హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Parag Agrawal: గూగుల్​ ట్రెండింగ్​లో ట్విట్టర్​ కొత్త సీఈవో పరాగ్​ అగర్వాల్​.. అతని గురించి భారతీయ నెటిజన్లు ఏం వెతికారో​ తెలుసా?

Parag Agrawal: గూగుల్​ ట్రెండింగ్​లో ట్విట్టర్​ కొత్త సీఈవో పరాగ్​ అగర్వాల్​.. అతని గురించి భారతీయ నెటిజన్లు ఏం వెతికారో​ తెలుసా?

పరాగ్​ అగర్వాల్​

పరాగ్​ అగర్వాల్​

ట్విట్టర్​ సీఈవోగా పరాగ్ నియామకం పూర్తవ్వడంతో భారతీయులంతా గర్విస్తున్నారు. అతని గురించి తెలుసుకునేందుకు గూగుల్ (google)​లో తెగ వెతికేస్తున్నారు (searching). అయితే గూగుల్ సెర్చ్‌ (google search)లలో పరాగ్ అగర్వాల్ గురించి నెటిజన్లు ఏమేం వెతుకుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఇంకా చదవండి ...

మైక్రో బ్లాగింగ్​ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ట్విట్టర్​ సీఈవో (Twitter CEO) పదవి నుంచి జాక్​ డోర్సే వైదొలగగా, నూతన సీఈవోగా కంపెనీ చీఫ్​ టెక్నాలజీ ఆఫర్ పరాగ్​ అగర్వాల్​ నియమితులయ్యారు. భారత్​లో పుట్టిన పరాగ్​ అగర్వాల్ Parag Agarwal)​.. బాంబే ఐఐటీ (IIT Bombay)లో బీటెక్​ ఇన్​ కంప్యూటర్​ సైన్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత స్టాన్​ఫర్డ్​ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్​ అందుకున్నారు. 2011 అక్టోబర్​​లో ట్విట్టర్​లో పరాగ్ అగర్వాల్​ చేరారు. నాటి నుంచి సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ట్విట్టర్ (Twitter)​లో చేరక ముందు ఆయన మైక్రోసాఫ్ట్ రీసెర్చ్​, యాహూ (Yahoo)లో సేవలందించారు. అయితే, ట్విట్టర్​లో చేరిన 11 ఏళ్లలోనే పరాగ్​ సీఈవో (CEO) స్థాయికి ఎదగడం విశేషం. దీంతో టెక్​ దిగ్గజ కంపెనీల పగ్గాలు చేపట్టిన భారతీయుల జాబితాలో పరాగ్​ చేరారు. ఇప్పటికే, గూగుల్ సీఈవో (Google CEO)గా సుందర్​ పిచాయ్​, మైక్రోసాఫ్ట్ (Microsoft)​ సీఈవోగా సత్య నాదెళ్ల నియమితులై భారతీయుల సత్తా చాటారు. ఇప్పుడు ట్విట్టర్​ సీఈవోగా పరాగ్ నియామకం పూర్తవ్వడంతో భారతీయులంతా గర్విస్తున్నారు. అతని గురించి తెలుసుకునేందుకు గూగుల్ (google)​లో తెగ వెతికేస్తున్నారు (searching).

* ‘దయచేసి మా అకౌంట్లకు బ్లూ టిక్​ ఇప్పించండి’..

గూగుల్ సెర్చ్‌ (google search)లలో పరాగ్ అగర్వాల్ గురించి నెటిజన్లు ఏమేం వెతుకుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!. ఎందుకంటే, పరాగ్​ వృత్తి పరమైన విషయాల కంటే వ్యక్తిగత విషయాలు (personal matters) తెలుసుకునేందుకే భారతీయ నెటిజన్లు ఎక్కువ ఆసక్తి కనబర్చారు. పరాగ్​ జీతం (Parag salary) ఎంత? ఐఐటి ర్యాంకు (IIT Rank) ఎంత? పరాగ్ వయస్సు (Parag Age) ఎంత? పరాగ్​ భార్య (Parag wife) ఎవరు?  వంటి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. ఈ ప్రశ్నలు గూగుల్​ ట్రెండ్ (google Trend)​గా నిలిచాయి.

మరికొంత మంది నెటిజన్లు (netizens) ఓ అడుగు ముందుకేసి.. ట్విట్టర్​ ఫాలోవర్స్​ను ఎలా పెంచుకోవాలి? దయచేసి మా అకౌంట్​కు బ్లూ టిక్‌ (blue tick) ఇవ్వండి అని పరాగ్​ను ట్యాగ్​ చేస్తూ ట్వీట్ చేయడం ప్రారంభించారు. ఇలా కేవలం సహాయం అడగటంతో ఆగిపోలేదు.. పరాగ్​ను ఎలా కలవాలో చెప్పాల్సిందిగా పరాగ్​ భార్య వినిత (Vineeta)ను రిక్వెస్ట్ చేశారు. పరాగ్​కు చెప్పి మా ఖాతాలకు ఎక్కువ మంది ఫాలోవర్స్​ వచ్చేలాగా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విచిత్రమైన అభ్యర్థనలు పరాగ్​ భార్య ముందుంచారు.

నెటిజన్లు ఎక్కువగా వెతికిన ప్రశ్నలకు సమాధానాలు పరిశీలిస్తే.. ప్రస్తుత ట్విట్టర్ బాస్ ఐఐటీ ప్రవేశ పరీక్షలో 77వ ర్యాంక్‌ను సాధించారు. అతను ఐఐటీ బొంబాయి నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్​ ఇంజనీరింగ్‌లో బీటెక్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్​డీ (PhD in Computer science) పట్టా పొందారు. 2011లో ట్విట్టర్‌లో చేరడానికి ముందు మైక్రోసాఫ్ట్, AT&T ల్యాబ్స్, యాహూలో కొద్దికాలం పనిచేశారు.

First published:

Tags: Full salary, Google search, IIT Bombay, Trending news, Twitter, Wife