టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ప్రభుత్వ సేవలు పొందడం కూడా సులువైపోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవల్ని స్మార్ట్‌ఫోన్‌లో చిటికెలో పొందొచ్చు. అలాగే ఇతర సేవలు కూడా స్మార్ట్‌ఫోన్‌లో పొందడం చాలా ఈజీ. పాన్ కార్డ్ నుంచి పాస్‌పోర్ట్ వరకు అనేక ముఖ్యమైన సేవల్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉమాంగ్ యాప్ రూపొందించింది. ఉమాంగ్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్-UMANG. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించాయి. కేంద్ర ప్రభుత్వ సేవలు మాత్రమే కాదు... రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించిన సేవలు ఏవైనా ఇందులో పొందొచ్చు. మరి ఇందులో యూజర్లకు అందే ముఖ్యమైన సేవల గురించి తెలుసుకోండి.
EPFO: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? మీ పీఎఫ్‌కు సంబంధించిన సేవల్ని ఉమాంగ్ యాప్‌లో పొందొచ్చు. పాస్‌బుక్ చూడటం, క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టడం, క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవడం, ఈపీఎఫ్ఓ అకౌంట్ వివరాలను ఎస్ఎంఎస్లో పొందడం లాంటివన్నీ ఈ యాప్ ద్వారా సాధ్యం. అంతేకాదు... ఈపీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ నెంబర్ లింక్ చేయాలన్నా ఈ యాప్ ద్వారా సాధ్యమే.
My PAN: మీరు కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా? ఉమాంగ్ యాప్‌లో అప్లై చేయొచ్చు. అంతేకాదు... ఆన్లైన్లో పేమెంట్ చేయడంతో పాటు మీ పాన్ కార్డ్ స్టేటస్ కూడా సులువుగా తెలుసుకోవచ్చు.
ESIC: ఈఎస్ఐ ఉన్న వారు ఉమాంగ్ యాప్‌లో తమ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ అకౌంట్‌కు లాగిన్ కావొచ్చు. ఈఎస్ఐసీ కేంద్రాలను సెర్చ్ చేయడంతో పాటు కంప్లైంట్స్ కూడా ఇవ్వొచ్చు.
Passport Seva: మీరు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేశారా? ఉమాంగ్ యాప్‌లో స్టేటస్ తెలుసుకోవచ్చు. పాస్‌పోర్ట్ కేంద్రాలను సెర్చ్ చేయడంతో పాటు అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు.
Cybercrime: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినవారు ఉమాంగ్ యాప్ ద్వారా సైబర్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వొచ్చు. తమ కంప్లైంట్ స్టేటస్ కూడా ట్రాక్ చేయొచ్చు.
DigiLocker: మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ లాంటివి డిజీలాకర్‌లో సేవ్ చేసుకున్నారా? వాటిని యాక్సెస్ చేయడానికి మీరు డిజీలాకర్ యాప్ వాడాల్సిన అవసరం లేదు. ఉమాంగ్ యాప్‌లో కూడా మీ డిజీలాకర్ అకౌంట్ లాగిన్ చేయొచ్చు.
Bharat BillPay: మీ కరెంట్ బిల్, వాటర్ బిల్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ బిల్, బ్రాండ్‌బ్యాండ్ బిల్, గ్యాస్ బిల్ చెల్లించడానికి ఉమాంగ్ యాప్‌ని ఉపయోగించుకోవచ్చు.
Khoya Paya: తప్పిపోయిన పిల్లల్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు కేంద్ర మహిళా మంత్రిత్వ శాఖ 'ఖోయా పాయా' పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. పిల్లలు తప్పిపోయినా, తప్పిపోయిన పిల్లలు కనిపించినా ఉమాంగ్ యాప్‌లో రిపోర్ట్ చేయొచ్చు.
TRAI: మీ కాల్ క్వాలిటీ ఎలా ఉంది? మొబైల్ డేటా స్పీడ్ ఎంత? లాంటివి కూడా ఉమాంగ్ యాప్‌లో తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ డిఎన్డీ రిజిస్టర్ చేసుకోవచ్చు.
Weather: మీరు ఉన్న ప్రాంతం లేదా మీరు ప్రయాణించాలనుకునే ఊళ్లో వాతావరణం ఎలా ఉందో కూడా ఉమాంగ్ యాప్‌లో తెలుసుకోవచ్చు.
ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
SBI Salary Account: ఎస్బీఐలో సాలరీ అకౌంట్ తీసుకుంటే బెనిఫిట్స్ ఇవే...
Aadhaar Address: ఆధార్‌లో చిరునామా మార్చాలా? ఈ 45 అడ్రస్ ప్రూఫ్స్ ఇవ్వొచ్చు
Savings Account: బ్యాంకులో అకౌంట్ ఉందా? ఈ టిప్స్‌తో మీ డబ్బులు సేఫ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar, Aadhaar card, AADHAR, CYBER CRIME, EPFO, ESIC, PAN, PAN card, Passport, TRAI, UIDAI