Home /News /technology /

OVER 10 MILLION ANDROID USERS AFFECTED BY NEW GRIFTHORSE MALWARE CHECK DETAILS JNK GH

Grift-horse Malware: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ‘గ్రిఫ్ట్‌ హార్స్‌' మాల్‌వేర్‌‌.. యూజర్లకు తెలియకుండానే డబ్బులు మాయం

ఆండ్రాయిడ్ ఫోన్లలోకి గ్రిఫ్ట్ హార్స్ మాల్‌వేర్.. యూజర్లకు హెచ్చరిక

ఆండ్రాయిడ్ ఫోన్లలోకి గ్రిఫ్ట్ హార్స్ మాల్‌వేర్.. యూజర్లకు హెచ్చరిక

ప్రస్తుతం ‘గ్రిఫ్ట్‌ హార్స్‌' అని పిలిచే ఒక కొత్త మాల్‌వేర్‌ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు భయం పుట్టిస్తోంది. ఇప్పటికే 10 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ మాల్‌వేర్‌ కి బాధితులయ్యారని నివేదికలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం ‘గ్రిఫ్ట్‌ హార్స్‌' అని పిలిచే ఒక కొత్త మాల్‌వేర్‌ (Malware) ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆండ్రాయిడ్ (Android) యూజర్లకు భయం పుట్టిస్తోంది. ఇప్పటికే 10 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ (Smart Phone) యూజర్లు ఈ మాల్‌వేర్‌ కి బాధితులయ్యారని నివేదికలు పేర్కొంటున్నాయి. 2020 నవంబర్ నుంచే ఈ మాల్‌వేర్‌ యూజర్లను టార్గెట్ చేయడం ప్రారంభించిందని చెబుతున్నారు మొబైల్ సెక్యూరిటీ సంస్థ జింపెరియం (Zimperium) భద్రతా నిపుణులు. ఈ సెక్యూరిటీ సంస్థ రీసెర్చ్ ప్రకారం, మాల్‌వేర్‌ కలిగిన అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store), థర్డ్-పార్టీ అప్లికేషన్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లలోని కోడ్స్‌లో గ్రిఫ్ట్‌ హార్స్‌ మాల్‌వేర్‌ సీక్రెట్ గా చొరబడుతుంది. తర్వాత యూజర్లను హానికరమైన లింక్స్ పై క్లిక్ చేసేలా చేసి ప్రోత్సహించి తెలివిగా డబ్బులు కాజేస్తుంది.

ఈ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ డిస్క్రిప్షన్, రిక్వెస్ట్ పర్మిషన్లు హానికరమైనవి కానట్లుగా కనిపిస్తాయని జింపెరియం సంస్థ తెలిపింది. కానీ యూజర్లు వీటిని డౌన్లోడ్ చేసుకొని అన్ని పర్మిషన్ రిక్వెస్టులను యాక్సెప్ట్ చేస్తే.. జేబు గుల్ల అవడం ఖాయం. ఈ డేంజరస్ అప్లికేషన్లు.. యూజర్లకు తెలియకుండా వారి బ్యాంక్ అకౌంట్ నుంచే ఏదో ఒక ప్రీమియం సర్వీసును సబ్‌స్క్రైబ్ చేయిస్తాయి. దాని వల్ల ప్రతి నెలా ప్రీమియం సేవల కోసం యూజర్ల బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి.

Banned Apps: 136 యాప్స్‌పై గూగుల్ నిషేధం..ఇవి చాలా డేంజర్.. మీ ఫోన్‌లో ఉంటే తీసేయండి




గ్రిఫ్ట్‌ హార్స్‌ మాల్ వేర్ ట్రోజన్‌గా పనిచేస్తుందని జింపెరియం జెడ్ లాబ్స్ వెల్లడించింది. ఇది అన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌లను టార్గెట్ చేయగలదు. ఈ మాల్ వేర్ పెయిడ్ సర్వీసెస్ (paid services)లకు సబ్‌స్క్రైబ్ చేసి.. నెలకు సుమారు 36 యూరోల(సుమారు రూ.3,100) ప్రీమియం ఛార్జ్ చేస్తుంది. యూజర్ల మొబైల్ ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి స్థానిక భాషలోనే హానికరమైన పేజీస్ సెండ్ చేసి క్లిక్ చేసేలా చేస్తుంది. ప్రతి ఒక్క యూజర్ కి వారి మాతృభాషలోనే ప్రకటనలు సెండ్ చేస్తుండటంతో.. దీని సక్సెస్ రేటు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.

