Panasonic: పానసోనిక్ నుంచి కొత్త ఆండ్రాయిడ్​ స్మార్ట్​టీవీ​... ధర, ఫీచర్ల వివరాలివే

Panasonic: పానసోనిక్ నుంచి కొత్త ఆండ్రాయిడ్​ స్మార్ట్​టీవీ​... ధర, ఫీచర్ల వివరాలివే (image: Panasonic)

Panasonic Smart Tv | పానసోనిక్ ఇండియా కొత్త లైనప్‌లో మరిన్ని స్మార్ట్ టీవీలను ఇండియాలో లాంఛ్ చేసింది. వాటి ధరలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల సంస్థ పానసోనిక్ ఇండియా కొత్త ఆండ్రాయిడ్ టీవీలను అందుబాటులోకి తెచ్చింది. జేఎస్​, జేఎక్స్​ సిరీస్​లో కొత్త స్మార్ట్​టీవీలను విడుదల చేసింది. 32 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు 11 కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. 4 కె, స్మార్ట్ టివి పోర్ట్‌ఫోలియోలో ఈ 11 మోడళ్లు లభిస్తాయి. జెఎక్స్ 850, జెఎక్స్ 750, జెఎక్స్ 650, జెఎస్ 650 పేర్లతో ఇవి విడుదలయ్యాయి. ఇవన్నీ భారతదేశంలోనే తయారవ్వడం విశేషం. ఈ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్​టీవీలు అన్ని పానసోనిక్​, రిటైల్ దుకాణాల్లో లభిస్తాయని పానసోనిక్​ ఒక ప్రకటనలో తెలిపింది. కొనుగోలుదారులు దీర్ఘకాలిక ఫైనాన్స్ పథకాలను కూడా ఎంచుకోవచ్చని తెలిపింది. జేఎస్​ సిరీస్ స్మార్ట్​టీవీల ధర రూ.25,490 నుండి మొదలవుతుంది. జేఎక్స్​ సిరీస్ ధర రూ. 50,990 నుంచి ప్రారంభమవుతుంది.

కొత్త పానసోనిక్ ఆండ్రాయిడ్ టివిలలో సూపర్ బ్రైట్ ప్లస్, అక్యూవ్యూ డిస్​ప్లే, వైడ్ కలర్ గామ్యుట్​, హెక్సా క్రోమా డ్రైవ్, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లను చేర్చింది. వీటిని మిరాయ్ యాప్​ ద్వారా కంట్రోల్​ చేయవచ్చు. మిరాయ్​ యాప్​తో యూజర్లు పానసోనిక్​ ఎసి, స్మార్ట్ డోర్బెల్స్ వంటి డివైజెస్​ను కూడా కంట్రోల్​ చేయవచ్చు. ఈ స్మార్ట్​టీవీల్లో బిల్ట్​ ఇన్​ గూగుల్ అసిస్టెంట్​ను అందించింది. ఈ గూగుల్​ అసిస్టెంట్​ ఫీచర్​ అలెక్సాతో పనిచేస్తుంది. JX850 సిరీస్ హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్​ను కూడా చేర్చింది.

Airtel Plan: ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్... అన్ని సర్వీసులకు ఒకే ప్లాన్

BSNL Plan: బీఎస్ఎన్ఎల్‌లో రూ.100 లోపే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

ఈ సరికొత్త టీవీలపై పానసోనిక్ ఇండియా సిఎస్‌డి డివిజనల్ హెడ్ సుగురు తకామాట్స్​ మాట్లాడుతూ “పానసోనిక్ తన పోర్ట్‌ఫోలియోలో కొత్త టీవీలను జోడించాం. వినియోగదారులకు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని వారికి మెరుగైన సేవలు అందిస్తాం. కరోనా మహమ్మారి కారణంగా ‘హోమ్- యాజ్​ ఎ- హబ్’ ధోరణి పెరిగింది. వినియోగదారులు ఇంట్లోనే థియేటర్ లాంటి వినోదం కోసం చూస్తున్నారు. తద్వారా OTT కంటెంట్​కు ఆదరణ పెరుగుతోంది. అందువల్లే, వారి అభిరుచికి తగ్గట్లు కొత్త టీవీలను లాంచ్​ చేశాం.” అని అన్నారు.

Amazon Price Error: రూ.96,700 విలువైన ఇన్వర్టర్ ఏసీ రూ.5900 ధరకే... ప్రైస్ ఎర్రర్‌తో లాభపడిన కస్టమర్లు

Amazon Prime Subscription: 50 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోండి ఇలా

రెండు సిరీస్​లలో 11 వేరియంట్లు..


పానసోనిక్ ఇండియా సిఈ ప్రొడక్ట్ కేటగిరీ చీఫ్ విశాల్ కన్వాల్ మాట్లాడుతూ “జెఎస్, జెఎక్స్ సిరీస్‌ ఆండ్రాయిడ్ టీవీలతో, మా వినియోగదారులకు అద్బుతమైన వీక్షణ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నూతన ఉత్పత్తుల్లో ముందు వరుసలో ఉన్న JX850, బెజెల్-తక్కువ సొగసైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. సూపర్ బ్రైట్ ప్లస్, హెక్సా క్రోమా డ్రైవ్,- డైనమిక్ పిక్చర్ క్వాలిటీ, డాల్బీ అట్మోస్ వంటి అద్భుతమైన ఫీచర్లతో వీటిని విడుదల చేశాం. దీనిలో అన్​లిమిటెడ్​ OTT కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి రిమోట్ వాయిస్ కమాండ్ కంట్రోల్​ను కూడా అందించాం.” అని అన్నారు. JS సిరీస్​కు చెందిన JS660, JS560 మోడళ్లు- ఆడియో బూస్టర్ + టెక్నాలజీ, వివిడ్ డిజిటల్ ప్రోతో కూడిన షార్ప్​ సౌండ్ అండ్ పిక్చర్ క్వాలిటీని అందిస్తాయని ఆయన తెలిపారు.
Published by:Santhosh Kumar S
First published: