Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Aarogya Setu: బీ అలర్ట్... నకిలీ ఆరోగ్య సేతు యాప్‌తో వల వేస్తున్న పాకిస్తాన్

    Fake Aarogya Setu App | ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని మీకు వాట్సప్‌లో ఏదైనా మెసేజ్ వచ్చిందా? అందులో APK ఫైల్ లింక్ ఉందా? జర జాగ్రత్త.

    news18-telugu
    Updated: May 1, 2020, 10:58 AM IST
    Aarogya Setu: బీ అలర్ట్... నకిలీ ఆరోగ్య సేతు యాప్‌తో వల వేస్తున్న పాకిస్తాన్
    ఆరోగ్య సేతు యాప్‌పై ప్రజలకు కేంద్రం ప్రత్యేక సూచన
    • Share this:
    ఆరోగ్య సేతు యాప్... ఇటీవల ఇండియాలో బాగా పాపులర్ అయిన మొబైల్ అప్లికేషన్. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేసిన అప్లికేషన్ ఇది. కాంటాక్ట్ ట్రేసింగ్, కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ట్రాకింగ్ కోసం ఈ యాప్‌ను ఉపయోగించుకుంటోంది భారత ప్రభుత్వం. ఇక్కడ కూడా పాకిస్తాన్ కుట్రలు పన్నుతోంది. భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య సేతు యాప్‌ పేరుతో నకిలీ యాప్ రూపొందించింది. పాకిస్తాన్‌లోని కొన్ని ఏజెన్సీలు ఈ నకిలీ ఆరోగ్య సేతు యాప్‌ భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేసేందుకు కుట్రలు చేస్తున్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. జాగ్రత్తగా ఉండాలని భారత సైనిక సిబ్బందిని అలర్ట్ చేశారు.

    శతృదేశంలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు Aarogya Setu.apk పేరుతో ప్రమాదకరమైన యాప్‌ను రూపొందించాయి. వాటిని పాకిస్తానీ ఇంటలెజెన్స్ ఆపరేటీవ్స్ భారత ఆర్మీ సిబ్బంది వాట్సప్ గ్రూప్స్‌లోకి పంపించేందుకు కుట్రలు పన్నుతున్నాయి. ఇప్పటికే పాకిస్తానీ ఏజెన్సీలు భారతీయుల పేర్లతో సోషల్ మీడియా అకౌంట్లను సృష్టించి భారత సైనిక సిబ్బందిని టార్గెట్ చేస్తున్నాయి. Anoshka Chopra పేరుతో పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేట్ చేస్తున్న అకౌంట్ ద్వారా హానికరమైన అప్లికేషన్‌ను పంపినట్టు గుర్తించాం.

    ఆర్మీ హెచ్చరిక


    పాకిస్తానీ స్పై ఏజెన్సీలు రూపొందించిన ఇలాంటి అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేయొద్దని భారత ఆర్మీ సైనికుల్ని హెచ్చరించింది. అంతేకాదు భారతీయులు ఆరోగ్య సేతు అప్లికేషన్‌ను భారత ప్రభుత్వానికి చెందిన అధికారిక mygov.in వెబ్‌సైట్ లేదా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లేదా ఐఓఎస్ యాపిల్ ప్లే స్టోర్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేయాలని భారత ఆర్మీ సూచిస్తోంది. వాట్సప్‌లో, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే Aarogya Setu.apk ఫైల్‌ను ఎట్టిపరిస్థితుల్లో డౌన్‌లోడ్ చేయొద్దు.

    కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆరోగ్య సేతు అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయాలని అన్ని సాయుధ బలగాల సిబ్బందిని కోరింది ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఉపయోగిస్తున్నారు. ఓవైపు భారతదేశం కరోనా వైరస్‌తో పోరాడుతుంటే, పాకిస్తాన్ మాత్రం భారతదేశానికి టెర్రరిజాన్ని ఎక్స్‌పోర్ట్ చేయడంలో బిజీగా ఉందని ఇటీవలే ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే అన్న సంగతి తెలిసిందే.

    ఇవి కూడా చదవండి:

    Smartphones: లాక్‌డౌన్ తర్వాత మార్కెట్లోకి వచ్చే 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    Home Loan: మీ హోమ్ లోన్ ఈఎంఐ తగ్గించుకునే టెక్నిక్ ఇదే

    Online Courses: భారతీయులు నేర్చుకుంటున్న టాప్ 10 కోర్సులు ఇవే
    Published by: Santhosh Kumar S
    First published: May 1, 2020, 10:58 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading