Apps: ఈ 30 యాప్స్‌ని బ్యాన్ చేసిన గూగుల్... మీరూ వెంటనే డిలిట్ చేయండి

Apps: ఈ 30 యాప్స్‌ని బ్యాన్ చేసిన గూగుల్... మీరూ వెంటనే డిలిట్ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Google Banned Apps | గూగుల్ ప్లేస్టోర్‌లోని 30 యాప్స్‌ని బ్యాన్ చేసింది. మీ ఫోన్‌లో ఆ యాప్స్ ఉంటే వెంటనే డిలిట్ చేయండి.

  • Share this:
    అనవసరమైన యాడ్స్‌తో యూజర్లకు చికాకు పుట్టిస్తున్న 30 యాప్స్‌ని ప్లేస్టోర్ నుంచి తొలగించింది గూగుల్. ఈ యాప్స్ అన్నీ యూజర్లకు అవసరం లేని యాడ్స్ చూపిస్తున్నాయి. అంతేకాదు... యూజర్ల ప్రమేయం లేకుండా లింక్స్ క్లిక్ చేసి ఇతర వెబ్‌సైట్లకు తీసుకెళ్తున్నాయి. దీంతో వీటిని ప్లేస్టోర్ నుంచి గూగుల్ తీసేసింది. అయితే ఇప్పటికే ఈ యాప్స్‌ని ఇన్‍స్టాల్ చేసుకున్న యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి వాటిని తొలగించాలని వైట్ ఆప్స్ సెక్యూరిటీ రీసెర్చర్స్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్స్‌ని లక్షలాది యూజర్లు డౌన్‌లోడ్ చేశారు. మరి మీరు కూడా ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసినట్టైతే వెంటనే డిలిట్ చేయండి.

    Yoroko Camera
    Solu Camera
    Lite Beauty Camera
    Beauty Collage Lite
    Beauty & Filters Camera
    Photo Collage & Beauty Camera
    Beauty Camera Selfie Filter
    Gaty Beauty Camera
    Pand Selife Beauty Camera
    Caoon Photo Editor & Selfie Beauty Camera
    Benbu Selife Beauty Camera
    Pinut Selife Beauty Camera & Photo Editor
    Mood Photo Editor & Selife Beauty Camera
    Rose Photo Editor & Selfie Beauty Camera
    Selife Beauty Camera & Photo Editor
    Fog Selife Beauty Camera
    First Selife Beauty Camera & Photo Editor
    Vanu Selife Beauty Camera
    Sun Pro Beauty Cameraa
    Funny Sweet Beauty Camera
    Little Bee Beauty Camera
    Beauty Camera & Photo Editor Pro
    Grass Beauty Camera
    Ele Beauty Camera
    Flower Beauty Camera
    Best Selfie Beauty Camera
    Orange Camera
    Sunny Beauty Camera
    Pro Selfie Beauty Camera
    Selfie Beauty Camera Pro
    Elegant Beauty Cam-2019

    బ్యూటీ, సెల్ఫీ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన యాప్స్ ఇవి. 2019 జనవరి నుంచి గూగుల్ యాప్ స్టోర్‌లో ఉన్నాయి. ప్లేస్టోర్‌లోని గూగుల్ సెక్యూరిటీ సర్వీస్ కొన్ని వారాల క్రితం ఈ యాప్స్‌ని గుర్తించింది.

    ఇవి కూడా చదవండి:

    Chinese Apps: ఈ 52 చైనా యాప్స్ డేంజర్: ఇండియన్ ఇంటెలిజెన్స్

    Samsung Smart TV: సాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్‌టీవీలు వచ్చేశాయి... ధర రూ.14,490 నుంచి

    Flipkart: మీ స్మార్ట్‌ఫోన్ పాడైందా? రూ.99 చెల్లిస్తే ఇంటి దగ్గరే రిపేర్
    Published by:Santhosh Kumar S
    First published: