హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Pakistan Bans TikTok: టిక్‌టాక్‌కు మరో షాక్.. పాకిస్తాన్‌లో కూడా నిషేధం

Pakistan Bans TikTok: టిక్‌టాక్‌కు మరో షాక్.. పాకిస్తాన్‌లో కూడా నిషేధం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే భారత్, అమెరికాలు టిక్‌టాక్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ కూడా టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే భారత్, అమెరికాలు టిక్‌టాక్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ కూడా టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్‌లో సమాజంలోని పలు వర్గాల నుంచి ఫిర్యాదులు రావడంతో టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూన్నట్టు పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. టిక్‌టాక్ యాప్‌లో షేర్ అవుతున్న అనైతిక, అసభ్యకరమైన కంటెంట్ గురించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని పీటీఏ ఆ ప్రకటనలో పేర్కొంది.

చట్టవిరుద్దమైనటువంటి అనైతిక, అసభ్యకరమైన కంటెంట్‌ను నియంత్రించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పరుచుకోవాలని టిక్‌టాక్‌ను పదేపదే కోరామని.. కానీ ఆ సంస్థ తమ ఆదేశాలను పాటించలేదని పీటీఏ తెలిపింది. దీంతో పాకిస్తాన్‌లో టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు పీటీఏ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలతోనే జరిగిందని కొందరు అధికారులు చెప్పారు.

ఈ ఏడాది జూలైలోనే టిక్‌టాక్‌కు పీటీఏ చివరి హెచ్చరిక జారీచేసింది. టిక్‌టాక్‌లో పోస్ట్ అవుతున్న అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించాలని కోరింది. మరోవైపు పాకిస్తాన్ ఈ యాప్‌ను దాదాపు 39 మిలియన్స్ డౌన్‌లోడ్ చేశారు. పాక్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్ తర్వాత ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ ఉందని అనలైటిక్స్ సంస్థ సెన్సార్ టవర్ తెలిపింది. పాకిస్తాన్ టిక్‌టాక్‌పై నిషేధం విధించడంపై.. ఆ సంస్థ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక, టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ లాహోర్ హైకోర్టులో ఇటీవల ఓ అప్లికేషన్ ఫైల్ అయింది. ఓ సిటీజన్ తరఫున లాయర్ నదీమ్ సర్వార్ ఈ అప్లికేషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.

First published:

Tags: Pakistan, Tiktok

ఉత్తమ కథలు