Home /News /technology /

OTT PLANS NETFLIX VS HOTSTAR VS AMAZON PRIME VIDEO PRICE DETAILS OF POPULAR OTT PLANS GH EVK

OTT Plans: నెట్‌ఫ్లిక్స్ vs హాట్‌స్టార్ vs అమెజాన్ ప్రైమ్ వీడియో.. ప్రముఖ ఓటీటీ​ ప్లాన్ల ధరల వివ‌రాలు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

OTT Plans: నెట్​ఫ్లిక్స్​(Netflix) తన మొబైల్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్ల సబ్​స్క్రిప్షన్​ ధరలు తగ్గించింది. సరసమైన ధరలోనే వీటిని అందుబాటులోకి తెచ్చింది. డిస్నీ ప్లస్​ హాట్​స్టర్​, అమెజాన్​ ప్రైమ్ (Amazon Prime)​, జీ5, సోనీ లివ్​ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫారమ్‌లు కూడా సరసమైన సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లతో యూజర్లను ఆకర్షిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
స్మార్ట్​ఫోన్లు (Smart Phone), స్మార్ట్​టీవీల వినియోగం పెరగడంతో ప్రతి ఇంట్లో ఓటీటీ ప్లాట్‌ఫాంల వినియోగం సర్వసాధారణంగా మారిపోయింది. కరోనా తర్వాత ఈ మార్కెట్ మరింత విస్తరించింది. కరోనా భయంతో చాలా మంది థియేటర్లలో సినిమా చూసేందుకు జంకుతున్నారు. దీంతో ఇంట్లోనే ఎంటర్​టైన్​మెంట్​ వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్ ది టాప్ (OTT) రంగం వేగంగా విస్తరిస్తోంది. తద్వారా ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది. దీంతో వరుసగా తమ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​ ధరలు సవరిస్తున్నాయి. తాజాగా నెట్​ఫ్లిక్స్​ తన మొబైల్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్ల సబ్​స్క్రిప్షన్ (Subscription)​ ధరలు తగ్గించింది. సరసమైన ధరలోనే వీటిని అందుబాటులోకి తెచ్చింది. డిస్నీ ప్లస్​ హాట్​స్టర్​, అమెజాన్​ ప్రైమ్ (Amazon Prime)​, జీ5, సోనీ లివ్​ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫారమ్‌లు కూడా సరసమైన సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లతో యూజర్లను ఆకర్షిస్తున్నాయి. ఒరిజినల్ కంటెంట్, క్యూరేటెడ్ షోలు/సినిమాలను అందిస్తున్నాయి. ఏ ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఎంత ధరలో సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​ అమలు చేస్తుందనేది చూద్దాం.

నెట్​ఫ్లిక్స్​ (Netflix)

నెట్​ఫ్లిక్స్​ మొబైల్ ప్లాన్​ (480p, 1 మొబైల్) కోసం నెలకు రూ. 149 చెల్లించాలి. నెట్​ఫ్లిక్స్​​ బేసిక్ (480p, 1 డివైజ్​) ప్లాన్​ రూ. 199, నెట్​ఫ్లిక్స్​ స్టాండర్డ్ ప్లాన్​ (1080p, 2 డివైజెస్​) రూ. 499, నెట్​ఫ్లిక్స్​ ప్రీమియం (4 కె హెచ్​డీఆర్​, 4 డివైజెస్​) ప్లాన్ రూ. 649 వద్ద అందుబాటులో ఉన్నాయి.

Xiaomi 12 Ultra: అదిరిపోయే లుక్‌.. టాప్ ఫీచ‌ర్స్‌తో షియోమి 12 ఆల్ట్రా


అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

ప్రైమ్ మెంబర్‌షిప్‌తో ప్రైమ్ వీడియో యాక్సెస్​తో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తోంది అమెజాన్​. ఇటీవల అమెజాన్​ ప్రైమ్​ తన సబ్​స్క్రిప్షన్​​ ధరలను పెంచింది. ప్రైమ్ మ్యూజిక్‌కి యాక్సెస్, ప్రొడక్ట్స్​ కొనుగోళ్లపై డిస్కౌంట్‌, ఉచిత డెలివరీ వంటి అనేక ప్రయోజనాలు అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ మూడు నెలల ప్లాన్​ కోసం రూ. 549 చెల్లించాలి. అమెజాన్ ప్రైమ్ నెలవారీ ప్లాన్​ రూ. 179, అమెజాన్ ప్రైమ్ యాన్యువల్ ప్లాన్​ రూ. 1,499 వద్ద అందుబాటులో ఉంటాయి.

డిస్నీ ప్లస్​ హాట్‌స్టార్ (Disney+ Hotstar)

డిస్నీ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ హాట్​స్టార్.. క్రికెట్ (ఐపీఎల్​), ఫుట్‌బాల్ (ఈపీఎల్​) స్ట్రీమింగ్​ హక్కులు పొందింది. దీంతో భారత్​లో పాపులర్​ ఓటీటీ వేదికగా రాణిస్తోంది. ఇది ఎఫ్​1 సీజన్, ప్రో కబడ్డీ వంటి లైవ్ స్పోర్ట్స్​తో పాటు మొత్తం డిస్నీ రోస్టర్‌ను కూడా కవర్ చేస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ బేసిక్ (హెచ్​డీ, మొబైల్ ఫోన్​) ప్లాన్​ రూ. 499 వద్ద లభిస్తుంది. ఇక, డిస్నీ+ హాట్‌స్టార్ రెగ్యులర్ (హెచ్​డీ, రెండు డివైజెస్​) ప్లాన్​ రూ. 899 వద్ద, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం (4K, నాలుగు డివైజెస్​) ప్లాన్​ రూ. 1,499 వద్ద అందుబాటులో ఉన్నాయి.

Best Smartwatches: స్మార్ట్ వాచ్ కొనాల‌నుకొంటున్నారా..? ఇండియ‌న్ మార్కెట్‌లో బెస్ట్ ఇవే


సోనీ లివ్ (Sony Liv)

యూఈఎఫ్​ఏ టోర్నమెంట్‌లతో సహా దాని లైవ్ స్పోర్ట్స్ కవరేజీ అందిస్తున్న సోనీ లివ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​గా రాణిస్తోంది. సోనీ లివ్​ స్పెషల్​​ ప్లాన్ కొరకు​ సంవత్సరానికి రూ. 199 చెల్లించాల్సి ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌వర్క్ ప్లాన్ రూ. 299, స్పెషల్​ ప్లస్​ ప్లాన్ రూ. 399 వద్ద లభిస్తాయి. నెల రోజుల వ్యవధి గల ప్రీమియం ప్లాన్ కొరకు​ రూ. 299, ఆరు నెలలకు రూ. 699, సంవత్సరానికి రూ. 999 చెల్లించాల్సి ఉంటుంది.

జీ5 (Zee5)

ఎస్సెల్​ గ్రూప్​ యాజమాన్యంలోని జీ5 వివిధ రకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లు వార్తా కార్యక్రమాలను అందిస్తుంది. ఇటీవలే ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఫ్రెండ్స్ ది రీయూనియన్ వెబ్​సిరీస్​ ప్రారంభమైంది. దీంతో భారీ ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం జీ5 యాన్యువల్ ప్లాన్​ (3 స్క్రీన్‌లు) రూ. 499 వద్ద లభిస్తోంది. మూడు నెలల ప్లాన్​ (2 స్క్రీన్‌లు) రూ 299 వద్ద అందుబాటులో ఉంది.
Published by:Sharath Chandra
First published:

Tags: Amazon prime, Disney plus hotstar, Disney+ Hotstar, Netflix, Ott, Zee5

తదుపరి వార్తలు