ఈ మోసపూరిత ప్రచారం 70 కంటే ఎక్కువ దేశాలకు చెందిన యూజర్లను టార్గెట్ చేసింది. ఈ గ్రిఫ్ట్‌ హార్స్‌ అనేది 2021లో బాగా వ్యాప్తి చెందిన మాల్‌వేర్‌ లలో ఒకటి అని జింపెరియం జెడ్ లాబ్స్ తెలిపింది. ఈ మాల్‌వేర్‌ చూడడానికి చాలా అఫీషియల్ గా కనిపించే పాప్ అప్స్(pop ups), నోటిఫికేషన్స్, వివిధ గిఫ్ట్ ఆఫర్స్, స్పెషల్ ఆఫర్స్ యూజర్లకు సెండ్ చేస్తుంది. యూజర్లు ఇవి నిజమేనని పొరబడి క్లిక్ చేస్తే అది వెంటనే ఒక వెరిఫికేషన్ పేజీకి తీసుకువెళుతుంది.

Motorola Edge 20 Pro: ఫ్లాగ్‌షిప్ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో వచ్చేసింది... ధర ఎంతంటే




బహుమతి స్వీకరించాలన్నా.. లేదా స్పెషల్ ఆఫర్ పొందాలన్నా.. మీ డీటెయిల్స్ ఇవ్వాలంటూ ఆ వెరిఫికేషన్ పేజీ అడుగుతుంది. ఆ పేజీ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం డీటెయిల్స్ ఇస్తే మీకు తెలియకుండానే మీరు అంతట మీరే.. స్పెషల్ ప్రీమియం ఎస్ఎంఎస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నట్లు అవుతుంది. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ను సదరు పేజీ ఎస్ఎంఎస్ ఆపరేటర్ సంస్థతో పంచుకుంటుంది. దాంతో ప్రతి నెలా మీ బ్యాంకు ఖాతా నుంచి 36 యూరోలు కట్ అవుతాయి.

హ్యాండ్ ట్రాన్స్‌లేటర్ ప్రో, హార్ట్ రేట్ అండ్ పల్స్ ట్రాకర్, జియోస్పాట్: జీపీఎస్ లొకేషన్ ట్రాకర్, ఐకేర్ - లొకేషన్ ఫైండ్, మై చాట్ ట్రాన్స్‌లేటర్ వంటి కొన్ని ప్రముఖ యాప్‌లలో కూడా గ్రిఫ్ట్ హార్స్ మాల్వేర్ ఉందని జింపెరియం కనిపెట్టింది. భారతదేశంలోని యూజర్లు కూడా దీని వల్ల కూడా ప్రభావితమయ్యారని తెలిపింది. యాప్ డిఫెన్స్ అలయన్స్‌లో మెంబర్ అయిన జింపేరియం గూగుల్‌కి గ్రిఫ్ట్ హార్స్ మాల్ వేర్ కలిగిన యాప్‌ల గురించి తెలియజేసింది. దాంతో ప్లే స్టోర్ నుంచి అన్ని గ్రిఫ్ట్ హార్స్ సోకిన యాప్‌లను గూగుల్ బ్యాన్ చేసింది. అయితే, ఈ యాప్‌లు ఇప్పటికీ థర్డ్ పార్టీ యాప్ స్టోర్‌లలో ఉండవచ్చు కాబట్టి వీటి గురించి కచ్చితంగా తెలుసుకుని ఉండాలి.
Published by:John Naveen Kora
First published:

Tags: Android

తదుపరి వార్తలు