల్లల స్మార్ట్‌ఫోన్ యాక్టివిటీకి సంబంధించి వీక్లీ, మంత్లీ యాక్టివిటీ రిపోర్ట్స్ కూడా పొందొచ్చు. అంతే కాదు... పిల్లలు ఇంటర్నెట్ అతిగా వాడకుండా నియంత్రించొచ్చు. ఫ్యామిలీ లింక్ యాప్ ద్వారా ఏ డివైజ్‍‌నైనా కంట్రోల్ చేయొచ్చు.

మీ పిల్లలు ఫోన్‌లో ఏం చేస్తున్నారు? 'ఫ్యామిలీ లింక్' యాప్‌తో తెలుసుకోవచ్చు | Parents can control children's smartphone usage with 'Google Family Link' App

స్మార్ట్‌ఫోన్‌లో పిల్లలు మంచి కంటెంట్ చూసేలా ప్రోత్సహించొచ్చు. పిల్లలు ఏదైనా కొత్త యాప్ ట్రై చేయాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. ఏ యాప్ ఎంతసేపు చూడాలో నియంత్రించొచ్చు. స్క్రీన్ టైమ్ సెట్ చేస్తే ఆ తర్వాత ఆ యాప్ లాక్ అవుతుంది. లేదా మీరే రిమోట్‌లో లాక్ చేయొచ్చు. పిల్లలకు ఎలాంటి యాప్స్ మంచివో చెప్పే టీచర్-రికమండెడ్ యాప్స్ ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేసిస్తే వినోదం, విజ్ఞానం సొంతమవుతాయి. ఫోన్‌లో ఉన్న ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ డిసేబుల్ చేయలేరన్న విషయం గుర్తుంచుకోండి.

మీ పిల్లలు ఫోన్‌లో ఏం చేస్తున్నారు? 'ఫ్యామిలీ లింక్' యాప్‌తో తెలుసుకోవచ్చు | Parents can control children's smartphone usage with 'Google Family Link' App

పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు కూడా 'ఫ్యామిలీ లింక్' యాప్‌ ఉపయోగపడుతుంది. పిల్లలు ఉన్న లొకేషన్‌ని ట్రాక్ చేయొచ్చు. వీటితో పాటు అనేక ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ పిల్లల చేతిలో ఉన్నా... కంట్రోల్ చేసేది మాత్రం తల్లిదండ్రులే. దీని ద్వారా పిల్లలు దారి తప్పకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడొచ్చు. మరి మీరు కూడా ఆ యాప్ ట్రై చేయాలంటే ఈ ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:Tax Saving Ideas: పన్నులు ఆదా చేసే మార్గాలు ఇవే...

ALERT: జనవరి 1 తర్వాత ఆ చెక్కులు చెల్లవు

Good News: రూ.101 ధరకే వివో స్మార్ట్‌ఫోన్

#FlashBack2018: ఈ ఏడాది టాప్-10 గేమ్స్ ఇవే... మీరెన్ని ఆడారు?

ALERT: త్వరలో మీ డ్రైవింగ్ లైసెన్స్ మారనుంది తెలుసా?

క్రెడిట్ కార్డ్ లిమిట్ మరీ ఎక్కువగా వాడేస్తున్నారా? అయితే రిస్కే
First published: December 25, 2018, 12:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading