Oukitel WP15: ఓకిటెల్ WP15 5జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్.. 15,600 ఎంఏహెచ్ బ్యాటరీ గల ఏకైక స్మార్ట్​ఫోన్​.. ఒక్కసారి చార్జ్ చేస్తే ఎన్ని గంటలు వస్తుందో తెలుసా..?

(Image-Twitter/Oukitel)

ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ ఓకిటెల్ నుంచి ఓకిటెల్​ WP15 5G స్మార్ట్​ఫోన్​ విడుదలైంది. దీనిలో అతి పెద్ద 15,600 ఎంఏహెచ్​ బ్యాటరీని అందించింది.

  • Share this:
ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ ఓకిటెల్ నుంచి ఓకిటెల్​ WP15 5G స్మార్ట్​ఫోన్​ విడుదలైంది. దీనిలో అతి పెద్ద 15,600 ఎంఏహెచ్​ బ్యాటరీని అందించింది. దీన్ని ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే స్టాండ్‌బై మోడ్​లో 1,300 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఇది130 గంటల కాలింగ్‌ని కూడా అందిస్తుంది. సాధారణ వినియోగంలో నాలుగు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్​ ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్​లో లభిస్తున్న స్మార్ట్​ఫోన్లలో(Smartphones) 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ అందిస్తుండగా.. దీనిలో ఏకంగా 15,600 ఎంఏహెచ్ బ్యాటరీని అందించడం విశేషం. ఈ ఫోన్ కార్బన్ ఫైబర్ ఆకృతి ఆధారిత డిజైన్‌తో వస్తుంది.

ధర, లభ్యత
ఓకిటెల్​ సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. దీని 8జీబీ ర్యామ్​ + 128జీబీ స్టోరేజ్ మోడల్ $ 299.99 (సుమారు రూ. 22,200) ధర వద్ద లభిస్తుంది. ఇది సింగిల్ క్లాసిక్ బ్లాక్ కలర్​ ఆప్షన్​లో అందుబాటులో ఉంటుంది. ప్రముఖ ఈ–కామర్స్ (E Commerce)​ సైట్​ అలీ ఎక్స్​ప్రెస్​ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆఫర్​ కింద మొదటి 100 మంది కొనుగోలుదారులకు ఓకిటెల్ వి 10 స్మార్ట్ వాచ్​ని ఉచితంగా అందిస్తోంది. మరోవైపు, 101 నుండి 600వ కొనుగోలుదారులకు టిడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్​తో సహా ఇతర అన్ని దేశాల్లో అందుబాటులో ఉంటుంది.

Dual-screen MacBook: డ్యూయల్​ స్క్రీన్ మ్యాక్​బుక్​ పేటెంట్ హక్కులు సాధించిన యాపిల్ సంస్థ.. త్వరలో డిజైన్ మారనుందా?

స్పెసిఫికేషన్లు
ఓకిటెల్​ WP15 5జీ స్మార్ట్​ఫోన్(Oukitel WP15 5G SmartPhone)​ ఆండ్రాయిడ్​ 11 పై పనిచేస్తుంది. ఇది 6.52 -అంగుళాల HD+ ఇన్‌సెల్ IPS డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. దీనిలో 8 జీబీ ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ని అందించింది. హైబ్రిడ్ మైక్రో ఎస్​డీ కార్డ్ స్లాట్ సహాయంతో 256 జీబీ వరకు స్టోరేజ్​ను విస్తరించుకోవచ్చు. కెమెరా విషయానికొస్తే, ఓకిటెల్​ WP15 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 48 -మెగాపిక్సెల్ మెయిన్​ కెమెరా, 2 -మెగాపిక్సెల్ మైక్రో లెన్స్, 0.3 -మెగాపిక్సెల్ బొకే లెన్స్‌ కెమెరాలను చేర్చింది. ఇక, దీని ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్​ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 15,600mAh అతి పెద్ద బ్యాటరీతో వస్తుంది. ఇది 1,300 గంటల స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుంది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఈ ఫోన్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది, కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే,. యూఎస్​బీ టైప్-సి పోర్ట్, బ్లూటూత్ v5.1, వైఫై 802.11 ac, డ్యూయల్ 5G, వైఫై డైరెక్ట్, ఎన్​ఎఫ్​సీ వంటివి చేర్చింది.
Published by:Sumanth Kanukula
First published: